ఇండియా, చైనా సైనికుల మధ్య మళ్లీ ఘర్షణ.. రెండు దేశాల సైనికులకూ గాయాలు

ఇండియా, చైనా సరిహద్దు

ఫొటో సోర్స్, Getty Images

 అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికులు ఘర్షణ పడినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.

డిసెంబర్ 9న తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్ద రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరగ్గా ఈ ఘటనలో రెండు దేశాల సైనికుల్లోనూ కొందరు గాయపడినట్లు ఏఎన్ఐ చెప్పింది.

వాస్తవాధీన రేఖ వద్దకు చైనా సైనికులు రావడంతో ఈ ఘర్షణ జరిగినట్లు తెలిపింది.

‘పీఎల్ఏ బలగాలు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ మీదకు వచ్చాయి. చైనా సైనికుల చర్యలను కనిపెట్టిన భారత్ బలగాలు వెంటనే గట్టిగా తిప్పికొట్టాయి’ అని ఏఎన్ఐ పేర్కొంది.

లద్దాఖ్‌లోని గల్వాన్ వ్యాలీ ఘర్షణ తరువాత చైనా, భారత్ సైనికులు బాహాబాహీకి దిగడం మళ్లీ ఇదే.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

ఇంతకుముందు లద్దాఖ్‌లోని గల్వాన్ వ్యాలీలో 2020 జూన్ 15న రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.

అప్పుడు 20 మంది భారతీయ సైనికులు మృతి చెందగా, ఎంతోమంది గాయాలు పాలయ్యారు. అయితే ఆ ఘర్షణలో చైనా సైనికులు కూడా భారీగానే చనిపోయారని భారత్ పేర్కొంది.

కానీ, చైనా మాత్రం తమ సైనికులు కేవలం నలుగురే చనిపోయారని చెప్పింది.

గల్వాన్ ఘర్షణ తరువాత నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.

గల్వాన్ ఘర్షణ

ఫొటో సోర్స్, Getty Images

2022 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాకు చెందిన వార్తాపత్రిక ‘ది క్లాక్సన్’ విడుదల చేసిన ఇన్వెస్టిగేటివ్ నివేదికలో కనీసం 38 మంది పీఎల్ఏ సైనికులు చనిపోయారని పేర్కొంది.

గల్వాన్‌లో భారత్‌తో ఈ ఘర్షణకు దిగిన కమాండర్‌ను చైనా ఈ ఏడాది జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ సమావేశానికి అతిథిగా ఆహ్వానించింది.

Tawang

ఫొటో సోర్స్, Getty Images

‘చైనా సైనికులే ఎక్కువగా గాయపడ్డారు’

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో జరిగిన ఘర్షణలలో చైనా సైనికులను ఎదుర్కొనేందుకు భారత్ కూడా తమ బలగాలను భారీగా మోహరించిందని ఏఎన్‌ఐ చెప్పింది.

భారత్ బలగాలతో పోలిస్తే చైనా సైనికులే ఎక్కువగా గాయపడ్డారని తెలిపింది. చైనాకు చెందిన 300 మందికి పైగా సైనికులు ఈ ఘర్షణకు దిగినట్టు తెలిపింది.

కానీ భారత్‌కు చెందిన ఎంత మంది బలగాలు ఈ ఘర్షణలలో పాల్గొన్నాయో తెలియరాలేదు.

తమ తమ సైనికులకు గాయాలైన తర్వాత వెంటనే రెండు దేశాలు కాస్త వెనక్కి తగ్గాయని ఏఎన్‌ఐ పేర్కొంది.

కాగా ఘర్షణ తరువాత... ఆ ప్రాంతంలోని భారత్ కమాండర్ వెంటనే చైనా కమాండర్‌తో ఫ్లాగ్ సమావేశాన్ని నిర్వహించి, ఘర్షణ చల్లారేలా చర్యలు చేపట్టారని ఏఎన్ఐ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ఈ ఘటనపై విపక్ష పార్టీ కాంగ్రెస్, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

‘అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనాలు ఘర్షణకు దిగాయని తెలిసింది. చైనాకు కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరికలు పంపాల్సిన సమయం వచ్చింది. ఈ చర్య సహించదగ్గది కాదు’అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

అలాగే ఇరు దేశాల సైనికుల మధ్య ఇంత పెద్ద ఘర్షణ చోటు చేసుకుంటే, ప్రభుత్వం ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టిందని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.

శీతాకాల సమావేశాలు జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం ఎందుకు పార్లమెంట్‌కి తెలపలేదని అడిగారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)