'చౌకీదార్'కు వీడ్కోలు చెప్పిన మోదీ.. అసలు దాని వెనక కథేంటి

ఫొటో సోర్స్, Getty Images
17వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ పార్టీ ముందు నుంచి చెబుతూ వచ్చినట్టుగానే దాని మొత్తం సీట్ల సంఖ్య 300 దాటుతున్నట్టు కూడా తేటతెల్లమైంది.
ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ట్విటర్ పేరులోంచి 'చౌకీదార్' అనే పదాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పై ట్వీట్‌లో ఆయనిలా అన్నారు...
చౌకీదార్ స్ఫూర్తిని కొత్త స్థాయిలకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది.
ఆ స్ఫూర్తిని ఎల్లవేళలా సజీవంగా నిలిపి ఉంచుతాను. దేశ ప్రగతి కోసం పని చేస్తూనే ఉంటాను.
'చౌకీదార్' పదం ఇకపై నా ట్విటర్ పేరులో ఉండబోదు. అయితే అది నాలో అంతర్భాగంగా కొనసాగుతుంది.
మీరందరూ కూడా ఇలాగే చేయాలని నా విజ్ఞప్తి!
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇదీ చౌకీదార్ కథ...
అవినీతి, అభివృద్ధి అంశాలను ప్రధాన ప్రచారాంశాలుగా చేసుకొని నరేంద్ర మోదీ 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.
ఆయన అధికారం చేపట్టాక తనను తాను తరచూ చౌకీదార్ (కాపలాదారు)గా చెప్పుకుంటూ ఉండేవారు. దేశంలో అవినీతిని సహించబోనంటూ, అవినీతిని అడ్డుకునే కాపలాదారుగా ఉంటానంటూ పలు సందర్భాల్లో ఆయన చెప్పారు.
అట్లాగే, 'నా ఖావూంగా.. నా ఖానే దూంగా...' అని కూడా ఆయన తన ప్రసంగాల్లో ప్రకటించారు. అంటే తాను అవినీతికి పాల్పడను, మరొకరిని పాల్పడనివ్వను అనేది ఆయన మాటల్లోని అంతరార్థం.
రఫేల్ వివాదం - 'చౌకీదార్'పై ఆరోపణలు
రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు కాంగ్రెస్ సహా దేశంలోని పలు రాజకీయ పార్టీలు లేవనెత్తడం, దానిపై పెద్ద వివాదం చెలరేగడం అందరికీ తెలిసిందే.
ఈ వివాదం కారణంగా పార్లమెంటు పలు వారాల పాటు స్తంభించిపోయింది కూడా. ఆఖరుకు ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.
ఈ నేపథ్యంలోనే నవంబర్ 2018లో ఐదు రాష్ట్రాల్లో విధానసభ ఎన్నికలు ముందుకొచ్చాయి. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 'చౌకీదార్ చోర్ హై' అనే నినాదాన్ని లేవనెత్తారు.
రఫేల్ ఒప్పందంలో జరిగినట్టుగా చెబుతున్న అవినీతిలో ప్రధాని నరేంద్ర మోదీకి భాగం ఉందనేది ఆయన ఆరోపణల సారాంశం.
'మై భీ చౌకీదార్' ఉద్యమం
దీనికి జవాబుగా ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ 'మై భీ చౌకీదార్' (నేను కూడా కాపలాదారునే) పేరుతో ఓ ఆన్‌లైన్ ఉద్యమం ప్రారంభించింది.
'మై భీ చౌకీదార్' హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసిన మోదీ, దేశ ప్రజలందరూ చౌకీదార్‌లేనని ప్రకటించారు.
దేశంలో పేరుకుపోయిన అవినీతిని, మురికిని, సామాజిక రుగ్మతలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఒక రకంగా ఈ ఉద్యమం ద్వారానే బీజేపీ సార్వత్రిక ఎన్నికల సమరానికి శంఖం పూరించిందని చెప్పుకోవచ్చు.
ఈ ఉద్యమ ప్రభావంతో ప్రధాని మోదీతో ప్రారంభించి బీజేపీ మంత్రులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు లక్షలాది మంది సోషల్ మీడియాలో తమ పేరు మొదట్లో 'చౌకీదార్' అనే పదాన్ని చేర్చుకున్నారు.
అయితే, అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే మోదీ ఈ ఉద్యమాన్ని కృత్రిమ పద్ధతుల్లో ముందుకు తెచ్చారనే విమర్శలూ వచ్చాయి.
బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగవేశారన్న ఆరోపణలున్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారు దేశం వదిలి వెళ్లినపుడు చౌకీదార్ ఏం చేశారనే ప్రశ్నలు విపక్షాలు లేవనెత్తాయి.
అయితే, చివరకు ఎన్నికల్లో తమ పార్టీ మరోసారి ఘన విజయం సాధించబోతున్నట్టు స్పష్టం కాగానే, ప్రధాని నరేంద్ర మోదీ 'చౌకీదార్' పదాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.
ఇలా చేయడం ద్వారా ఆయన తమ ఉద్యమం విజయవంతమైందనే సంకేతాలిచ్చారు. అలాగే తనపై విపక్షాలు ఎక్కుపెట్టిన విమర్శలను ప్రజలు తోసిపుచ్చారన్న సందేశం కూడా ఈ నిర్ణయంలో దాగుందని భావించొచ్చు.
ఇవి కూడా చదవండి.
- ఎన్నికల ఫలితాలు 2019: ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో ఏం జరుగుతోంది
- ‘జగన్‌కు ఉన్న ప్రజాదరణ అప్పట్లో ఎన్టీఆర్‌కు మాత్రమే ఉండేది’
- ‘పవర్’ స్టార్ ఆశలు గల్లంతు.. ఇంతకీ పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడతారా లేదా?
- 57 ఏళ్ల తరువాత తెలుగు నేలపై యంగ్ సీఎం
- రాహుల్ గాంధీకి ఈ ఎన్నికలే అంతిమ పోరాటమా...
- 40,000 తాకిన సెన్సెక్స్.. చరిత్రలోనే తొలిసారి
- అమరావతి రైతుల సింగపూర్ యాత్రతో ఉపయోగం ఎంత?
- అభిప్రాయం: సమ న్యాయం జరిగేలా స్థానికతను నిర్వచించాలి
- చంద్రబాబు సాధిస్తారా? జగన్ అస్త్రంగా మలుచుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








