13 మంది మాజీ ముఖ్యమంత్రులు ఓటమి.. 11 మందిపై బీజేపీ గెలుపు

ఫొటో సోర్స్, facebook
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
2019 సార్వత్రిక ఎన్నికలు దేశంలోని కీలక నేతలకు పరాజయాన్ని రుచిచూపించాయి. ఈ ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసిన 13 మంది వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఓటమి పాలయ్యారు. ఒక మాజీ ప్రధాని కూడా ఓటమిని మూటగట్టుకున్నారు.
ఓటమి పాలైన మాజీ ముఖ్యమంత్రుల్లో అత్యధికులు కాంగ్రెస్ పార్టీకి చెందినవారే.
కర్నాటక, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఇద్దరేసి మాజీ సీఎంలు ఈసారి ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.
కర్నాటకలో దేవెగౌడ, వీరప్పమొయిలీ
దేశానికి ఒకసారి ప్రధానిగాను, కర్నాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానూ పనిచేసిన సీనియర్ నేత, జనతాదళ్(సెక్యులర్) పార్టీకి చెందిన హెచ్‌డీ దేవెగౌడ కర్నాటకలోని తుముకూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఈసారి బరిలో దిగారు. అక్కడ బీజేపీ నుంచి బరిలో దిగిన జీఎస్ బసవరాజ్ 13,339 ఓట్ల తేడాతో దేవెగౌడపై విజయం సాధించారు.
మహారాష్ట్రలో
మహారాష్ట్ర మాజీ సీఎంలు అశోక్ చవాన్, సుశీల్ షిండేలు కూడా ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.
వీరిలో సుశీల్ కుమార్ షిండే కేంద్ర హోం మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు.
షిండే తనకు ఇవే చివరి ఎన్నికలంటూ ప్రజల్లోకి వెళ్లినప్పటికీ ఆయనకు అవకాశం దక్కలేదు.
ఝార్ఖండ్‌లో
ఝార్ఖండ్‌కు గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన శిబూ సొరేన్, బాబూలాల్ మరాండీలు సైతం ఓటమి పాలయ్యారు.
వీరిద్దరూ బీజేపీ అభ్యర్థుల చేతిలోనే ఓటమి చవిచూశారు.

ఫొటో సోర్స్, Getty Images
మూడోస్థానంలో నిలిచిన జమ్ముకశ్మీర్ మాజీ సీఎం
జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసిన మెహబూబా ముఫ్తీ ఓటమి పాలయ్యారు.
అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ నేత హస్నైన్ మసూదీ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత గులాం అహ్మద్ మీర్‌పై 6676 ఓట్ల తేడాతో గెలిచారు.
ఈ నియోజకవర్గంలో పీడీపీ అధ్యక్షురాలు, ఆ రాష్ట్ర మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మూడో స్థానంలో నిలిచారు.
ఓటమి పాలైన మాజీ సీఎంలు వీరే..
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీ ఘన విజయాన్ని ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి...
- జనసేన పార్టీ వైఫల్యానికి, పవన్ కల్యాణ్ ఓటమికి కారణాలేంటి?
- ఎడిటర్స్ కామెంట్: ‘విజన్’పై 'విశ్వసనీయత' విజయం
- తెలుగు నేలపై మరో యంగ్ సీఎం
- నరేంద్ర మోదీ: ఆర్ఎస్ఎస్ సాధారణ కార్యకర్త నుంచి ‘అసాధారణ బ్రాండ్’గా ఎలా మారారు?
- జగన్: ‘టీడీపీ 23 ఎమ్మెల్యే, 3 ఎంపీలను లాక్కుంది. వారికి దేవుడు సరిగ్గా 23వ తేదీన వాటినే ఇచ్చాడు’
- BBC Fact Check: ‘చంద్ర దోషము వీడేనయ.. రాజన్న రాజ్యంబు వచ్చేనయ’.. ఇది నిజమేనా?
- ‘పవర్’ స్టార్ ఆశలు గల్లంతు.. అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశమూ కోల్పోయిన పవన్ కల్యాణ్
- ‘ఈ ప్రజా తీర్పుకు ఏకైక కారణం.. నరేంద్ర మోదీ’: అభిప్రాయం
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు...
- మీ నియోజకవర్గ కొత్త ఎంపీ ఎవరో తెలుసుకోండి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల ఫలితాలు
- 'చౌకీదార్'కు వీడ్కోలు చెప్పిన మోదీ.. అసలు దాని వెనక కథేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








