ఫొటో గ్యాలరీ: మంచు ధాటికి చలితో వణికిపోతున్న యూరప్ నగరాలు

రోమ్‌లో ఆరేళ్లలో తొలిసారిగా దట్టమైన మంచు కురుస్తోంది. యూరప్‌లోని అనేక నగరాలు మంచు గుప్పిట్లో చిక్కుకున్నాయి.

రోమ్‌లో కొలీజియం పక్కన జాగింగ్ చేస్తున్న యువకుడు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రోమ్‌లో కురుస్తున్న దట్టమైన మంచుని సైతం లెక్క చేయకుండా ఈ యువకుడు కొలీజియం దగ్గర జాగింగ్ చేస్తున్నాడు. రానున్న కొన్ని రోజులపాటు ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉంది.
ఇలాంటి వాతావరణంలోనూ కొందరు పర్యటకులు ‘ఆర్చ్ ఆఫ్ కాన్‌స్టన్‌టైన్’‌ను సందర్శించారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఇలాంటి వాతావరణంలోనూ కొందరు పర్యటకులు ‘ఆర్చ్ ఆఫ్ కాన్‌స్టన్‌టైన్’‌ను సందర్శించారు. కానీ రవాణా వ్యవస్థకు మాత్రం ఇబ్బందులు తప్పలేదు.
రోమ్‌లోని రైల్వే స్టేషన్లు ప్రస్తుతం నిరాశ్రయులకు నీడను కల్పిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రోమ్‌లోని రైల్వే స్టేషన్లు ప్రస్తుతం నిరాశ్రయులకు నీడను కల్పిస్తున్నాయి.
సర్కస్ మ్యాగ్జిమస్ ప్రాంతంలో ప్రజలు. వెనక సెయింట్ పీటర్స్ బాసిలికా.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సర్కస్ మ్యాగ్జిమస్ ప్రాంతంలో ప్రజలు. వెనక సెయింట్ పీటర్స్ బాసిలికా.
వాటికన్ సిటీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సైబీరియా మీదుగా వీస్తున్న చల్ల గాలులు యూరప్‌లోని చాలా ప్రాంతాలను మంచు మయం చేశాయి.
రెహ్నా,జర్మనీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, జర్మనీలో కూడా భారీగా మంచు పేరుకుపోయింది. నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలు సైతం నిండిపోతున్నాయి.
కోసోవా రాజధాని ప్రిస్టీనాలోని ఈ వీధి మంచు గుప్పిట్లో చిక్కుకుపోయింది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, కొసోవా రాజధాని ప్రిస్టీనాలోని ఈ వీధి మంచు గుప్పిట్లో చిక్కుకుపోయింది.