ఫిడె ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌గా కోనేరు హంపి

చెస్, కోనేరు హంపి

ఫొటో సోర్స్, Getty Images

గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి 'ఫిడె ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ -2024 గెలిచారు. 2019లోనూ ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌గా గెలిచిన హంపికి ఈ చాంపియన్‌షిప్‌ను గెలవడం ఇది రెండోసారి.

న్యూయార్క్‌లో జరిగిన ఈ పోటీలో ఆమె చివరి రౌండ్‌లో ఇండోనేసియాకు చెందిన ఇరీన్ సుకందార్‌పై విజయం సాధించి చాంపియన్ అయ్యారు.

ఈ టోర్నీని రెండు సార్లు గెలిచిన రెండో క్రీడాకారిణి హంపి. ఇంతకుముందు చైనాకు చెందిన జు వెంజున్ ఇలా రెండు సార్లు ఈ చాంపియన్‌షిప్ గెలిచారు.

తాజా విజయం తరువాత ఆమె మాట్లాడుతూ.. 'కుటుంబ ప్రోత్సాహం వల్లే ఈ విజయం దక్కింది, చెస్ కోసం ప్రయాణాలు చేసేటప్పుడు నా కుమార్తెను నా తల్లిదండ్రులే చూసుకుంటారు. 37 ఏళ్ల వయసులో ప్రపంచ చాంపియన్ కావడమంటే మాటలు కాదు' అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

బీబీసీ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
'బీబీసీ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ 2020' కోనేరు హంపి
ఫొటో క్యాప్షన్, 'బీబీసీ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ 2020' కోనేరు హంపి

2020‌లో ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు విజేత

హంపి చదరంగం క్రీడలో అంతర్జాతీయంగా పేరున్న క్రీడాకారిణి.

ఎన్నో టైటిళ్లను గెల్చుకున్న తర్వాత, ప్రసూతి విరామం తీసుకున్న హంపి...మళ్లీ ఆట మొదలుపెట్టి 2019లో వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌గా నిలిచారు.

2020 సంవత్సరానికి గాను ఆమె 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్' అవార్డ్‌ను గెలుచుకున్నారు.

'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్ -2020' అవార్డును గెలుచుకున్న అనంతరం అప్పట్లో ఆమె మాట్లాడుతూ.. 'ఇండోర్ గేమ్ అయిన చెస్‌ భారత్‌లో క్రికెట్ తరహాలో అందరి దృష్టిని ఆకర్షించలేదని.. కానీ, బీబీసీ అవార్డుతో చెస్ కూడా ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందని భావిస్తున్నాను' అన్నారు.

తన పట్టుదల, ఆత్మవిశ్వాసం కారణంగానే ఆటలో రాణించానని.. కొంతకాలం ఆటకు దూరమైనా ఆ తరువాత మళ్లీ విజయాలు సాధించడానికి ఆ పట్టుదలే కారణమని ఆమె చెప్పారు.

చెస్, కోనేరు హంపి

ఫొటో సోర్స్, Getty Images

చిన్నవయసులోనే గ్రాండ్ మాస్టర్

హంపి చిన్న వయసులోనే.. అంటే 15 ఏళ్ల ఒక నెల 27 రోజులకే గ్రాండ్‌మాస్టర్ అయ్యారు. 2002లో ఆమె ఈ రికార్డ్ సాధించారు.

అండర్ 10, 12, 14 వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్‌లనూ ఆమె గెలుచుకోవడంతో ఆమె ఉమన్ గ్రాండ్ మాస్టర్ అయ్యారు.

అత్యంత పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయిన క్రీడాకారిణిగా ఆమె పేరిట ఉన్న రికార్డును అనంతరం 2008లో చైనా క్రీడాకారిణి హో ఇఫాన్ చెరిపేశారు.

హంపి 2003లో అర్జున అవార్డు.. 2007లో పద్మశ్రీ పురస్కారం పొందారు.

2016లో మెటర్నిటీ బ్రేక్ తీసుకున్న హంపి 2019లో 'ఫిడె ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్' గెలిచారు. మళ్లీ ