భారత్ మ్యాట్రిమోనీ విడుదల చేసిన వీడియోపై వివాదమెందుకు? అందులో ఏముంది?

ఫొటో సోర్స్, @bharatmatrimony
పెళ్లి సంబంధాలు చూసే ఆన్‌లైన్ సంస్థ 'భారత్ మ్యాట్రిమోనీ’ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటోంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం, హోలీ సందర్భంగా ఆ సంస్థ విడుదల చేసిన ఒక వీడియో మీద విమర్శలు వస్తున్నాయి.
#BoycotBharatMatrimony ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది.
వీడియోలో ఏముంది?
భారత్ మ్యాట్రిమొని విడుదల చేసిన వీడియోలో... ఒక మహిళ రంగులతో ఉన్న తన ముఖాన్ని కడుక్కుంటూ కనిపిస్తారు. రంగులన్నీ పోయిన తర్వాత ఆమె ముఖంపై కొన్ని గాయాలు కనిపిస్తాయి.
‘‘కొన్ని రంగులను అంత తేలిగ్గా తుడిచివేయలేం. హోలీ సందర్భంగా ఎదురయ్యే వేధింపులతో మహిళలు తీవ్రమైన వేదనకు లోనవుతున్నారు.
ఇలా వేధింపులను ఎదుర్కొన్న మహిళల్లో మూడోవంతు నేడు హోలీని ఆడటం మానేశారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు సురక్షితంగా హోలీ జరుపుకునేలా చూద్దాం’’ అంటూ ఆ వీడియోలో భారత్ మ్యాట్రిమోనీ పిలుపునిచ్చింది.
బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు ఎదురవుతోన్న సవాళ్లను గుర్తించడం అత్యంత ముఖ్యమని, వారి క్షేమం, భద్రతలను నిరంతరం కోరుకునే సమాజాన్ని అందించాలని కోరింది.

ఫొటో సోర్స్, @bharatmatrimony
‘‘హిందువులంటే ఎందుకు అంత ద్వేషం’’
భారత్ మ్యాట్రిమోనీ విడుదల చేసిన వీడియోను కొందరు విమర్శిస్తున్నారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ వీడియో రూపొందించారని కొందరు ఆరోపిస్తున్నారు.
మహిళలపై జరిగే వేధింపులకు పండుగలతో సంబంధం లేదని, కానీ కొన్ని కంపెనీలు అనవసరంగా వీటిని హిందూ పండుగలతో ముడిపెడుతున్నాయని విమర్శిస్తున్నారు.
‘‘హిందువులు, హిందూ పండుగలు అంటే ఎందుకు అంత ద్వేషం?’’ అంటూ నీరజ్ కుమార్ ధీరజ్ అనే వ్యక్తి అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘సంతోషాన్ని పంచే హిందూ పండుగల రోజున హిందూ ఫోబియాను భారత్ మ్యాట్రిమెనీ ప్రచారం చేస్తోంది. ఇతర మతాలకు చెందిన మహిళలు కూడా వేధింపులు ఎదుర్కొంటున్నారు. మరి ఇతర మతాల పండుగల రోజున ఎందుకు మౌనంగా ఉంటున్నారు?’’ అంటూ హితేశ్ ప్రజాపతి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
తమ పండుగలతో లైంగిక వేధింపులను లింక్ చేయడం చూస్తే చాలా బాధగా ఉందని మరో యూజర్ అన్నారు.
ప్రతి ఒక్కరి సంస్కృతిని, నమ్మకాన్ని గౌరవించాలని, వైవిధ్యతను వేడుక చేసుకోవాలని చెప్పారు. కేవలం ప్రేమను మాత్రమే పంచాలని, ద్వేషాన్ని కాదని ఒక ట్విటర్ యూజర్ కోరారు.
హిందూ పండుగలను మీ సోషల్ సర్వీసు మెసేజ్‌ల కోసం వాడుకోవద్దని అంటున్నారు.
ఎంత వీలైతే అంత త్వరగా ఈ ప్రకటనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
కొందరు యూజర్లు బాయ్‌కాట్ మ్యాట్రిమోనీ అనే హ్యాష్‌ట్యాగ్‌తో కామెంట్లు చేస్తున్నారు.

మ్యాట్రిమోనీ.కామ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అర్జున్ భాటియా ఆ వీడియోను లింక్డిన్‌లో కూడా పోస్టు చేశారు. అక్కడా దాని మీద భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి.
కొందరు హిందువుల పండుగలను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శిస్తుంటే, మరికొందరు శక్తివంతమైన సందేశం ఇచ్చారని అభినందిస్తున్నారు.
మరి కొంతమంది మార్కెటింగ్ క్యాంపెయిన్ల ద్వారా కొన్ని మతాల పండుగలను టార్గెట్ చేయడం ఆపాలని కోరుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అయితే, సోషల్ మీడియాలో వస్తున్న ఈ విమర్శలపై భారత్ మ్యాట్రిమోనీ సంస్థ ఇంకా స్పందించలేదు.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత మీద ఈడీ ఆరోపణలు ఏమిటి?
- అన్ని వయసుల వారికీ గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్.. ముందే గుర్తించడం ఎలా?
- IWD2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఊదా రంగును ఎందుకు ధరిస్తారు...
- అక్కడ విడాకులను వేడుకగా జరుపుకుంటారు
- Sexual Health: ‘‘వయాగ్రా తీసుకొని మద్యం తాగడంతో మరణించిన వ్యక్తి’’... అరుదైన కేసుగా వెల్లడి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














