ప్రవళిక ఆత్మహత్యపై నాయకులు, విద్యార్ధి సంఘాల వాదనేంటి, పోలీసులు ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం...
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌కు వచ్చి కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్న ప్రవళిక అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.
అశోక్ నగర్‌లోని హాస్టల్‌లో శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆమె రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్‌లో ‘కుటుంబ ఆశలను నెరవేర్చలేకపోతున్నానని, తనను క్షమించాలని’ రాసి ఉంది.
ప్రవళిక స్వస్థలం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి. తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం.
కాగా, గ్రూప్ 2 పరీక్ష వాయిదా కారణంగానే మనస్తాపంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని కొందరు ఉద్యోగార్ధులు, పలు పార్టీ నాయకులు ఆరోపించారు.
కానీ, ప్రేమ వ్యవహారంలో మనస్తాపం కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు స్పష్టం చేశారు.
పోటీ పరీక్షల కోసం హైదరాబాద్‌కు..
ప్రవళిక ఆత్మహత్య విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగాయి. ఉద్యోగ పరీక్షల వాయిదా కారణంగానే ఒత్తడితో ప్రవళిక ఆత్మహత్య కు పాల్పడినట్టు వారు ఆరోపించారు.
పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేసి, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
పోస్టుమార్టం అనంతరం, భారీ బందోబస్తు మధ్య అంబులెన్సులో ప్రవళిక మృతదేహాన్ని స్వగ్రామమైన బిక్కాజిపల్లి తరలించారు.
మృతదేహానికి నివాళులు అర్పించడానికి వివిధ పార్టీల నాయకులు వచ్చిన నేపథ్యంలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపి నాయకులు నిరసనలకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ర్యాలీలు నిర్వహించడం, రాజకీయ నాయకులు అంతిమయాత్రలో పాల్గొనడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తయ్యాయి.

ఫొటో సోర్స్, UGC
చదువులో ముందుండేది..
‘’చదువుల్లో ముందుండేది. టెన్త్, ఇంటర్‌లోనూ టాప్ మార్కులు తెచ్చుకుంది. డిగ్రీ పూర్తి చేసి గ్రూప్-2 పరీక్షల కోసం హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటోంది. తనకు ఎలాంటి సమస్యలు లేవు. ఈమధ్యే పరీక్షలు రాసి ఇంటికి వచ్చి వెళ్లింది.
శుక్రవారం మధ్యాహ్నమే ఫోన్‌లో మాట్లాడింది. ఆ తరువాత కళ్లు తిరిగి పడిపోయిందని మాకు ఫోన్ వచ్చింది. కొద్దిసేపటికి ఉరి వేసుకుందని ఫోన్ చేసి చెప్పారు. ఎందువల్ల ఇలా జరిగిందో తెలియదు’’ అని ప్రవళిక సోదరుడు ప్రణయ్ చెప్పారు.
విద్యార్ధి సంఘాలు, వివిధ పార్టీల నాయకుల ఆరోపణలు చేసినట్లుగా గ్రూప్ 2 రద్దు కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందన్న మాటను ప్రవళిక కుటుంబ సభ్యులు ధృవీకరించ లేదు.
ఆమె రాసినట్లుగా చెబుతున్న ఆత్మహత్య నోట్‌లో కూడా గ్రూప్ 2 పరీక్ష ప్రస్తావన లేదు. తాను నష్టజాతకురాలిని అని మాత్రమే ఆ లేఖలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, UGC
పోలీసులు ఏమన్నారంటే..
విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నట్లుగా ప్రవళిక గ్రూప్-2 పరీక్షల వాయిదా పడిన కారణంగా ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు అన్నారు.
శనివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. శివరామ్ రాథోడ్ అనే యువకుడితో ప్రవళికకు ప్రేమ వ్యవహారం ఉందని తమకు తెలిసిందని పోలీసులు తెలిపారు.
‘‘మేం స్థానికంగా ఎంక్వైరీ చేసినప్పుడు ఆమెకు ఒక అబ్బాయితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలిసింది. తల్లిదండ్రులకు కూడా ఈ వ్యవహారం తెలిసి గతంలో మందలించినట్లు కూడా విన్నాం. కొందరు ఆమె మరణాన్ని వేరే విషయాలతో ముడిపెడుతున్నారు. కానీ, ఈ అమ్మాయి ఇంత వరకు ఏ గ్రూప్ ఎగ్జామ్ కూడా అటెండ్ కాలేదు. గ్రూప్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చిందన్నది వాస్తవం’’ అని డీసీపీ వెంకటేశ్వర్లు అన్నారు.
