వినాయకి మాత ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చారు?

వినాయకి

ఫొటో సోర్స్, Twitter/KS1729

    • రచయిత, దేవదత్త పట్నాయక్
    • హోదా, బీబీసీ కోసం

అంధకుడనే రాక్షసుడు పార్వతీదేవిని తనదాన్ని చేసుకోవాలనుకున్నాడు.

అందుకోసం ఆ రాక్షసుడు బలవంతంగా పార్వతీదేవిని చెర పట్టాలనుకున్నాడు. దీంతో ఆమె తన భర్త శివునికి ఈ విషయం చెప్పింది.

పార్వతి చెప్పిన విషయం విన్న శివుడు తన త్రిశూలంతో అంధకుణ్ని వధించాడు.

అయితే అంధకుడికి ఉన్న అపూర్వమైన శక్తుల వల్ల, అతని ఒంటి నుంచి కారిన ప్రతి రక్తపు చుక్కా నుంచి మరో అంధకుడు జన్మించసాగాడు.

అంధకుణ్ని చంపడానికి ఒకే ఒక మార్గంగా శివుడు ఒక చుక్క రక్తం కూడా భూమ్మీద పడకుండా అంధకుణ్ని వధించాడు.

ఈ సంహారంలో దేవతా స్వరూపాలన్నీ ఆయనకు సహకరించాయి.

వినాయకుడు

ఫొటో సోర్స్, Getty Images

యుద్ధభూమిలో దేవతా స్వరూపాలు

పురుష స్వరూపాన్ని మానసిక శక్తికి, మహిళా స్వరూపాన్ని భౌతిక వనరులకు ప్రతీకలుగా భావిస్తారు.

అంధకునితో శివుడు చేసే యుద్ధానికి పార్వతి దైవ శక్తులన్నిటినీ ఆహ్వానించింది.

పార్వతీదేవి ఆహ్వానం మీద దేవుళ్లందరూ తమ మహిళా స్వరూపాలను పంపారు.

అంధకుడితో శివుని యుద్ధం ప్రారంభం కాగానే..యుద్ధభూమిలో అన్ని దేవతా స్వరూపాలు ప్రత్యక్షమయ్యాయి.

వినాయకుడు

ఫొటో సోర్స్, Getty Images

ఇంద్రుని శక్తి ఇంద్రాణి రూపంలో, విష్ణువు శక్తి వైష్ణవి రూపంలో, బ్రహ్మ శక్తి బ్రాహ్మణి రూపంలో యుద్ధభూమికి చేరుకుని, అంధకుని రక్తం నేల మీద పడే లోపల దానిని తాగడం ప్రారంభించాయి.

అలా అంధకుని సంహారం జరిగింది.

మత్స్య పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణాలలో గణపతి యొక్క మహిళా స్వరూపాన్ని, ఈ యుద్ధంలో పాల్గొన్న మహిళా శక్తులుగా పేర్కొనడం జరిగింది.

వనదుర్గ ఉపనిషత్తులో కూడా గణపతి మహిళా స్వరూపాన్ని పేర్కొన్నారు.

కానీ గణపతి శక్తి స్వరూపాలకు 16వ శతాబ్దం నుంచి మాత్రమే రూపం ఇచ్చారు.

కొంతమంది విశ్లేషకులు ఈ చిత్రాలు పార్వతీదేవి పరిచారిక అయిన మాలినివి అని కూడా భావిస్తున్నారు. మాలిని ముఖం ఏనుగు ముఖాన్ని పోలి ఉండేది. పురాణాలలో మాలినిని గణేశుని బాగోగులు చూసుకునే మహిళగా వర్ణించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఏనుగు ముఖం కలిగిన వినాయకి?

తాంత్రిక కర్మకాండల్లో ఏనుగు ముఖం కలిగిన దేవత.. అది గణేశుని రక్షించేది కావచ్చు లేదా పార్వతి పరిచారిక కావచ్చు.. ఒక ముఖ్యమైన భాగంగా ఉండేది.

దీనికి కారణం మహిళా స్వరూపాన్ని సకల ఉత్పాదక శక్తులకు ప్రతీకగా భావించడమే.

నిజానికి ప్రాణుల ఆలనాపాలనా చూసేది కూడా మహిళా శక్తే.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

వినాయకి మంత్రతంత్రాల ప్రపంచానికి చెందినదా?

అమూర్త రూపాలను పూజించేవారు వైదిక విధానాలను, నిర్దిష్ట రూపాలను పూజించేవారు తాంత్రిక విధానాలను అనుసరించేవారు.

మొదటి వర్గం వారి కర్మకాండల్లో పురుష స్వరూపం ప్రధానంగా ఉండేది.

రెండో వర్గం కర్మకాండలలో స్త్రీ స్వరూపంలోని గణేశుడు ముఖ్యభాగం.

అలా వినాయకుడు వైదిక వర్గాలలో పురుష దేవునిగా, వినాయకి తాంత్రిక వర్గాలలో మహిళా స్వరూపంగా ఖ్యాతి పొందింది.

ఈ నేపథ్యంలో వినాయకికి సంబంధించిన కథలు ఇంకా ఉన్నాయేమో మనకు తెలీదు. ఎందుకంటే అలాంటి కథలన్నీ మౌఖికమైనవి.

(ఈ కథనంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు పూర్తిగా రచయిత వ్యక్తిగతమైనవి. ఈ కథనానికి సంబంధించిన వాస్తవాలు, అభిప్రాయాలకు బీబీసీ ఎలాంటి బాధ్యతా వహించదు)

(రచయిత దేవదత్త పట్నాయక్ పురాణాలపై 40కి పైగా పుస్తకాలు రాశారు)

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.