సగం తిని ప్యాక్ చేశాడు, జొమాటో డెలివరీ బాయ్ చర్యపై విస్తృత చర్చ

ఫొటో సోర్స్, @Madan_Chikna
ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌లను డెలివరీ చేసే ఒక వ్యక్తి, దారి మధ్యలో వాటిని తెరిచి, అందులోని ఆహారాన్ని కొద్దిగా తిని, ఆ ప్యాకెట్లను తిరిగి సీల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియో.. దేశంలోని 'డెలివరీ రంగం' గురించి ఓ చర్చకు దారి తీసింది. ఈ విషయంలో మరిన్ని విషయాలపై బీబీసీ దృష్టి సారించింది.
తమిళనాడులోని మధురై నగరంలో జొమాటో సంస్థ టీ-షర్ట్ వేసుకున్న ఒక డెలివరీ మ్యాన్.. దారి మధ్యలో తాను డెలివరీ చేయాల్సిన ఫుడ్ ప్యాకెట్లను తెరిచారు.
వాటిలోని ఆహారాన్ని స్పూన్‌తో తిని, మళ్లీ ఆ ప్యాకెట్లను స్పూన్‌తోపాటే యథావిధిగా ప్యాక్ చేశారు. తర్వాత ఆ ప్యాకెట్లను తాను డెలివరీ చేయాల్సిన బ్యాగులో పెట్టేశారు.
మధురై నగరంలో పట్టపగలు రోడ్డుపక్కన జరిగిన ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి.. రహస్యంగా వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘అతన్ని ఉద్యోగంలోంచి తీసేశాం!’
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను చాలామంది మొదట్లో చీదరించుకుని, తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై జొమాటో సంస్థ స్పందించాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తాయి.
''ఈ పనికి పాల్పడిన వ్యక్తితో మాట్లాడాం. ఇది తప్పే. ఆయనను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాం'' అని జొమాటో సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
సదరు వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు జొమాటో ప్రకటించగానే, ప్రజల్లో ఆ ఉద్యోగిపై సానుభూతి పుట్టింది.
ఈ రంగంలో పని చేసే వారి సుదీర్ఘ పనివేళలు, ప్రతికూల సమయాల్లో కూడా డెలివరీ చేయాల్సిరావడం, స్వల్ప వేతనాలపై ప్రజల్లో మరో చర్చ ప్రారంభమైంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ రంగంలోని కొందరు ఉద్యోగులతో బీబీసీ మాట్లాడితే వారుకూడా ఇలాంటి సమస్యలనే ప్రస్తావించారు.
''మొదట్లో మాకు ఒక డెలివరీకి 60రూపాయలు వచ్చేవి. ఆ తర్వాత 40రూపాయలకు తగ్గించారు. అయినా, నా పిల్లల చదువు కోసం ఆ ఉద్యోగంలోనే కొనసాగుతున్నాను.. కానీ ఇప్పుడు దాన్ని 30రూపాయలు చేయాలని కంపెనీ యోచిస్తోంది. డెలివరీ చేయాలంటే పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. మరోవైపు నా పిల్లల ఖర్చు! ఏం చేయమంటారో చెప్పండి..'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ డెలివరీ మ్యాన్ బీబీసీతో అన్నారు.
''మా కుటుంబానికి నా ఒక్కడి సంపాదన మాత్రమే ఆదరువు. నాకేదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కూడా లేదు. కంపెనీ కూడా ఇన్సూరెన్స్ ఇవ్వదు. జరగరానిది ఏదైనా జరిగితే నాకు దిక్కు ఎవరు? ఇలాంటి సమస్యల గురించి కంపెనీ ఓసారి ఆలోచించాలి'' అని మరో ఉద్యోగి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని యాప్‌ల ద్వారా జరుగుతున్న ఈ వ్యాపారం కొంతకాలం క్రితమే భారత్‌లో ప్రారంభమైంది. చాలా వేగంగా అభివృద్ధి చెందింది.
ఆహారంతోపాటు గృహోపకరణాల వరకూ అన్ని వస్తువులనూ ఈ యాప్‌ల ద్వారా ప్రజలు కొంటున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి దిగ్గజ కంపెనీలు.. డెలివరీ కోసం వేలమంది ఉద్యోగులను నియమించుకుంది.
