దిల్లీలో అత్యాధునిక సిగ్నేచర్ బ్రిడ్జి ప్రారంభం

సిగ్నేచర్ బ్రిడ్జి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ వంతెన వద్ద సెల్ఫీ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు.

దిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సిగ్నేచర్ వంతెనను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రారంభించారు. సోమవారం నుంచి ఈ వంతెన ప్రజలకు అందుబాటులోకి రానుంది.

యమునా నదిపై నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి... దిల్లీలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల మధ్య ట్రాఫిక్‌ సమస్యను తీర్చడంతో పాటు సందర్శకులకూ కనువిందు చేయనుంది.

సిగ్నేచర్ బ్రిడ్జి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 8 వరుసల వెడల్పుతో ఈ వంతెన నిర్మించారు.

వంతెన విశేషాలు

దీన్ని భారత్‌లోనే మొదటి అసమాన కేబుల్ వంతెనగా చెబుతున్నారు. దీని కోసం దాదాపు రూ. 1500 కోట్లు ఖర్చు చేశారు.

154 మీటర్ల (505 అడుగులు) ఎత్తున్న ఈ వంతెన శిఖరం మీదకు వెళ్లి చుట్టూ దిల్లీ నగరం అందాలను వీక్షించే వెసులుబాటు కూడా ఉంటుంది. అందుకోసం ఆ శిఖరం మీద అద్దాల గది ఏర్పాటు చేశారు. ఆ గదిలో ఒకేసారి 50 మంది వరకూ ఉండొచ్చు.

అంత ఎత్తుకు వెళ్లేందుకు లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ లిఫ్టులను మరో రెండు నెలల్లో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

సందర్శకుల కోసం ఈ వంతెన వద్ద సెల్ఫీ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు.

సిగ్నేచర్ బ్రిడ్జి

ఫొటో సోర్స్, Getty Images

ఈ బ్రిడ్జి నిర్మించాలని 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.

2010 కామన్వెల్త్ క్రీడలకు ముందే దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, అది ఎనిమిదేళ్లు ఆలస్యంగా ఇన్నాళ్లకు పూర్తయ్యింది.

దీని కోసం దాదాపు రూ. 1500 కోట్లు ఖర్చు చేశారు.

572 మీటర్ల పొడవున్న ఈ ఎనిమిది వరుసల వంతెన వల్ల దిల్లీలోని వజీరాబాద్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌ మధ్య ప్రయాణ సమయం 30 నిమిషాలకు పైగా తగ్గుతుందని అధికారులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)