లోక్‌సభ ఎన్నికలు 2019: తొలిదశ పోలింగ్ సందర్భంగా GOOGLE డూడుల్

ఫొటో సోర్స్, Google
లోక్‌సభ ఎన్నికల తొలిదశ ఓటింగ్ సందర్భంగా సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించింది.
ఈ డూడుల్‌లో వేలికి సిరా చుక్క ఉన్నట్టు చూపిస్తున్న గూగుల్ దేశ ప్రజలకు ఓటు వేయాలని అపీల్ చేసింది.
ఈ డూడుల్‌పై క్లిక్ చేయగానే how to vote #india అనే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది.
అందులో ఓటు ఎలా వేయాలి అనే ప్రశ్నకు, గూగుల్ వివరంగా సమాధానం ఇచ్చింది.
ఓటరు లిస్టులో పేరు ఉన్నప్పుడే మీరు ఓటు వేయగలరని చెప్పిన గూగుల్.. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడం నుంచి ఈవీఎంలో ఓటు వేయడం, వీవీప్యాట్‌లో ఓటును ధ్రువీకరించుకోవడం గురించి కూడా చెప్పింది.
మీకు ఏ అభ్యర్థి నచ్చకపోతే నోటా(నన్ ఆఫ్ ది అబోవ్)కు కూడా ఓటు వేయవచ్చని, ఆ బటన్ ఈవీఎంలో చివరన ఉంటుందని తెలిపింది.
ఓటు వేయడంతోపాటు ఎలక్టోరల్ రోల్, అభ్యర్థులు, ఎన్నికల తేదీ, సమయం, ఈవీఎం, గుర్తింపు కార్డుల గురించి వివరంగా చెప్పింది.
డూడుల్ ద్వారా అందిస్తున్న వివరాలు ఓటర్లకు మరింత ఉపయోగకరంగా ఉండేందుకు దానికి సంబంధించిన వెబ్ సైట్ లింకులు కూడా అందించింది.
ఈవీఎంలో ఓటు ఎలా వేయాలో, వీవీప్యాట్‌లో మనం వేసిన ఓటు ఎలా కనిపిస్తుందో.. యూట్యూబ్ లింకుల ద్వారా స్పష్టంగా వివరించింది.
ఇవి కూడా చదవండి:
- రాయలసీమ: తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ ఘర్షణ.. తెలుగుదేశం కార్యకర్త మృతి
- ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
- ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 41 రోజుల్లో 24 కోట్ల రూపాయల విలువైన మద్యం స్వాధీనం
- జనసేన మేనిఫెస్టో: రైతులకు ఏటా రూ.8,000, రేషన్‌కు బదులుగా నగదు బదిలీ
- రాజకీయ పార్టీల నుంచి ముస్లిం మహిళలు ఏం కోరుకుంటున్నారు...
- ‘దక్షిణ భారతదేశాన్ని మోదీ పట్టించుకోవట్లేదు.. అందుకే నేను కేరళ నుంచి పోటీ చేస్తున్నా’ - రాహుల్ గాంధీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








