తమిళనాడు అడవిలో మంటలు: 9 మంది విద్యార్థుల మృతి

ఫొటో సోర్స్, Getty Images
తమిళనాడులోని థేని జిల్లాలోని కురంగిణి అడవుల్లో చెలరేగిన మంటల్లో దాదాపు 50 మంది విద్యార్థులు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 9 మంది చనిపోయినట్లు సమాచారం.
ట్రెక్కింగ్ చేయడానికి వెళ్లిన విద్యార్థులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు చెప్పారు. మృతి చెందిన వారిలో నలుగరు యువతులు, ఒక చిన్నారి ఉన్నారు.
ఈ ఘటనపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు మంటల్లో చిక్కుకున్న వారిని వెంటనే కాపాడాలని సౌత్ జోన్ అధికారులను ఆదేశించినట్లు ఆమె ట్వీట్ చేశారు.
'ఈ విషయంపై ఇప్పటికే థేని జిల్లా కలెక్టరుతో మాట్లాడాను. ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది అక్కడికి వెళ్లారు. ఇప్పటికే దాదాపు 15 మందిని వారు కాపాడారని' ఆమె ట్వీటర్‌లో పేర్కొన్నారు.
మంటల్లో చిక్కుకున్న విద్యార్థులను రక్షించేందుకు సమీపంలో ఉన్న పూడీ ప్రాంతవాసులు అధికారులకు సహాయం చేస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది.
థేనీ జిల్లా అగ్నిమాపక అధికారి థెన్నారసు బీబీసీతో మాట్లాడుతూ, ''ట్రెక్కింగ్ చేయడానికి విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. చెన్నైకి చెందిన ప్రైవేటు ట్రెక్కింగ్ క్లబ్ వారిని ఇక్కడికి తీసుకొచ్చింద''ని తెలిపారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








