పెంపుడు సింహమే ప్రాణం తీసింది

ఫొటో సోర్స్, ZDENEK NEMEC / MAFRA / PROFIMEDIA
చెక్ రిపబ్లిక్‌లో ఒక వ్యక్తి తను ఇంట్లో పెంచుకుంటున్న సింహం దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.
మైఖేల్ ప్రసేక్ అనే వ్యక్తి తొమ్మిదిన్నరేళ్ల సింహంతో పాటు ఒక సివంగిని కూడా ఇంట్లో పెంచుకున్నాడు. వాటి సంతతిని పెంచటానికి ఆయన వీటిని కొనుక్కున్నాడు.
ఇంట్లో సింహాలను పెంచుకోవటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు.
అయితే.. మైఖేల్ ఆదివారం నాడు సింహం బోనులో నిర్జీవంగా పడి ఉండటాన్ని ఆయన తండ్రి గుర్తించారు.
బోను లోపలి వైపు నుంచి తాళం వేసి ఉందని ఆయన స్థానిక మీడియాకు చెప్పారు.
మైఖేల్ మరణం గురించి పోలీసులకు తెలియజేయటంతో వీరి ఇంటికి వచ్చిన అధికారులు.. రెండు వేర్వేరు బోన్లలో ఉన్న సింహాల జంటను తుపాకీతో కాల్చి చంపారు.
బోనులో ఉన్న ‘‘మైఖేల్ శరీరాన్ని బయటకు తేవాలంటే ఆ సింహాలను కాల్చివేయటం తప్పనిసరి’’ అని పోలీసు అధికార ప్రతినిధి ఒకరు మీడియాతో పేర్కొన్నారు.
సింహాల పెంపకంపై అధికారులతో ఘర్షణ...
మైఖేల్ వయసు 33 సంవత్సరాలు. ఆయన 2016లో ఈ సింహాన్ని, సివంగిని కొన్నాడు. తన స్వగ్రామం జెచోవ్‌లో ఇంటి వెనుక సొంతంగా తయారు చేసిన బోనుల్లో వాటిని ఉంచాడు.
ఈ బోనుల నిర్మాణానికి అంతకుముందు అధికారులు అనుమతి ఇవ్వలేదు. చట్టవ్యతిరేకంగా సింహాల బ్రీడింగ్ చేస్తున్నందుకు ఆయనకు జరిమానా విధించారు.
అయితే.. ఆయన తన ఇంటి ఆవరణలోకి ఎవరూ ప్రవేశించటానికి నిరాకరించటంతో అధికారులతో ఆయన ఘర్షణ ఎటూ తేలలేదు.
చెక్ రిపబ్లిక్‌లో ప్రత్యామ్నాయ సదుపాయాలు కొరవడటం, జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించినట్లు ఆధారాలు లేకపోవటం వల్ల.. ఆ సింహాలను బలవంతంగా తరలించే అవకాశం లేకపోయింది.
గత వేసవిలో మైఖేల్ తన సివంగిని తాడుతో పట్టుకుని వాకింగ్‌కు తీసుకెళ్లినపుడు.. సైకిల్ మీద వెళుతున్న ఒక వ్యక్తి ఆ సివంగిని ఢీకొన్నాడు. దీంతో మైఖేల్ పతాక శీర్షికల్లోకి ఎక్కాడు.
ఆ ఘటనలో పోలీసులు జోక్యం చేసుకోవటంతో.. అది ట్రాఫిక్ యాక్సిడెంట్ (రోడ్డు ప్రమాదం)గా పరిగణించారు.
‘‘చాలా కాలంగా తేలకుండా ఉన్న ఈ సమస్యను ఈ నాటి ఘటన పరిష్కరించింది’’ అని జెచోవ్ మేయర్ తామస్ కొకూరెక్ వ్యాఖ్యానించారు.
- జోసెఫ్ స్టాలిన్: హిట్లర్నే భయపెట్టిన ఈయన హీరో మాత్రమే కాదు, విలన్ కూడా
- నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను ఎలా చిత్రహింసలు పెట్టిందంటే..
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
- మోదీ హయాంలో రహదారుల నిర్మాణం ఎన్ని రెట్లు పెరిగింది?
- పాకిస్తాన్‌ను ఉర్రూతలూగిస్తున్న ఎనిమిదేళ్ల బాలిక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









