అభినందన్‌ను పాక్ నుంచి భారత్‌లోకి ఎలా తీసుకొస్తారు? విధి, విధానాలు ఏమిటి?

అభినందన్ చిత్రం

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్ భారత్‌కు అప్పగించనుంది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అధికారులు వాఘా-అటారీ వద్ద ఉన్న భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద అభినందన్‌ను భారత అధికారులకు అప్పగించనున్నన్నారు.

ఈ అప్పగింత కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందనే స్పష్టమైన సమయం ఏమీ చెప్పలేమని, సాయంత్రం జరగొచ్చని పాకిస్తానీ అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.

భారత హైకమిషన్ అధికారుల సమక్షంలో వాఘా సరిహద్దు వద్ద ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.

అభినందన్‌ను అప్పగించే ముందు పాటించే ప్రొసీజర్ ఏంటి?

పాకిస్తాన్ ప్రభుత్వం అభినందన్‌ను భారత్‌కు అప్పగించేముందు పాటించే విధి విధానాల గురించి మేజర్ జనరల్ రాజ్ మెహతా బీబీసీ ప్రతినిధి గురుప్రీత్ సోనీకి వివరించారు. ఆ ప్రకారం చూస్తే..

పాకిస్తాన్‌లో జరిగేదేంటి?

  • తొలుత ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ అభినందన్‌ను తమతో పాటు తీసుకెళుతుంది. అతనికి సమగ్రంగా పరీక్షలు జరుపుతుంది. వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులనైనా అభినందన్ ఎదుర్కొంటున్నాడా? అన్న విషయాన్ని పరిశీలిస్తుంది.
  • అభినందన్‌కు ఏమైనా డ్రగ్స్ ఇచ్చారా? శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఏమైనా వేధింపులకు గురి చేశారా? అన్నది కూడా పరీక్షిస్తుంది.
  • ఈ పరీక్షలన్నీ జెనీవా కన్వెన్షన్ ప్రకారం తప్పకుండా చేయాల్సిన పరీక్షలు. ఈ పరీక్షలన్నింటి రిపోర్టులు తయారు చేసి, వాటిని భారత వాయుసేనకు ఇవ్వాల్సి ఉంటుంది.

భారత్‌లో జరిగేదేంటి?

  • అభినందన్ భారత్‌కు రాగానే భారత వాయుసేన తమ వైద్య బృందం చేత ఆయనకు పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పరీక్షల ఫలితాలను పాకిస్తాన్ ఇచ్చిన నివేదికలతో పోల్చి చూస్తుంది.
  • ఈ మేరకు ఇప్పటికే వైద్య నిపుణుల బృందాన్ని సిద్ధం చేసి ఉండొచ్చు.
  • వైద్య పరీక్షల అనంతరం అభినందన్‌తో ఉన్నతాధికారులు చర్చలు జరుపుతారు.
  • ఇంటెలిజెన్స్ డీ బ్రీఫింగ్ జరుగుతుంది. ఇందులో పాకిస్తాన్‌లో పట్టుబడినప్పటి నుంచి ఏం జరిగిందో, ఎలా జరిగిందో మొత్తం సంఘటనలను అభినందన్ వివరించాల్సి ఉంటుంది.
  • పాకిస్తాన్ ఎలా వ్యవహరించింది? ఏమేం అడిగింది? ఏమేం చర్చలు జరిగాయి? వీటన్నింటిపైనా విచారణ జరుగుతుంది.
  • అనంతరం వాయుసేన భారత ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

ఏమైనా వివాదం తలెత్తితే?

ఒకవేళ పాకిస్తాన్ నివేదించినట్లుగా అభినందన్ పరిస్థితి లేకపోయినా? అభినందన్ విషయంలో ఏమైనా తప్పుగా వ్యవహరించినట్లు భారత్ భావించినా.. అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాలకు సంబంధించిన ఆధారాలతో తన వాదనను బలపర్చుకోవాల్సి వస్తుంది.

అభినందన్ వద్ద లభించిన డాక్యుమెంట్లు, ఆయుధం అని పాకిస్తాన్ విడుదల చేసిన ఫొటో

ఫొటో సోర్స్, ISPR

ఫొటో క్యాప్షన్, అభినందన్ వద్ద లభించిన డాక్యుమెంట్లు, ఆయుధం అని పాకిస్తాన్ విడుదల చేసిన ఫొటో

వాఘా-అటారీ సరిహద్దులో పరిస్థితి ఎలా ఉంది?

వాఘా సరిహద్దులో భారతీయులు
ఫొటో క్యాప్షన్, భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద అటారీ వైపు జాతీయ జెండాలతో భారతీయులు
వాఘా సరిహద్దులో భారతీయులు
ఫొటో క్యాప్షన్, అభినందన్‌కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు సరిహద్దు వద్దకు చేరుకున్నారు
వాఘా సరిహద్దు
ఫొటో క్యాప్షన్, భారత్-పాకిస్తాన్ సరిహద్దులో వాఘా వైపు పరిస్థితి ఇలా ఉంది
వాఘా సరిహద్దు

సరిహద్దు వద్దకు పంజాబ్ సీఎం

అభినందన్‌కు స్వాగతం పలికేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ వాఘా సరిహద్దు వద్దకు చేరుకున్నారు.

అమరిందర్ సింగ్ గతంలో కెప్టెన్ హోదాలో సైన్యంలో పనిచేశారు. అభినందన్ తండ్రి, తాను నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ)కు చెందిన వాళ్లమని, అందుకే అభినందన్‌కు స్వాగతం పలికేందుకు తాను సరిహద్దు వద్దకు వెళుతున్నానని గురువారం ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)