శ్రీదేవి మరణం: ‘వసంత కోకిల’ వెళ్లిపోయింది..!

ఫొటో సోర్స్, Getty Images
శ్రీదేవి తన బాల్యంలోనే సినిమా పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆనాడే.. శ్రీదేవి బాలనటిగా ప్రఖ్యాతి చెందారు.
తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషల్లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు.
బాలీవుడ్‌లోనూ.. 'బాక్సాఫీస్ క్వీన్' అనిపించుకున్నారు. శ్రీదేవి జీవిత ప్రయాణాన్ని పరిశీలిస్తే..
1963 ఆగస్ట్ 13న తమిళనాడులో శ్రీదేవి జన్మించారు. శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మయ్యంగార్ అయ్యప్పన్.
నాలుగేళ్ల వయసులోనే 'తునైవన్'అనే తమిళ భక్తి సినిమాలో బాలమురుగన్ పాత్రలో శ్రీదేవి మొదటిసారి నటించారు.
తెలుగు, మళయాళ సినిమాల్లోనూ బాలనటిగానే పరిచయమయ్యారు.

1975-85 మధ్యకాలంలో తెలుగు, తమిళంలో ఓ వెలుగు వెలిగారు. ఈ భాషల్లోని అగ్ర హీరోలందరితో శ్రీదేవి నటించారు.
13 ఏళ్ల వయసులో కె.బాలచందర్ దర్శకత్వం చేసిన 'మూండ్రు ముడిచ్' సినిమాతో హీరోయిన్‌గా తన కెరీర్ ప్రారంభించారు.
ఈ సినిమాలో శ్రీదేవితోపాటు కమల్ హసన్, రజినీ కాంత్ కూడా నటించారు. ఆ తర్వాత వచ్చిన పదహారేళ్ల వయసు సినిమాతో చాలా పాపులర్ అయ్యారు.
ఈ సినిమా హిందీ వర్షన్ 'సోల్వా సావన్'తో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించారు.
ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబులతో నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ హిట్‌లుగా నిలిచాయి.
ప్రేమాభిషేకం, బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు.. ఇలా చాలా సినిమాలు కమర్షియల్‌గా హిట్ అయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
'బడిపంతులు' సినిమాలో ఎన్టీఆర్‌కు మనవరాలిగా నటించిన శ్రీదేవి.. తర్వాతి కాలంలో ఎన్టీఆర్‌తో హీరోయిన్‌గా కూడా నటించారు.
తర్వాతి తరం హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో కూడా శ్రీదేవి హీరోయిన్‌గా నటించారు.
నాగార్జునతో 'ఆఖరి పోరాటం', 'గోవిందా గోవిందా', వెంకటేష్‌తో 'క్షణక్షణం', చిరంజీవితో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మరికొన్ని సినిమాల్లో నటించారు.
శ్రీదేవి మరణంపై కమల్ ట్విటర్‌లో స్పందించారు.
శ్రీదేవితో కలిసి నటించిన 'వసంత కోకిల' సినిమాలోని ''కథగా కల్పనగా కనిపించెను నాకొక యువరాణి..!'' జోలపాటను ఆయన గుర్తు చేసుకున్నారు.
''శ్రీదేవిని చిన్నతనం నుంచి చూస్తున్నాను. ఆమె బాల్యం నుంచి అద్భుతమైన మహిళగా పరిణమించిన క్రమానికి నేను ఓ సాక్షిని. ఆమెతో ముడిపడిన ఎన్నో ఆనందభరిత క్షణాలు, తనను చివరిసారిగా కలిసిన ఘడియలు అన్నీ నా కళ్ల ముందు మెదులుతున్నాయి. వసంత కోకిల సినిమాలోని జోలపాట నన్ను వెంటాడుతోంది. వియ్ మిస్ హర్!'' అని ట్వీట్ చేశారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

రజినీ కాంత్ కూడా ట్విటర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
''నేను చాలా కలత చెందాను. ఓ మంచి మిత్రురాలిని కోల్పోయాను. సినీ పరిశ్రమ ఓ లెజెండ్‌ను కోల్పోయింది. వారి కుటుంబ సభ్యులను తలుచుకుంటే గుండె తరుక్కుపోతోంది. శ్రీదేవీ..! మేం నిన్ను మిస్ అవుతున్నాం.'' అని ట్వీట్ చేశారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

లేడీ అమితాబ్ బచ్చన్
దక్షిణాది నుంచి బాలీవుడ్ తెరపైకి వెళ్లిన రీమేక్ సినిమాలు హిమ్మత్ వాలా(1983), మవాలీ(1983), తోఫా(1984) మక్సద్(1984), మాస్టర్ జీ(1985), నమా కదమ్(1984) మరికొన్ని సినిమాలతో శ్రీదేవి గుర్తింపు తెచ్చుకున్నారు.
మిస్టర్ ఇండియా, నగీనా(తెలుగులో నాగిని) సినిమాలతో.. లేడీ 'అమితాబ్ బచ్చన్' అని బాలీవుడ్‌లో పిలిపించుకున్నారు.
జితేంద్ర, శ్రీదేవి, అనిల్ కపూర్, శ్రీదేవి కలిసి చాలా హిట్ సినిమాలు చేశారు. బాలీవుడ్‌లో 1980 దశకాన్ని 'శ్రీదేవి దశకం' అని పిలుస్తారు.
బాలీవుడ్‌లో తనకు విజయం సాధించిపెట్టిన సినిమాల్లో ఎక్కువ సినిమాలను నిర్మించిన బోనీకపూర్‌ను శ్రీదేవి పెళ్లి చేసుకున్నారు. వీరికి జాహ్నవి, ఖుషి ఇద్దరు కూతుళ్లు.

ఫొటో సోర్స్, Sridevi/twitter
తన పెద్ద కూతురు జాహ్నవి హీరోయిన్‌గా నటిస్తున్న 'ధడక్' సినిమా ఈ సంవత్సరమే విడుదల కానుంది. ఈ సినిమాకు కరణ్ జోహార్ దర్శకుడు.
భారత ప్రభుత్వం శ్రీదేవికి పద్మశ్రీ ప్రదానం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
1997లో విడుదలైన 'జుడాయి' తర్వాత శ్రీదేవి 15 సంవత్సరాలపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. 2012లో విడుదలైన 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమాతో మళ్లీ తెరపై కనిపించారు.
2017లో విడుదలైన 'మామ్' సినిమా ఆవిడ కెరీర్‌లో చివరిది..!
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









