కొందరు కుర్రాళ్లు నేరాలు ఎందుకు చేస్తారు?

ఆష్లే కెయిన్‌

ఫొటో సోర్స్, BBC/True North

    • రచయిత, షోలా లీ
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రమాదకరమైన ప్రదేశాలను సందర్శించారు టీవీ ప్రజెంటర్‌గా మారిన ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు ఆష్లే కెయిన్.

కొంతమంది యువకులు నేర జీవితాన్ని ఎందుకు ఎంచుకుంటారో తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నించారు.

ప్రపంచంలోని అత్యంత ప్రతికూల వాతావరణాలలో నేరాల ప్రభావం గురించి మాట్లాడుతూ " పూర్తిగా నాశనం చేసేస్తుంది. ప్రజలు ప్రతిరోజూ ప్రాణాలు కోల్పోతున్నారు," అని కెయిన్ చెప్పారు.

తన కొత్త బీబీసీ సిరీస్‌లో.. బ్రెజిల్‌లోని ఫావెలా(శివారు ప్రాంతం)ల నుంచి స్వీడన్‌లోని ముఠాల వరకు నేరాలకు పాల్పడుతున్న యువకులతో మాట్లాడారు ఈ మాజీ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. అలాగే దక్షిణాఫ్రికాలో ఖడ్గమృగాల వేట, కొలంబియాలో అక్రమ బంగారు తవ్వకం వంటి ఇతర అంశాలను కూడా పరిశీలిస్తారు.

వారు నేర జీవితాన్ని ఎందుకు ఎంచుకున్నారో, ప్రజలపై అది చూపే ప్రభావం, అలాగే కొందరు దాని నుంచి ఎలా బయటపడాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రియో, ఫవేలా, నేరాలు

ఫొటో సోర్స్, BBC/True North

ఫొటో క్యాప్షన్, రియోలోని ఫవేలాలో నివసిస్తున్న యువకులను కెయిన్ కలుస్తూ ఉంటారు. వారిలో నేరాలకు పాల్పడుతున్నవారు కూడా ఉన్నారు.

రియో డి జనీరోలోని ఒక ఫావెలాలో ఓ తల్లిని కలిసినట్లు కెయిన్ గుర్తు చేసుకున్నారు. ఆమె ఇద్దరు కొడుకులూ హత్యకు గురయ్యారు.

"అది నన్ను తీవ్రంగా కలచివేసింది" అని ఆయన అన్నారు.

ఆమె చివరకు ఒక నేర ముఠా నుంచి తన కొడుకు ఎముకలను ఎలా సంపాదించారో తెలిసి గుండె బద్దలైందన్నారు.

తన సొంత బిడ్డను కోల్పోయిన కెయిన్.. ఆ క్షణంలో, ఆ మహిళకు ఓదార్పునివ్వాలని, ఆమె చెప్పేది వినాలనుకున్నానని, ఆ ప్రాంతంలో ఉన్న తప్పుల గురించి మాట్లాడటానికి ఆమె గొంతెత్తాలనుకోవాలని తాను ఆశించానని చెప్పారు.

ఫావెలాస్ అనేవి అనధికారిక నివాస ప్రాంతాలు. రియో డి జనీరోలో ఇలాంటివి 1,000 కంటే ఎక్కువ ఉన్నాయి.

ఒక ఫావెలాలోకి వెళ్లిన కెవిన్ అక్కడ అత్యంత సాధారణంగా జరుగుతున్న డ్రగ్స్ అమ్మకాలు, తుపాకులతో తిరుగుతున్నవారిని చూసి ఆశ్చర్యపోయారు.

‘వీళ్లందరి చుట్టూ నేరాలు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుంటామని నమ్మబలికి వారిని వీధుల్లోంచి తీసుకెళ్తారు. చివరకు వారంతా ఒకేచోటికి చేరుతారు’ అన్నారు కెవిన్.

తాను కలిసినవారిలో చాలా మంది సంతోషంగా లేరని ఆయన చెప్పారు. "వారు చేస్తున్న పనిని ఆస్వాదించరు, భయపడతారు, ఆందోళన చెందుతారు, బాధపడతారు" అని ఆష్లే కెయిన్ చెప్పారు.

మాజీ ఫుట్ బాల్ ప్లేయర్, ఆష్లే కెయిన్

ఫొటో సోర్స్, BBC/True North

ఫొటో క్యాప్షన్, ఆష్లే కెయిన్

కెయిన్ అనేక ఫావెలాలకు వెళ్లారు. ఒక చోట అయితే తన డాక్యుమెంటరీ బృందాలు చిత్రీకరించడానికి కూడా అక్కడ అనుమతి దొరకలేదు.

బహిరంగంగా మాదకద్రవ్యాలను అమ్ముతూ, పెద్దపెద్ద ఆయుధాలను మోసుకెళ్తున్న ముసుగు ధరించిన వ్యక్తులతో ఆయన మాట్లాడారు. 13 సంవత్సరాల వయస్సు గల యువకులు కొన్నిసార్లు ఫావెలాలో నేర కార్యకలాపాలలో పాల్గొంటున్నారని వారు వివరించారు.

డబ్బు సంపాదించడానికి వేరే మార్గాలను ఎందుకు ఎంచుకోరు అని కెయిన్ అడిగినప్పుడు... ఆ ప్రాంతంలో ఉద్యోగాలు లేవని ఒక వ్యక్తి చెప్పారన్నారు.

అయితే, ఒక ముఠా కోసం పనిచేస్తున్న, మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన సాయుధ యువకుడితో మాట్లాడటం "నిజంగా షాక్‌కి గురిచేసింది" అని కెయిన్ చెప్పారు.

"ఇదొక మంచి విషయంగా వారు భావించడం వల్ల, ప్రతిరోజూ ప్రాణాలను పణంగా పెడుతున్నారని నేను అనుకుంటున్నాను" అని ఆయన చెప్పారు.

ఇలాంటి చోట నిత్యం తూటాలు పేలిన శబ్దాలు వినిపిస్తాయి అన్నారు కెయిన్.

'సురక్షితమైన జీవితం'

ప్రత్యామ్నాయ మార్గాలవైపు చూస్తున్న యువకులతోనూ కెయిన్ మాట్లాడారు.

ఒక సంగీత సంస్థను నడుపుతున్న వ్యక్తిని కలిసిన విషయం గురించి చెప్పారు.

యువకులకు డీజేలుగా అవకాశాలను అందించడం ద్వారా సురక్షితమైన జీవితాన్ని గడపడానికి వీలుగా ప్రయత్నాలు చేసినట్లు చెప్పారు.

కాక్‌టెయిల్ తయారీ వద్ద ఫావెలా నుంచి వచ్చిన ఒక యువకుడిని కలిశారు కెయిన్. గతంలో ఆ వ్యక్తికి బుల్లెట్ తగిలింది. కానీ ఇప్పుడాయన కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని అనుకుంటున్నారు అని కెయిన్ తెలిపారు.

"ఈ సమాజాలలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల సరైన మద్దతు, చొరవ వీరి ప్రాణాలను కాపాడగలవని" అని ఆయన చెప్పారు.

ఈ యువకులతో మాట్లాడాక తనకు ఓ విషయం అర్థమైందని.. పిల్లలతో సమయం గడపాలని, వారు చెప్పేది వినాలని.. వారు ఇష్టపడే వ్యక్తిగా ఉండాలని తెలిసిందని అన్నారు.

ఈ సిరీస్ ప్రజలు తమ పిల్లలతో మాట్లాడేందుకు ప్రోత్సహిస్తుందని తాను ఆశిస్తున్నానని కెయిన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)