శ్రీదేవి మృతి: ముగిసిన ఎంబామింగ్, దుబాయ్ ఎయిర్‌పోర్టుకు మృతదేహం తరలింపు

ఫొటో సోర్స్, Getty Images
సినీ నటి శ్రీదేవి భౌతిక కాయాన్ని ఎంబామింగ్ చేసే ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు అధికారులు ధ్రువపత్రం జారీ చేశారు.
శ్రీదేవి మృతికి సంబంధించిన కేసును క్లోజ్ చేసినట్టు దుబాయ్ పోలీసులు ప్రకటించారు.
ప్రస్తుతం ఆమె భౌతిక కాయాన్ని దుబాయ్ ఎయిర్‌పోర్టుకు తరలిస్తున్నారు. మరి కొద్ది గంటల్లో ఆమె మృతదేహం ముంబయికి చేరుతుందని భావిస్తున్నారు.
అంతకు ముందు దుబాయ్ పోలీసులు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయంలో ఎంబామింగ్‌కు సంబంధించిన పత్రాలు శ్రీదేవి కుటుంబ సభ్యులకు అందజేశారు. దీంతో శ్రీదేవి మృతదేహానికి లేపనాలు పూసే (ఎంబామ్ చేసే) ప్రక్రియకు మార్గం సుగమమైంది.

ఫొటో సోర్స్, UGC
శనివారం రాత్రి శ్రీదేవి దుబాయ్‌లో మృతి చెందారన్న విషయం తెలిసిందే.
'కార్డియాక్ అరెస్ట్' వల్లనే శ్రీదేవి మృతి చెందినట్టు కపూర్ కుటుంబపు సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ మొదట్లో వార్తలు వెలువడ్డాయి.
కానీ సోమవారం నాడు దుబాయ్ పోలీసులు విడుదల చేసిన నివేదికలో శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడిపోవడం వల్ల చనిపోయినట్టు పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
శ్రీదేవి భౌతిక కాయాన్ని భారత్‌కు తరలించేందుకు ఒక ప్రత్యేక విమానం దుబాయ్‌లో సిద్ధంగా ఉంది. అయితే కేసును దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అప్పగించడంతో శవాన్ని భారత్‌కు తరలించడానికి ఎంత సమయం పడుతుందో స్పష్టత లేకుండా పోయింది.
నిజానికి, యూఏఈలో ప్రాసిక్యూషన్ ఏజెన్సీ, దుబాయ్ పోలీసులు రెండూ వేర్వేరు విభాగాలు. ఈ రెండు విభాగాలు విడిగా, స్వతంత్రంగా పని చేస్తాయి.
మంగళవారం నాడు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ నుంచి వెలువడ్డ సమాచారం ప్రకారం, "శ్రీదేవి మృతదేహానికి లేపనాలు పూసే ప్రక్రియను ప్రారంభించేందుకు వీలుగా శవం అప్పగింతకు సంబంధించిన పత్రాలను దుబాయ్ పోలీసులు భారత కాన్సులేట్ అధికారులకు, శ్రీదేవి కుటుంబ సభ్యులకు అందజేశారు."
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇంతకూ దుబాయ్‌లో ఏం జరుగుతోంది?
సౌదీ న్యూస్ వెబ్‌సైట్ గల్ఫ్ న్యూస్ రిపోర్టు ప్రకారం దుబాయ్ పోలీసులు మంగళవారం నాడు శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను పోలీసు స్టేషన్‌లో ప్రశ్నించారు.
పోలీసులు ఆయన నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్న తర్వాత తిరిగి హోటల్‌కు పంపించారు.
మూడో రోజు కూడా శ్రీదేవి శవం మార్చురీలోనే ఉందని ఖలీజ్ టైమ్స్ కథనం తెలిపింది.
పోలీసులు ఈ కేసును దుబాయ్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి నివేదించిన విషయం తెలిసిందే.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇలాంటి ఘటనల్లో చట్టప్రకారం చేపట్టే అన్ని దర్యాప్తు ప్రక్రియలు పూర్తి అయిన తర్వాతే మృతదేహాన్ని అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తాజాగా తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
అంతకు ముందు సౌదీ అరేబియాలో భారత రాయబారి నవదీప్ సూరీ, "శ్రీదేవి ఆకస్మిక మృతి పట్ల మీడియా ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు. అయితే పుకార్లతో మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండబోదు" అని ట్వీట్ చేశారు.
"మేం ఆమె మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు పంపించడం కోసం స్థానిక అధికారులతో కలిసి పని చేస్తున్నాం."
"మేం శ్రీదేవి బంధుమిత్రులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నాం. మేం వారి ఇబ్బందిని అర్థం చేసుకోగలం."
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








