పాకిస్తాన్‌ను తన పాటతో ఉర్రూతలూగిస్తున్న ఎనిమిదేళ్ల బాలిక

ఈ బాలిక పేరు సయీదా హదియా హష్మీ. వయసు ఎనిమిదేళ్లు. పాకిస్తాన్‌లో ఈమె గాత్రం ఓ సంచలనం.
ఆమె పాడే పాట ఓ పది సెకన్ల పాటు వింటే చాలు... ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.
'నెస్కెఫే బేస్మెంట్' అనే ఓ ప్రముఖ పాకిస్తానీ టీవీ మ్యూజిక్ షోలో ఈ అమ్మాయి పోటీ పడుతోంది.
ఆ షోలో పాల్గొన్నాక సయీదా ఒక సెలబ్రెటీ అయిపోయింది.
"ఇంతబాగా ఎలా పాడుతావు అని నా ఫ్రెండ్స్ అడుగుతుంటారు. అసలు ఈ షోకు ఎలా రాగలిగావు? అని అడుగుతారు. ఇదంతా అల్లా దయ అని వాళ్లకు చెబుతాను" అని సయీదా వివరించారు.
ఈ టీవీ షోకు ఎంపికైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. "టీవీ షో ఆడిషన్స్ కోసం చాలామందితో పాటు నేనూ వెళ్లాను. జుల్ఫీ గారు నాకు ఆడిషన్ చేశారు. నేను సజ్జద్ అలీ పాట పాడగానే ఆయన ఏడ్చేశారు. పాట పూర్తయ్యాక, ఆయన నోటివెంట మాట రాలేదు" అని బాలిక చెప్పారు.
"సయీదా మొదటిసారి నా దగ్గరకు వచ్చినపుడు, తను హై పిచ్‌లో పాడటం గమనించాను. తన స్వరంపై మరింత దృష్టి పెట్టాలని చెప్పాను. ఎంతసేపు ప్రాక్టీస్ చేసినా తను ఏమాత్రం అలసిపోదు. అద్భుతంగా పాడుతుంది" అని సయీదాకు సంగీతంలో శిక్షణ ఇచ్చిన గురువు వివరించారు.
ఇంతకు ముందుకూడా సయీదా ఎన్నో షోలలో పాల్గొంది. సంగీతంలో రాణించడంతోపాటు, బాగా చదువుకుని డాక్టర్ అవ్వాలన్నది తన ఆశయమని ఈ బాలిక చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









