ప్రపంచంలోనే అతిపెద్ద తేనెటీగ ఇదే

ఫొటో సోర్స్, Clay Bolt
అంతరించిపోయింది అనుకున్న ప్రపంచంలోనే అతి పెద్ద తేనెటీగ మళ్లీ కనిపించింది. ఇండోనేషియాలోని మారుమూల ద్వీపంలో ఈ భారీ తేనెటీగ బయటపడింది.
చాలా రోజుల అన్వేషణ తర్వాత వన్యప్రాణి నిపుణులు ఈ తేనెటీగను కనుగొన్నారు. పెద్ద వేళ్లతో ఉన్న ఈ ఆడ తేనెటీగ చిత్రాలను, వీడియోలను వారు తీశారు.
బ్రిటిష్ ప్రకృతి పరిశోధకుడు ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలేస్ 1858 లో ఈ తేనెటీగ గురించి వర్ణించారు. అప్పటి నుంచి ఈ కీటకాన్ని ఆయన పేరుతోనే వాలేస్‌గా పిలుస్తున్నారు.
1981లో శాస్త్రవేత్తలు అనేక రకాల తేనెటీగ జాతులను గుర్తించారు. కానీ, అందులో ఈ వాలేస్ జాతి కనిపించలేదు.

ఫొటో సోర్స్, Clay Bolt
‘‘‘ఫ్లయింగ్ బుల్‌డాగ్’గా కనిపించే దీన్ని చూస్తే ఊపిరి ఆగిపోతుంది. సరైన ఆధారాలు లేకుంటే అడవిలో ఇలాంటి కీటకం ఉందని మనం నమ్మలేం’’అని నేచరల్ హిస్టరీ ఫొటోగ్రాఫర్ క్లే బోల్ట్ అన్నారు.
ఈ అతిపెద్ద తేనెటీగ ఫొటోలు, వీడియోలను మొదటిసారి తీసింది ఈయనే.
‘‘అందమైన, భారీ తేనెటీగను చూడటం, వాటి రెక్కల శబ్దాన్ని వినడం, అది నా తలపై నుంచి వెళ్లడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇంతకీ దీన్ని ప్రత్యేకత ఏమిటి?
- రెక్కలతో కలిపి దీని పొడువు దాదాపు 6 సెం.మీ.. ప్రపంచంలో ఇదే అతి పెద్ద తేనెటీగ.
- ఈ జాతుల్లోని ఆడ తేనెటీగలు పుట్టల్లో గూడు కట్టుకొని ఉంటాయి. తమ పొడువాటి దవడతో చెట్ల నుంచి జిగురును సేకరించి తమ గూడును పటిష్టంగా మార్చుకుంటాయి.
- దట్టమైన చెట్లు ఉండే అడవుల్లోనే ఇవి నివసిస్తాయి. చెట్ల నుంచి వచ్చే జిగురుపై ఆధారపడుతాయి.
ఇండోనేసియాలోని ఉత్తర మొలక్కస్ దీవిలో దీన్ని కనుగొన్నారు. ఈ తేనెటీగ బయటపడటంతో అరుదైన జంతుజాతులకు ఈ ప్రాంతం కేంద్రంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ తేనెటీగను కనుగొన్న బృంద సభ్యుడు, ప్రిన్‌స్టంట్ వర్సిటీలోని ఎంటమాలజిస్ట్ ఎలీ వ్యామెన్ మాట్లాడుతూ.. ‘‘ఈ అతిపెద్ద తేనెటీగ ఆచూకీ కనిపెట్టడం వల్ల భవిష్యత్తులో దీనికి సంబంధించి పరిశోధనలు చేసేందుకు ఆస్కారం కలిగింది. వీటి గురించి పూర్తిగా అర్థం చేసుకోవడంతో పాటు, భవిష్యత్తులో వీటిని రక్షించేందుకు అవకాశం కలుగుతుంది’’ అని అన్నారు.
అంతరిస్తున్న జీవ జాతులను గుర్తించేందుకు ప్రపంచ వన్యప్రాణి పరిరక్షణ సంస్థ ఇటీవల ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఇండోనేసియాలో అన్వేషించిన బృందానికి మద్దతు అందించింది.
అరుదైన బొలీవియన్ కప్పలను కనిపెట్టినట్లు గత జనవరిలో ఇదే బృందం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- ఏపీలో దొరికిన కోహినూర్ వజ్రాన్ని ఎలా కొట్టేశారు?
- తెలంగాణ మంత్రివర్గం: ఈసారీ కనిపించని మహిళలు.. ‘మహిళలు ఇంట్లో ఉండట’మే కారణమా?
- సౌదీ అరేబియా, భారత్‌ల మధ్య స్నేహానికి అడ్డుగా నిలిచిందెవరు
- ‘‘కశ్మీర్ తల్లులారా... తప్పుదారి పట్టిన మీ పిల్లలను లొంగిపోమని చెప్పండి... లేదంటే చనిపోతారు’’
- భారత గూఢచారిగా పాక్ ఆరోపిస్తున్న కుల్‌భూషణ్ యాదవ్ ఎవరు...
- ఇయర్ ఫోన్స్ చెవిలో ఎంతసేపు పెట్టుకోవాలి
- శివాజీకి ముస్లింల పట్ల ద్వేషం నిజమేనా?
- అన్నదాత సుఖీభవ పథకం: ఎవరు అర్హులు? కౌలు రైతుల్ని ఎలా గుర్తిస్తారు?
- కశ్మీర్: ప్రజాభిప్రాయ సేకరణను భారత్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
- గోసా ఎక్కడికి వెళ్ళినా... తేనెటీగలు ఆయనను వదిలిపెట్టవు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








