మాధవీలతపై కేసు ఎందుకు పెట్టారు, అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవీలతపై మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించారంటూ ఐపీసీ సెక్షన్ 171సీ, 186, 505(1)(సీ)తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 ప్రకారం ఆమెపై కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ట్విటర్ వేదికగా వెల్లడించారు.
తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆమె అక్కడ ముస్లిం మహిళా ఓటర్ల ఐడీలు, బురఖా తొలగింపజేసి వారి ముఖాలు తనిఖీ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, ani
అసలేం జరిగింది?
పోలీసులు FIRలో పేర్కొన్న వివరాల ప్రకారం మలక్‌పేట్ అసెంబ్లీ పరిధిలోని ఆస్మాన్‌గద్ హోలీ మదర్ హైస్కూల్‌లోని 64వ నెంబర్ పోలింగ్ కేంద్రంలోకి బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత వెళ్లారు.
పోలింగ్ బూత్‌లో ఒక మహిళా ఐడీ కార్డులోని ఫోటోను సరిపోల్చేందుకు బురఖా తొలగించమని ఆమెను మాధవీలత అడిగారు.
దీనిపై బూత్ లెవెల్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ (186/2024)నమోదు చేశారు.

ఎఫ్ఐఆర్‌లో ఏముంది?
ఎఫ్ఐఆర్‌లోని వివరాల ప్రకారం..
''ఉదయం 10.45 ప్రాంతంలో కొంపల్లి మాధవీలత పోలింగ్‌బూత్ 64లోకి వెళ్లారు.
ఓటు వేసేందుకు వచ్చిన ఒక మహిళా ఓటరు ఐడీ కార్డు తీసుకుని, ఆమె అనుమతి లేకుండానే ఆమె బురఖాను తొలగించారు.
ఆ తర్వాత ఐడీ కార్డులోని ఫోటో సదరు మహిళ ముఖంతో సరిపోలడం లేదని, ఇంటికి తిరిగి పంపించాలని అధికారులకు సూచించారు.
మహిళా ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించే ముందు వారి బురఖాలు తీసి, ముఖాలను సరిపోల్చుకోవాలని అన్నారు.
దీంతో సదరు మహిళ తన ఓటు హక్కు వినియోగించుకోకుండానే పోలింగ్ కేంద్రం నుంచి తిరిగి వెళ్లిపోయారు'' అని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
మాధవీలత ఏమన్నారు?
ఈ కేసుపై మాధవీలత స్పందించారు.
‘‘నేనొక అభ్యర్థిని. చట్టప్రకారం ఐడీ కార్డులతో ఫేస్‌మాస్క్ లేకుండా ఓటరును తనిఖీ చేసే హక్కు నాకుంది. నేను పురుషుడిని కాను. నేను మహిళను. నేను మీ గుర్తింపు కార్డు ఆధారంగా మిమ్మల్ని గుర్తించవచ్చా అని ఎంతో మర్యాదగా అడిగాను. ఎవరైనా దీన్ని ఓ పెద్ద సమస్యగా చిత్రీకరించాలనుకుంటే వారు భయపడుతున్నారని అర్థం’’ అని ఏఎన్ఐ వార్తా సంస్థకు మాధవీలత చెప్పారు.
‘‘90 శాతం పోలింగ్‌బూత్‌లలో అక్రమాలు జరుగుతున్నాయి. ఓటరు ఐడీ ఆధారంగా ఓటరును గుర్తించేందుకు మహిళా కానిస్టేబుళ్ళకు పోలీసులు ఆదేశాలు ఇవ్వరు. నేనీ విషయం పోలీసులను అడిగితే అది తమ బాధ్యత కాదని చెప్పారు’’ అని మాధవీలత పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఎంఐఎం ఏమంది?
మాధవీలత ముస్లిం మహిళ బురఖా తొలగించడంపై ఏఐఎంఐఎం స్పందించింది. ‘‘ఇది ఎన్నికల నియామవళి ఉల్లంఘన’’ అని పేర్కొంది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి ముస్లిం మహిళలను పోలింగ్ బూత్‌లలో వేధించి అవమానించారు. మహిళా కమిషన్ దీనిపై చర్యలు తీసుకోవాలి’’ అని ఆ పార్టీ ఎక్స్‌లో రాసుకొచ్చింది.
హైదరాబాద్ లోక్‌సభా స్థానంలో ఒవైసీ మాధవీలతను ఎదుర్కొంటున్నారు. ఒవైసీ 2004 నుంచి ఏఐఎంఐఎం ఎంపీగా ఉన్నారు.
ప్రస్తుతానికి మాధవీలత బురఖా వివాదంలో చిక్కుకున్నప్పటికీ తనకు ముస్లిం మహిళల్లో మంచి పట్టు ఉందని ఆమె చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024: మీరు ఎవరికి ఓటేశారో తెలుసుకోవడమెలా?
- ‘నాకు పెళ్లి కావడం లేదు, సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళుతుంటాను. ఇలా ఎన్నాళ్లంటే.....
- ‘మా నాన్న సీఎం’
- స్కోపోలమైన్: డెవిల్స్ బ్రీత్‌గా పిలుచుకునే ఈ డ్రగ్ వాసన చూస్తే ఎదుటివాళ్లు ఏం చెబితే అది చేస్తారు...ఏమిటిది?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల పోలింగ్: నిబంధనల ఉల్లంఘన, అధికారుల నిర్లక్ష్యంపై ఈసీ హెచ్చరికలు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















