నీళ్లు లేవని టీ ఇవ్వడం లేదు.. ఇదెక్కడో కాదు, భారత్‌లోనే
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని స్థానికులు, పర్యటకులు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా జూన్‌లో ఈ ప్రాంతానికి పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కానీ, నీటి ఎద్దడి వల్ల పర్యటక రంగం కూడా దెబ్బతింటోంది.
తన 65 ఏళ్ల జీవితంలో సిమ్లాలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని స్థానికుడు ఒకరు బీబీసీకి తెలిపారు.
నీళ్ల కోసం వేలరూపాయిలు ఖర్చుపెట్టలేక తమ ఉద్యోగులకు టీ అందించడం మానేశామని ఇక్కడి ఓ ట్రావెల్ ఏజెన్సీ యజమాని చెప్పారు.
ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు గళమెత్తుతున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





