సింగపూర్ రెస్టారెంట్‌లో శ్రీదేవి రూపం

శ్రీదేవి విగ్రహం

ఫొటో సోర్స్, Twitter/tapan_kp

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలుగు రాష్ట్రాల్లో శ్రీదేవి అన్న పేరు ఎంతో మందికి ఉంటుంది. వారిలో అత్యధికులకు ఆ పేరు రావడానికి కారణం సినీ నటి శ్రీదేవే. ఇప్పుడా అతిలోకసుందరి ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయింది.

గత అర్ధ శతాబ్ద కాలంగా ఆ పేరు అందానికి మారుపేరుగా నిలిచిపోయింది.

దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఆమెను నిత్యం జ్ఞప్తికి తెచ్చుకునేవారున్నారు.

సింగపూర్‌లోని ఓ హోటల్ యాజమాన్యమైతే శ్రీదేవి బొమ్మను తయారు చేయించి తమ రెస్టారెంట్‌లో పెట్టుకుంది.

శ్రీదేవి

ఫొటో సోర్స్, AFP

సింగపూర్‌లో 'దిల్లీ రెస్టారెంట్' అనే హోటల్ ఒకటుంది.

ఆ రెస్టారెంట్లోకి కొత్తగా అడుగుపెట్టేవారు అక్కడ కనిపించే బొమ్మను చూసి ఆశ్చర్యపోతుంటారు.

అచ్చం హీరోయిన్ శ్రీదేవిలా ఉందనుకుంటారు.. కొద్దిసేపటికే అర్థం చేసుకుంటారు, అది శ్రీదేవి విగ్రహమేనని.

అచ్చమైన చీరకట్టుతో, ఒంటినిండా నగలు ధరించి సంప్రదాయబద్ధంగా ఉన్న శ్రీదేవి పింగాణీ బొమ్మ అక్కడ కనిపిస్తుంది.

అక్కడే ఆమె గొప్పదనాన్ని వివరిస్తూ కొంత సమాచారం కూడా ఉంటుంది.

line
పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

line

ఈ బొమ్మ ఆ రెస్టారెంటుకు ప్రత్యేక ఆకర్షణగా మారిపోయిందని సింగపూర్‌లోని భారతీయులు చెప్తుంటారు.

క్లిఫర్డ్ టాన్, డయానా అనే దంపతులు 1988 నుంచి నిర్వహిస్తున్న ఈ ఇండియన్ రెస్టారెంట్ అక్కడి రేస్ కోర్స్ రోడ్‌లో ఉంది.

రెస్టారెంటుకు వచ్చే భారతీయుల ద్వారా శ్రీదేవి గురించి తెలుసుకున్న ఆ దంపతులు తమ రెస్టారెంట్‌లో ఏకంగా ఇలా ఆమె రూపాన్ని నిలిపారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.