విరాట్ కోహ్లీని హత్తుకున్న వెస్టిండీస్ క్రికెటర్ తల్లి, ఈ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ ఏంటి?

విరాట్ కోహ్లిని కౌగలించుకున్న జాషువా తల్లి

ఫొటో సోర్స్, VIMAL KUMAR

ఫొటో క్యాప్షన్, విరాట్ కోహ్లిని కౌగలించుకున్న వెస్టిండీస్ వికెట్ కీపర్ జాషువా తల్లి
    • రచయిత, విమల్ కుమార్
    • హోదా, బీబీసీ హిందీ కోసం
    • నుంచి, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ నుంచి

వెస్టిండీస్ వికెట్ కీపర్ జాషువా డా సిల్వా గత మూడు సంవత్సరాలలో 23 టెస్టులు, రెండు అంతర్జాతీయ వన్డేలు ఆడారు. అయితే, ఇప్పటి వరకు ఆయనెప్పుడూ పెద్దగా వార్తల్లో నిలవలేదు.

కానీ, అతని తల్లిదండ్రులు విరాట్ కోహ్లిని కలిసిన తర్వాత వెస్టిండీస్ ఈ వెస్టిండీస్ వికెట్ కీపర్ ఒక్కసారిగా న్యూస్ ఐటమ్‌గా మారారు.

రెండో టెస్టు రెండో రోజున విరాట్ కోహ్లీని జాషువా తల్లి కరోలిన్ కలిశారు. ఈ సందర్భంగా ఆమె విరాట్ కోహ్లీని హత్తుకున్నారు. టీమ్ సభ్యులు ప్రయాణించే బస్సు దగ్గర ఉండగా, కోహ్లీని కలుసుకున్న ఆమె, ఆలింగనం చేసుకుని కోహ్లీ బుగ్గ మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు.

ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా లక్షలమంది క్రికెట్ అభిమానులను చేరుకుంది.

క్రికెట్ మైదానంలో ఇరు దేశాలు ప్రత్యర్థులు అయినప్పటికీ, ఒక అద్భుతమైన క్రికెటర్‌ను ప్రత్యర్థి దేశపు అభిమానులు కూడా ఎలా గౌరవిస్తారో ఈ వీడియో మనకు చెబుతోంది.

ఈ వీడియోలో జాషువా తల్లి, విరాట్ కోహ్లిని కౌగలించుకుని భావోద్వేగానికి గురయ్యారు.

అంతకు ముందు రెండో టెస్టు మొదటి రోజున జాషువా గ్రౌండ్‌లో కీపింగ్ చేస్తుండగా అన్నా మాటలు లైవ్‌లో ప్లే అయ్యాయి.

‘‘నీ ఆట చూడటానికి కాదు, కోహ్లీ ఆట చూడటానికి వస్తున్నా అని మా అమ్మ అంది. నేను నమ్మలేదు’’ అని జాషువా కోహ్లీతో అన్నాడు.

జాషువా కూడా విరాట్‌కు వీరాభిమాని. మీరు సెంచరీ చేయడం చూడాలని ఉంది అని జాషువా అనడం కూడా లైవ్ లో రికార్డయ్యింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

‘‘ఆమెకు ఈ రోజు మరిచిపోలేని రోజు. ఈ రోజే కాదు..ఈ సంవత్సరం ఆమెకు మరిచిపోలేని సంవత్సరం’’ అని జాషువా అంటున్న వీడియోను, కోహ్లీని కరోలిన్ ఆలింగనం చేసుకుంటున్న వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది.

విరాట్ కోహ్లిని కౌగలించుకున్న వెస్టిండీస్ వికెట్ కీపర్ జాషువా తల్లి

ఫొటో సోర్స్, VIMAL KUMAR

ఫొటో క్యాప్షన్, విరాట్ కోహ్లితో వెస్టిండీస్ వికెట్ కీపర్ జాషువా తల్లి

మ్యాచ్‌తో పాటు విరాట్ కోహ్లి, జాషువా తల్లికి సంబంధించిన వైరల్ వీడియోపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలు స్పందిస్తున్నారు. కరేబియన్ ప్రేక్షకులలో కూడా ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది.

కోహ్లిని కలిసిన తర్వాత, ఆయన భార్య అనుష్క శర్మను కూడా కలవాలని ఉందని జాషువా తల్లి తన మనసులోని కోరికను చెప్పారు.

టీమిండియా బౌలింగ్ కోచ్‌తో మేం ఈ వీడియో గురించి మాట్లాడినప్పుడు, ‘కేవలం భారత క్రికెట్‌కు మాత్రమే కాక, ప్రతి ఒక్కరికీ కోహ్లి ఎంత డిమాండ్ ఉన్న ఆటగాడో ఈ వీడియో ద్వారా తెలుస్తుంది’ అని అన్నారు.

ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలున్నాయని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జేసన్ హోల్డర్ చెప్పారు.

కోహ్లి, ఆయన పాపులారిటీపై స్పందించిన హోల్డర్, కోహ్లి ఆడే తీరే వేరని అన్నారు.

కోహ్లి క్యాచ్‌ను చూసేందుకు కరేబియన్ ప్రేక్షకులు కూడా భారతీయులంత ఉత్సాహం చూపిస్తారని చెప్పారు.

మొత్తంగా, కోహ్లి తర్వాత మైదానం వెలుపల ఇంతలా అభిమానించే ఆటగాడు ఎవరూ లేరు, అతనితో కాకుండా మరెవరితో కూడా అంతలా ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపించరు.

టెస్ట్ మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

కోహ్లిని కౌగలించుకుని, అతని బుగ్గలపై ముద్దు పెట్టడంతో కరోలిన్ ఆనందానికి అవధులేవు. చిన్న పిల్లల మాదిరే, ఆమె విరాట్ కోహ్లితో కలిసి ఫొటోలు తీసుకున్నారు. ఆయనపై తనకున్న అభిమానాన్ని తెలియజేశారు.

అతని వ్యక్తిగత జీవితాన్ని, భార్యను పొగడంతో పాటు, కోహ్లిలో ఉన్న మంచి లక్షణాలను ఆమె ప్రశంసించారు.

జర్నలిస్ట్ విమల్ కుమార్‌తో మాట్లాడిన కరోలినా, కేవలం క్రికెటర్‌ మాదిరిగానే కాక, అతనికున్న మంచి మనస్సును హృదయపూర్వకంగా కొనియాడారు కరోలిన్.

కోహ్లికున్న లక్షణాలను చూసి నా కొడుకు జాషువా స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నానని చెప్పారు. క్రికెట్ ప్రయాణంలో ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు కరోలిన్.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)