‘ఆ విగ్రహాన్ని చూడగానే షాకయ్యా, అది అమ్మ మొహమే కాదు’

ఫొటో సోర్స్, AFP and S Varadarajan
అభిమానుల మధ్య అట్టహాసంగా ‘అమ్మ’ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మూడ్రోజులు గడిచేలోగా దాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆ విగ్రహానికీ జయలలితకూ ఏమాత్రం పోలికలు లేవనే విమర్శలు తలెత్తడమే దానికి కారణం.
శనివారం నాడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత 75వ జయంతి సందర్భంగా అన్నాడీఏంకే పార్టీ కార్యాలయంలో ఆమె కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అది జరిగిన కాసేపటికే సోషల్ మీడియాలో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. దాంతో ఆ విగ్రహానికీ జయలలిత అసలు రూపానికీ ఏమాత్రం సంబంధం లేదంటూ విమర్శలూ మొదలయ్యాయి.
‘ఆ విగ్రహాన్ని చూడగానే నేను షాకయ్యా. అది అమ్మ మొహమే కాదు, తను అలా ఉండదు’ అంటూ పేరు ప్రస్తావించకూడదనే షరతుపై ఆ పార్టీ నేత ఒకరు బీబీసీ ప్రతినిధి ఇమ్రాన్ ఖురేషీతో చెప్పారు.
ఆ విగ్రహం కోసం ఎంత ఖర్చుపెట్టారనే విషయాన్ని అన్నాడీఎంకే బయటపెట్టలేదు. కానీ పేరు కంటే కూడా ఆ విగ్రహం ఎక్కువ విమర్శల్నే తీసుకొచ్చింది.
‘విగ్రహానికి అవసరమైన మార్పులు చేసి దాన్ని మళ్లీ ఏర్పాటు చేస్తాం’ అని తమిళనాడు మంత్రి కె.పాండియరాజన్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, S Varadarajan
ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఓ శిల్పి ఈ విగ్రహాన్ని చెక్కారు.
‘మేం తమిళనాడు నుంచే శిల్పాన్ని చెక్కిస్తే బావుండేది. బయటి రాష్ట్రానికి వెళ్లకుండా ఉండాల్సింది’ అని పార్టీకి చెందిన మరో నేత అన్నారు.
‘ఆ విగ్రహాన్ని కాంస్యంతో తయారుచేశారు. కాబట్టి కేవలం మొహంలో మార్పులు చేయడానికి కుదరదు. మొత్తం విగ్రహాన్ని మళ్లీ తయారు చేయాల్సిందే’ అని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అన్నాడీఎంకే ఏర్పాటు చేసిన ఆ విగ్రహం గురించి ప్రస్తావిస్తూ.. ‘పార్టీ నేతలు తమ నాయకురాలి మొహాన్ని మరచిపోయినట్లున్నారు. జయ అమ్మ కూడా తన మొహాన్ని తానే గుర్తుపట్టలేరు’ అంటూ జోషీ జార్జ్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘ఏడీఎంకే తమ నాయకురాలి విగ్రహాన్నే సరిగ్గా తయారు చేయలేకపోయింది. ఇలాంటి వాళ్ల చేతిలో మొత్తం రాష్టాన్ని ఊహించుకోండి’ అంటూ గణేష్ శబరి అనే మరో వ్యక్తి ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- రాజకీయాలకు రజినీ వయసు దాటిపోయిందా?
- కమల్‌హాసన్ రాజకీయ పార్టీ.. ‘ప్రజా న్యాయ కేంద్రం’
- కళ వేరు... పొలిటి‘కళ’ వేరు
- శ్రీదేవి మరణం: ‘వసంత కోకిల’ వెళ్లిపోయింది..!
- శ్రీదేవి ఇకలేరు: నేనొక మంచి ఫ్రెండ్‌ని కోల్పోయా!
- స్లిమ్‌గా కనిపించే శ్రీదేవిని కార్డియాక్ అరెస్ట్ ఎలా కబళించింది?
- 'అతిలోక సుందరి' నుంచి నేనెంతో నేర్చుకున్నా: చిరంజీవి
- 'కళ్లతో శ్రీదేవి పలికించిన హావభావాల్ని ఎలా మర్చిపోగలం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








