తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018: ఓట్లు లేవంటూ ఆందోళనలు.. వారి ఓట్లు ఏమయ్యాయి?

ఫొటో సోర్స్, Guttajwala1/facebook
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంటకే 47.8 శాతం పోలింగ్ నమోదైంది. అయితే.. పలు ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓట్లు కనిపించక గందరగోళానికి లోనవుతున్నారు.
రాజకీయ, సినీ ప్రముఖులు ఓటు వేసి సోషల్ మీడియా ద్వారా ఓటు వేయాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. పోలింగ్ సరళి కూడా గతం కన్నా మెరుగుగా ఉంది.
కానీ చాలా చోట్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఇబ్బందులు పడుతున్నారు. ఓటరు జాబితాలో తమ పేర్లు కనిపించటం లేదని ఆందోళన చేస్తున్నారు.
ఈ క్రమంలో పోలింగ్ రోజైన గురవారం మధ్యాహ్నానికే ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ క్రాష్ అయింది. 'నా ఓటు' యాప్ కూడా సరిగా పనిచేయటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.
ప్రముఖ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, ఐపీఎస్ అధికారి, అదనపు డీజీపీ తెన్నేటి కృష్ణప్రసాద్ వంటి వారు ఓటరు జాబితాలో తమ ఓటు లేదంటూ సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
హర్ష అనే మరొక వ్యక్తి కూడా తన తల్లిదండ్రులు 36 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో నివసిస్తున్నా.. ఓటరు జాబితాలో వారి పేర్లు గల్లంతయ్యాయని ట్వీట్ చేశారు.
ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలోని చాంద్రాయణగుట్ట, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, కామారెడ్డి జిల్లా రామారెడ్డి, బిక్కనూర్ తదితర ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓట్లు గల్లంతయ్యాయంటూ ఆందోళనకు దిగారు.


నిజానికి ఓటరు జాబితాలో తమ పేర్లు గల్లంతయ్యాయంటూ కొంత కాలంగా ఆందోళనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఓటరు జాబితా సవరణ సందర్భంగా కొన్ని చోట్ల భారీ సంఖ్యలో ఓట్లను తొలగించారని పలు రాజకీయ పార్టీలూ ఇంతకుముందు ఆందోళనకు దిగాయి.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బోగస్ ఓట్ల ప్రక్షాళన కార్యక్రమం వివాదాస్పదమైంది. మొత్తంగా దాదాపు 27 లక్షల ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. దీనికి.. ఓటరు గుర్తింపును, ఆధార్ సమాచారంతో సరిచూడటానికి ఉపయోగించిన ఒక సాఫ్ట్‌వేర్‌లోని లోపాలు కారణమని ద న్యూస్ మినిట్ వెబ్‌సైట్ ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. 2015 మార్చిలో కేంద్ర ఎన్నికల సంఘం నేషనల్ ఎలక్టొరల్ రోల్ ప్యూరిఫికేషన్ అండ్ ఆథెంటికేషన్ ప్రోగ్రామ్ (ఎన్‌ఈఆర్‌పీఏపీ) చేపట్టింది. ఓటరు ఫొటో ఐడీ కార్డులను వారి వారి ఆధార్ కార్డులతో లింక్ చేయటం ద్వారా.. డూప్లికేట్ ఓట్లు, బోగస్ ఓట్లను ప్రక్షాళన చేయటం ఆ కార్యక్రమం లక్ష్యం.
అయితే.. ఆధార్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అదే ఏడాది ఆగస్టులో ఈ కార్యక్రమం ముగిసింది. అప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటరు జాబితా నుంచి 27 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించిందని ‘న్యూస్ మినిట్’ కథనం చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ 27 లక్షల ఓట్లను తొలగించేటపుడు ఎన్నికల సంఘం సదరు ఓటర్లలో చాలా మందికి నోటీసులు అందించలేదని.. చాలా నోటీసులు చేరనేలేదని అప్పుడే కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలో గుర్తించారు.
తెలంగాణలో ఓటర్ల సంఖ్య.. ప్రస్తుతం 2.73 కోట్లుగా ఉంది. ఇది 2014 నాటి ఓటర్ల సంఖ్య 2.82 కోట్ల కన్నా 9 లక్షలు తక్కువ. ఈ 9 లక్షల మంది ఓటర్లు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయారని ఈసీ చెప్తోందని ఆ కథనం పేర్కొంది.
మరోవైపు ఎన్నికల సంఘం ఈ ఏడాది తెలంగాణలో 12 లక్షల మంది కొత్త ఓటర్లను అదనంగా జాబితాలో చేర్చింది.
ఓటర్ల తొలగింపులో లోటుపాట్లను తాము పరిశీలించి సరిచేస్తామని ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ హామీ ఇచ్చారని న్యూస్ మినిట్ కథనం తెలిపింది. అలాగే.. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒ.పి.రావత్ కూడా.. బోగస్ ఓట్లను చాలా వరకూ తొలగించామని.. తమకు వచ్చిన ఫిర్యాదులు చాలా వరకూ పరిష్కరించామని చెప్పినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి:
- ఈ శతాబ్ధంలో మహిళల్ని వెనక్కు లాగుతున్నవేంటి?
- బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చిన రాజీవ్ గాంధీని చంపించిన ఎల్టీటీఈ ప్రభాకరన్
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్లో మహిళల స్థానమేంటి? క్యాబినెట్లో ఒక్కరూ ఎందుకు లేరు?
- తెలంగాణ ఎన్నికలు: 'మాకు రెండు రాష్ట్రాలు.. రెండు ఓటరు కార్డులు'
- తెలంగాణ ఎన్నికలు : హైదరాబాద్‌లో వీరి ఓట్లు ఎవరికి?
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్కే ఓటు వేస్తామని మసీదులో ప్రతిజ్ఞలు
- తెలంగాణ ముందస్తు ఎన్నికలు: విలీన మండలాల ఓటర్లు ఎటు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