ఇరువురి మధ్య విభేదాలు రావడంతో మనస్తాపంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
‘‘వారిద్దరి మధ్య చాటింగ్ లో ఎక్కడ తేడాలొచ్చాయో తెలియదు. ఈ అమ్మాయిని కాదని వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్నాడన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి లేఖ రాసి చనిపోయింది. తనను చిన్నతనం నుంచి కాలు కింద పెట్టకుండా పెంచారని, అయినా మీకు అన్యాయం చేస్తున్నానని ఆమె తన తల్లిదండ్రులకు ఆ లేఖలో చెప్పింది. అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలని తన తమ్ముడిని లేఖలో కోరింది’’ అని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
‘‘మాకు అందిన సమాచారాన్ని క్రోఢీకరించి సైంటిఫిక్ ఎనాలిసిస్ చేసి ఈ కేసులో లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఆ అమ్మాయి ఆత్మహత్యకు ప్రేరేపించాడని తెలిస్తే ఆ యువకుడి మీద కూడా లీగల్ చర్యలు తీసుకుంటాం’’ అని ఆయన వెల్లడించారు.
వీరిద్దరి ప్రేమ వ్యవహారానికి సంబంధించిన సరిపడా ఆధారాలున్నాయని, కేసు విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయని డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు..
ఈ మేరకు పోలీసులు ఒక ప్రెస్‌నోట్‌ను కూడా విడుదల చేశారు.

ఫొటో సోర్స్, HYDERABAD POLICE
రాజకీయ నేతల స్పందన..
ప్రవళిక మృతి విషయం తెలియగానే రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు స్పందించారు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల ఆలస్యం, వాయిదాల వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేశారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా “ఇది ఆత్మహత్య కాదు, యువత కలలు, ఆశలను హత్య చేయడం. తెలంగాణ యువత నిరుద్యోగంతో విలవిలలాడుతోంది. పదేళ్లుగా బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు తమ అసమర్థతతో రాష్ట్రాన్ని నాశనం చేశాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్సీ ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం” అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
“అరాచక పాలనలో మరో ఆడబిడ్డ ఆయువు తీసుకోవడం గుండెలు పిండేస్తోంది” అని బండి సంజయ్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. “దొరల అరాచక పాలనను గద్దెదించి సత్తా చాటుదాం. బరువైన గుండెతో కోరుతున్నా ఆత్మహత్యలు వద్దు ఆగ్రహావేశాలతో తిరగబడదాం. బీజేపీ మీ వెంటే ఉంటుంది” అని యువతని ఉద్దేశించి స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రవళిక మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. యువతీ, యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రవళిక మృతిపై స్పందిస్తూ “ఉద్యోగాలు లేక ప్రవల్లిక లాంటి అమ్మాయి ఉరి వేసుకొని బలవన్మరనానికి పాల్పడుతుంటే.. కేసీఆర్‌ను చూసి ఓటెయ్యండని ఎలా అడుగుతున్నారు కేటీఆర్ గారు? ప్రవల్లికది ఆత్మహత్య కాదు.. మీ సర్కార్ చేసిన హత్య” అంటూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శులు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
విచారణకు ఆదేశించిన గవర్నర్..
ప్రవళిక కుటుంబ సభ్యుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు గవర్నర్ తమిళసై సౌందరరాజన్. ప్రవళిక ఆత్మహత్య ఘటన పై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీ,సీఎస్, టీఎస్పీఎస్సీని ఆదేశించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఇవి కూడా చదవండి..
- కోహ్లీ, రోహిత్‌లను అడ్డుకుని పాకిస్తాన్ గెలుస్తుందా... చిరకాల ప్రత్యర్థుల మధ్య మరో ప్రపంచకప్ సమరం ఎలా ఉండబోతోంది?
- మోర్బీ బ్రిడ్జి ప్రమాదం: 135 మంది మరణానికి బాధ్యులు ఎవరు?
- తెలంగాణ ఎన్నికలు 2023: మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనూ మగవాళ్ళదే ఆధిపత్యం... ఎందుకిలా?
- బిచ్చమెత్తుకునేందుకు వీసాకు రెండు లక్షలు ఖర్చు పెట్టి సౌదీకి వెళ్తున్న పాకిస్తాన్ యాచకులు...
- భూమిని ఢీకొట్టబోయే బెన్నూ గ్రహశకలం నమూనాలను సేకరించిన నాసా స్పేస్‌షిప్ 'ఒసిరిస్-రెక్స్', ఆ శాంపిల్స్ ఫోటోలు ఇవే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















