అక్కడ ఎదురుచూపులు.. ఇక్కడ ఎదురుకాల్పులు

కశ్మీర్‌లో భద్రతాబలగాలు

ఫొటో సోర్స్, Getty Images

వాఘా సరిహద్దు వద్ద వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కోసం భారత దేశమంతా ఎదురుచూస్తున్న సమయంలోనే జమ్ముకశ్మీర్‌లో మిలిటెంట్లతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

కుప్వారా జిల్లాలోని హంద్వారా ప్రాంతంలో మిలిటెంట్లు తలదాచుకున్న ఇంటిపై భద్రతాబలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసినప్పుడు ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

ఈ కాల్పుల్లో మిలిటెంట్లు తలదాచుకున్న ఇల్లు ధ్వంసం కాగా పాటు ఇద్దరు మిలిటెంట్ కూడా చనిపోయినట్లు భద్రతాబలగాలు భావించాయి.

ధ్వంసమైన ఇంటి వద్దకు వెళ్లగానే చనిపోయినట్లుగా భావించిన మిలిటెంట్లలో ఒకరు లేచి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు.

ఈ అనూహ్య దాడిలో సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఒకరు, మరో జవాన్.. ఇద్దరు జమ్ముకశ్మీర్ పోలీసులు మృతిచెందారు.

మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అభినందన్ కోసం వాఘాలో నిరీక్షణ

మరోవైపు పాక్ సైన్యానికి చిక్కిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను శుక్రవారం సాయంత్రం భారత అధికారులకు అప్పగించారు.

నిర్దిష్ట ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయన భారత్‌లోకి రానున్నారు.

అభినందన్ భారత్‌కు వస్తున్నారని తెలియడంతో వాఘా సరిహద్దు వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుని ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదరుచూస్తున్నారు.

ఇదే సమయంలో కుప్వారాలో మిలిటెంట్లు భారత బలగాలను పొట్టనపెట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)