వైసీపీ ఎంపీల రాజీనామాలు: ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు ఎందుకు పెట్టలేదు?

రాజీనామాలు

ఫొటో సోర్స్, YSRCP

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం కర్ణాటకలో ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది.

కర్ణాటకలో రాజీనామాలు మే 18వ తేదీన ఆమోదం పొందాయని, కాబట్టి నవంబర్ 17వ తేదీ లోపు అక్కడ ఎన్నికలను తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉందని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓమ్ ప్రకాశ్ రావత్ చెప్పారు.

కర్ణాటకలో మూడు లోక్‌సభ నియోజకవర్గాలు.. షిమోగ, బళ్లారి, మాండ్యలకు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు.. రామనగరం, జామ్‌ఖండిలకు నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 6న ఎన్నికల కౌంటింగ్, ఫలితాల ప్రకటన ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ ఎంపీల రాజీనామాలు 2018 జూన్ 4వ తేదీన ఆమోదం పొందాయని రావత్ అన్నారు. (వాస్తవానికి ఈ రాజీనామాలు 2018 జూన్ 20వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి) అయితే, లోక్‌సభకు 2019 జూన్ 3వ తేదీన ఎన్నికలు జరుగుతాయని.. అంటే ఎన్నికలకు ఏడాది లోపే ఈ రాజీనామాలు ఆమోదం పొందాయన్నారు.

చట్ట ప్రకారం.. (రాజీనామాలు పొందిన) ఏడాది లోపు ఎన్నికలు ఉన్నట్లయితే, ఆయా స్థానాలకు కమిషన్ ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు నిర్వహించటం లేదని స్పష్టం చేశారు.

రాజీనామాలు

ఫొటో సోర్స్, Facebook/YSRCP

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, పీవీ మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలు ఏప్రిల్ 6న రాజీనామాలు చేసి స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు అప్పగించారు.

అయితే, ఈ రాజీనామాల ఆమోదంపై జూన్ 21న ఆమె నిర్ణయం ప్రకటించారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు జూన్ 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)