'కళ్లతో శ్రీదేవి పలికించిన హావభావాల్ని ఎలా మర్చిపోగలం'

పవన్ కళ్యాణ్

ఫొటో సోర్స్, Facebook/Janasenaparty

దుబాయిలో వివాహానికి వెళ్ళిన శ్రీదేవి చనిపోయారని తెలియగానే దిగ్భ్రాంతికి లోనయ్యానని పవన్ కల్యాణ్ తెలిపారు. శ్రీదేవి మృతి పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు.

'శ్రీదేవి తన అసమాన అభినయ ప్రతిభతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. శ్రీదేవి ఇక లేరు అనే మాట నమ్మలేనిది. భౌతికంగా ఈ లోకాన్ని వీడినా నటిగా ఆమె ముద్ర చిత్రసీమలో సుస్థిరం' అని పవన్ కల్యాణ్ అన్నారు.

శ్రీదేవి

ఫొటో సోర్స్, SRIDEVI / TWITTER

బాల నటిగా 'బూచాడమ్మ బూచాడు' పాటలో కళ్లు అటూ ఇటూ తిప్పుతూ పలికించిన హావభావాల్ని ప్రేక్షకులు మరచిపోలేరు. అన్నయ్య చిరంజీవితో జగదేకవీరుడు-అతిలోక సుందరిలో దేవకన్య ఇంద్రజగా కనిపించిన తీరు, 'మానవా..' అంటూ చెప్పే సంభాషణలు కూడా ఎవరూ మర్చిపోలేరు' అని పవన్ కల్యాణ్ అన్నారు.

పెద్ద కుమార్తెను కథానాయకిగా చిత్రసీమకి తీసుకువస్తున్న తరుణంలో శ్రీదేవి ఈ లోకాన్ని వీడటం బాధాకరం" అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.