కర్ణాటకలో రేపే బలపరీక్ష జరిపించాలని సుప్రీంకోర్టు తీర్పు

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Reuters

శనివారం సాయంత్రం 4 గంటలకు కర్ణాటక శాసనసభలో విశ్వాసపరీక్ష జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బలపరీక్షకు మరింత సమయం కావాలన్న బీజేపీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

బుధవారం రాత్రి పొద్దుపోయాక జరిగిన విచారణ అనంతరం సుప్రీంకోర్టు బీఎస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి పచ్చజెండా ఊపింది. అయితే ఈ కేసులో ఇది తుది తీర్పు కాదని కూడా న్యాయస్థానం అప్పుడు పేర్కొన్న విషయం తెలిసిందే.

line

సుప్రీంకోర్టు కీలక నిర్దేశాలివే...

  • రేపు సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష జరిపించాలి.
  • బలపరీక్ష ఎలా జరగాలో ప్రొటెమ్ స్పీకర్ నిర్ణయిస్తారు.
  • సీక్రెట్ బ్యాలెట్ ఉండగూడదు.
  • ఆంగ్లో-ఇండియన్ నామినేటెడ్ సభ్యుడిని చేర్చుకోగూడదు.
  • యడ్యూరప్ప ప్రభుత్వం ముఖ్యమైన విధాన నిర్ణయాలేవీ తీసుకోవడానికి వీల్లేదు.
  • రాష్ట్ర డీజీపీ ఎమ్మెల్యేలకు తగిన భద్రత కల్పించాలి.
line

'తీర్పు చరిత్రాత్మకం'

గురువారం ఉదయం యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మెజారిటీని నిరూపించుకునేందుకు ఆయనకు గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చారు.

దీనిపై కాంగ్రెస్, జేడీఎస్‌లు ముందే అభ్యంతరం తెలిపాయి. సుప్రీంకోర్టు ఈ కేసులో వెంటనే బలపరీక్ష జరిపించాలని తీర్పునివ్వడంతో కాంగ్రెస్, జేడీఎస్‌లకు ఆ మేరకు ఊరట లభించినట్టే.

గతంలో గోవా విషయంలో సుప్రీంకోర్టు బలపరీక్ష కోసం కేవలం 48 గంటల సమయం మాత్రమే ఇచ్చిన విషయం తెలిసిందే. డబ్బుతో ఎమ్మెల్యేలను కొనే అవకాశాలున్నందునే కోర్టు అలా ఆదేశించింది.

'ఈ తీర్పు చరిత్రాత్మకమైంది' అని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఫ్లోర్ టెస్ట్ తప్పనిసరి: కాంగ్రెస్ న్యాయవాది

శాసనసభలో ఫ్లోర్ టెస్ట్ అనివార్యమైన ప్రక్రియ అని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు.

"ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించడానికన్నా ముందే యడ్యూరప్ప 15న గవర్నర్‌కు రాసిన లేఖలో తమది అతి పెద్ద పార్టీ అని పేర్కొన్నారు. తమకు కొందరు (X) మద్దతునిస్తున్నారని ఆయన తన లేఖలో తెలిపారు. కానీ ఫలానా, ఫలానా వాళ్లు (ఏ,బీ,సీ) మద్దతు ఇస్తున్నందు వల్ల తమకు మెజారిటీ ఉందని నిర్దిష్టంగా రాయాల్సింది" అని సింఘ్వీ వాదించారు.

"కాంగ్రెస్-జేడీఎస్‌లు తమ 117 మంది ఎమ్మెల్యేల పేర్లను వివరంగా పేర్కొన్నాయి. అలాంటప్పుడు యడ్యూరప్పకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం గవర్నర్ ఏ ఆధారంగా ఇచ్చారో చెప్పగలరా?" అని ఆయన కోర్టులో వాదించారు.

"నా వద్ద 104 సీట్లున్నాయి. నాకు కొంత సమయం ఇవ్వండి. మద్దతును 'సృష్టించుకునే' అవకాశం ఇవ్వండి అని యడ్యూరప్ప గవర్నర్‌ను కోరుతున్నట్టు లెక్క" అంటూ సింఘ్వీ తన వాదనలను కొనసాగించారు.

శనివారం బలపరీక్ష తమకు సమ్మతమేనని సింఘ్వీ అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హెచ్‌డీ కుమారస్వామి

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హెచ్‌డీ కుమారస్వామి

గవర్నర్ పాత్ర

ఇక అందరూ విమర్శిస్తున్న గవర్నర్ నిర్ణయం విషయానికొస్తే.... శాసనసభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. అయితే, తామిద్దరం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్, జేడీఎస్‌లు ముందే గవర్నర్‌కు తెలియజేశాయి.

అయితే, సమస్య ఏంటంటే, 1994 నాటి బొమ్మై కేసులో గానీ, 2014 నాటి అరుణాచల్ ప్రదేశ్ నాబమ్ రేబియా కేసులో గానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులేవీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్‌లు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో స్పష్టమైన మార్గదర్శకాలేమీ నెలకొల్పలేదు.

ఆర్టికల్ 163, 164ల ప్రకారం ముఖ్యమంత్రి నియామకం, మంత్రివర్గం ఏర్పాటు చేసే సమయాల్లో గవర్నర్ తన విచక్షణ ప్రకారం నడచుకోవచ్చు.

బీఎస్ యడ్యూరప్ప

ఫొటో సోర్స్, EPA

అరుణాచల్ ప్రదేశ్ కేసులో ఇచ్చిన తీర్పులో, గవర్నర్లు నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటు విషయంలో రాజ్యాంగ ధర్మాసనం ఏదీ ఏ రకమైన వ్యవస్థనూ ఏర్పాటు చేయలేదు.

15 రోజుల లోగా మెజారిటీని నిరూపించుకోవాలని యడ్యూరప్పను గవర్నర్ కోరారు. గోవాలో ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా సుప్రీంకోర్టు ఈ గడువును 48 గంటలకు పరిమితం చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

బేరసారాల ఆరోపణలు

మెజారిటీని నిరూపించుకోవడం కోసం బీజేపీకి కేవలం 8 మంది ఎమ్మెల్యేల మద్దతు సరిపోతుంది. అందుకే అది తమ ఎమ్మెల్యేలను కొనేయాలని ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కానీ, ప్రమాణస్వీకారం తర్వాతే పార్టీ ఫిరాయింపుల చట్టం అమలులోకి వస్తుందని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో వాదించారు. అయినా, ఫిరాయింపుల నిరోధక చట్టం ఒక ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తుందే తప్ప అతడిని/ఆమెను మళ్లీ పోటీ చేయకుండా అడ్డుకోలేదు.

ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా 'కర్నాటకం'లో కొనసాగుతున్న ఉత్కంఠకు ఎలా తెరపడుతుందో వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)