ప్రతి ఏడాదీ దేశంలో లక్షల మంది ఉపాధి రంగంలోకి వస్తున్నారు. కానీ వారికి తగిన సంఖ్యలో ఉద్యోగాలు లభించడం లేదు. కానీ తమ అవసరాలకోసం తక్కువ జీతానికి ఎక్కువ సమయం పనిచేయడానికి కూడా వారు వెనకాడటం లేదు.
దేశవ్యాప్తంగా తమ సంస్థలో 1,50,000 మంది డెలివరీ ఉద్యోగులు ఉన్నారని జొమాటో చెబుతోంది. స్విగ్గీ, ఇతర డెలివరీ యాప్‌లు.. తమ వద్ద దాదాపు లక్షమంది డెలివరీ భాగస్వాములు ఉన్నారని తెలిపాయి.
చాలా సంస్థలు తమ నెలవారీ డెలివరీ వివరాలను వెల్లడించడానికి నిరాకరించాయి. కానీ తమ సంస్థకు నెలకు 2.10కోట్ల ఫుడ్ ఆర్డర్స్ వస్తున్నట్లు జొమాటో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ డెలివరీ రంగం ఆర్థిక పురోగతిని తెలిపే ఎలాంటి అంచనాలూ అందుబాటులో లేవు.
కానీ తమ సంస్థ తరపున డెలివరీ చేస్తున్న ఉద్యోగులకు లక్ష్యాలు విధిస్తూ, లక్ష్యాలను ఛేదించలేనివారిపై పెనాల్టీలు విధిస్తున్నాయన్న వార్తలను జొమాటో, స్విగ్గీ సంస్థలు కొట్టిపారేశాయి.
''మా సంస్థ ద్వారా డెలివరీ చేసేవారికి స్వేచ్ఛ ఉంటుంది. వారిపై ఎలాంటి ఒత్తిడీ ఉండదు. వారికి తోచిన సమయంలో లాగిన్ అయ్యి డెలివరీ చేయొచ్చు. బ్రేక్ కావాలనుకున్నపుడు ఆఫ్‌లైన్‌లో వెళ్లిపోవచ్చు'' అని జొమాటో ప్రతినిధి ఒకరు బీబీసీకి వివరించారు.
తమ సంస్థకు చెందిన డెలివరీ ఉద్యోగులకు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నట్లు జొమాటో, స్విగ్గీ సంస్థలు తెలిపాయి.

ఫొటో సోర్స్, facebook/SWIGGY
దీపక్ అనే డెలివరీ ఉద్యోగి బీబీసీతో మాట్లాడుతూ.. బ్రేక్ తీసుకున్నానన్న కారణంతో తనకెప్పుడూ పెనాల్టీ విధించలేదని అన్నారు.
కానీ డెలివరీ ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తీసుకుంటున్న కంపెనీల్లో ఒక ఉద్యోగి సంపాదన చెప్పుకోదగ్గట్టు ఉండదని, డెలివరీ అందించినందుకు వారికి టిప్స్ కూడా ఇవ్వరని దీపక్ అన్నారు. తన పూర్తి పేరు చెప్పడానికి మాత్రం ఆయన నిరాకరించారు.
జొమాటో డెలివరీ ఉద్యోగి వీడియోను తాను కూడా చూశానని, కానీ ఆ వ్యక్తిపై తనకు జాలి లేదని దీపక్ అన్నారు.
''తప్పు తప్పే. అక్కడ జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఆయన అలా చేసుండకూడదు. సగం తిన్న ఆహారాన్ని ఇస్తే ఎవరు తింటారు?'' అని దీపక్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
- జర్మనీ: రోడ్డుపై టన్ను చాక్లెట్ లీక్.. 108 చదరపు అడుగులు చాక్లెట్ మయమైన రోడ్డు
- కూటమి కుప్పకూలడానికి కారణాలేమిటి..- ఎడిటర్స్ కామెంట్
- తెలంగాణ రాష్ట్ర సమితి: విజయానికి 7 ప్రధాన కారణాలు
- టీఆర్ఎస్ ప్రస్థానం: పోరు నుంచి పాలన వరకు కారు జోరు
- ‘గాంధీ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








