చెట్టెక్కిన ఆసియా సింహం: మోదీ ట్వీట్ చేసిన ఈ ఫొటో వెనక కథ ఏంటి

ఫొటో సోర్స్, dipak vadher
- రచయిత, దీపక్ చుదసమా
- హోదా, బీబీసీ ప్రతినిధి
మోదుగు చెట్టు ఎక్కిన ఆసియా సింహం ఫొటో ఒకటి అన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలలో వేగంగా వైరల్ అవుతోంది. చాలా మంది ఈ ఫొటోను తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తున్నారు.
కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఫొటోను రీట్వీట్ చేయడం వల్లే దీని గురించి చాలామందికి తెలిసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ ఫొటోను రీట్వీట్ చేసిన మోదీ దీనిని "అందమైన గిర్ సింహం, అద్భుతమైన చిత్రం" అని వర్ణించారు.
ఈ ఫొటోలో యువ సింహం ఒక మోదుగ చెట్టుపైకి ఎక్కి నిలబడి ఉంటుంది.
ఈ ఫొటోను బీట్ గార్డు దీపక్ వధేర్ తీశారు. ఈ వైరల్ ఫొటో వెనుక అసలు కథ గురించి తెలుసుకోడానికి బీబీసీ ప్రయత్నించింది.
దీపక్ వధేర్ ఈ ఫొటోను తన విధులకు వెళ్తుండగా దారిలో తీశారని జునాగడ్ డివిజన్‌లోని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ బెర్వాల్ చెప్పారు.
"బీట్ గార్డ్ దీపక్ రోజూలాగే తన బీటులో గస్తీ కాస్తున్నప్పుడు సింహం చెట్టెక్కి ఉండడం చూశారు. వెంటనే దాన్ని ఫొటో తీశారు" అని తెలిపారు.
"విధుల్లో భాగంగా దీపక్ వాటిని ఫొటోలు కూడా తీస్తుంటారు. తను అడవి ఫొటోలు, వేరే జంతువుల ఫొటోలు కూడా తీస్తుంటారు" అని సునీల్ చెప్పారు.
ముఖ్యంగా ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటో గురించి మాట్లాడిన సునీల్ "సింహం నిలబడి ఉన్న ఆ చెట్టు పెద్దదేం కాదు. కానీ ఆ ఫొటోను లో-యాంగిల్ నుంచి తీయడంతో అది పొడవాటి చెట్టులా కనిపిస్తోంది" అని తెలిపారు.
ఈ ఫొటోను గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఉన్న గిర్ అభయారణ్యంలో తీశారు. ఇది వంద కిలోమీటర్లకు పైగా వ్యాపించి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఫొటోలు తీయడం అంటే నాకు ఇష్టం
బీట్ గార్డు దీపక్ వధేర్ కూడా తను ఈ ఫొటోను ఎలా తీశారో బీబీసీకి చెప్పారు.
"నేను గిర్ అభయారణ్యంలో నా బీటులో ఉన్నా. అదే సమయంలో నాకు ఆ సింహం కనిపించింది. వయసులో ఉన్న ఆ సింహం కాసేపట్లోనే చెట్టెక్కేసింది. దాన్ని చూసినప్పుడు అది ఫొటోకు పోజిస్తున్నట్లు కనిపించింది. దాంతో నేను కెమెరా తీసి క్లిక్ చేశాను" అన్నారు.
"దీన్ని కొన్ని రోజుల క్రితం తీశాను. కానీ, అది ఇప్పుడు వైరల్ అవుతోంది. నాకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. నేను వేరే జంతువుల ఫొటోలు కూడా తీశాను".
"అడవిలో ఉన్న జంతువులను కాపాడడం, సింహాల జాడలు గుర్తించడం నా విధులు. నేను ఇప్పుడు అటవీ విభాగంలో ఉన్నాను కాబట్టి ఇక్కడ నా ఫొటోగ్రఫీ ఇష్టం కూడా తీరుతోంది. నాకు వాటిని ఫొటోలు తీయడం అంటే చాలా ఇష్టం" అన్నారు దీపక్.

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్‌లో సింహాల జనాభా
ప్రస్తుతం జునాగఢ్‌లోని గిర్ నేషనల్ పార్క్ లో 500కు పైగా సింహాలు ఉన్నాయి. ఏటేటా వాటి సంఖ్య పెరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
- ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోండి.. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి
- దేశంలో అత్యంత సుదీర్ఘ ఎన్నికలు ఇవేనా.. ఇది బీజేపీకి లాభిస్తుందా
- ఏపీలో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఏ నియోజకవర్గంలో ఉన్నారో తెలుసా?
- రియాలిటీ చెక్: బుల్లెట్ రైలు గడువులోగా పట్టాలెక్కుతుందా?
- హరప్పా నాగరికతనాటి ‘దంపతుల’ సమాధి చెబుతున్న చరిత్ర
- అమెరికాకు ఆ పేరు పెట్టిన మధ్యయుగాల నాటి మ్యాప్ ఇదే
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- లోక్‌సభ ఎన్నికలు... ముఖ్యమైన తేదీలు 8 చార్టుల్లో..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










