సోనియా గాంధీ, రాహుల్ బహిరంగ సభ: కాంగ్రెస్ నేతల ప్రసంగాల్లో ఐదు కీలకాంశాలు

ఫొటో సోర్స్, congress/fb
రాజకీయంగా తాము నష్టపోయినా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రజాకూటమి తరఫున ప్రచారానికి వచ్చిన ఆమె మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించారు.
సోనియా ప్రసంగంలోని కీలకాంశాలు..
- తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది.
- నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రజల కలలు సాకారం అయ్యాయా? ఉద్యోగాలు లేక యువత నిరాశకు లోనవుతున్నారు.
- తెలంగాణ ఏర్పాటు తర్వాత కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడింది. ఈ ఎన్నికలతో తెలంగాణ భవిష్యత్తు ముడిపడి ఉంది.
- అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నాం.
- ఇక్కడ డ్వాక్రా సంఘాల గురించి ఎక్కడికి వెళ్లినా గొప్పగా చెప్పేదాన్ని. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘాలను నిర్వీర్యం చేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఒకరి చేతిలోనే తెలంగాణ పాలన కొనసాగుతోందని కేసీఆర్ తీరును విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీని గద్దెదింపేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యయని చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో ప్రజల పోరాటంతో పాటు సోనియా పాత్ర కీలకమని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, congress/fb
‘ఒక్క సభతో రెండు లక్ష్యాలు'
ఒక్క సభతో రెండు లక్ష్యాలు నెరవేరేలా సోనియా గాంధీ ప్రసంగించారని ఆంధ్రజ్యోతి దినపత్రిక అసోసియేట్ ఎడిటర్ కృష్ణారావు అన్నారు. మేడ్చల్ సభలోని సోనియా ప్రసంగాన్ని ఆయన విశ్లేషించారు.
'తల్లి సెంటిమెంట్‌తో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ సభలో సోనియా గాంధీ ప్రయత్నించారు, ఒకవైపు తెలంగాణ కళాకారుడు గద్దర్, మరో వైపు తెలంగాణ జేఏసీ నేత కోదండరాంను పెట్టుకొని వ్యూహాత్మకంగా ఈ సభను కాంగ్రెస్ నడిపించింది' అని కృష్ణారావు బీబీసీకి చెప్పారు.
సీట్ల సర్దుబాటు కారణంగా కాస్త వెనకబడిన కాంగ్రెస్‌కు ఆమె ప్రచారం నూతనోత్సాహాన్నిస్తుందని అన్నారు.
'తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటూనే ఏపీకి బలమైన సంకేతాన్ని ఆమె ఇచ్చారు. అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామనడంతో ఒక్క సభతో రెండు లక్ష్యాలు నెరవేరినట్లయింది' అని వివరించారు.
‘తెలంగాణ ఎందుకు ఇచ్చామో చెబుతూనే టీఆర్ఎస్ పాలనలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నట్లుగా ఆమె ప్రసంగం కొనసాగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయినప్పటికీ సోనియానే తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమెను ముందు పెట్టడం ద్వారా కాంగ్రెస్ విజయవంతంమైంది. సోనియా సభలు ఇంకా రెండుమూడు పెడితే కాంగ్రెస్‌కు మరింత బలం వచ్చే అవకాశం ఉంది’ అని కృష్ణారావు వివరించారు.
ఇవి కూడా చదవండి
- తెలంగాణ ఎన్నికలు : హైదరాబాద్‌లో వీరి ఓట్లు ఎవరికి?
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్కే ఓటు వేస్తామని మసీదులో ప్రతిజ్ఞలు
- కంచుకోటలోనూ కమ్యూనిస్టులు ఎందుకు తడబడుతున్నారంటే..
- తెలంగాణ విద్యుత్ రంగం: 24 గంటల విద్యుత్ విజయమా? వ్యయమా?
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటీ? చేయకపోతే ఏమవుతుంది?
- అమెరికా యాత్రికుడిని 'చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు'
- జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దు: ఈ డ్రామా వెనకున్నదేమిటి?
- టీచర్లకు ఏ దేశంలో ఎక్కువ గౌరవం లభిస్తోంది?
- అండమాన్‌లో క్రైస్తవ మత ప్రచారకుడి హత్య: ‘సువార్త బోధించేందుకే అక్కడికి వెళ్లాడు’
- హార్లిక్స్: విటమిన్ D కి మూలం శాకాహార పదార్థాలా, మాంసాహార పదార్థాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








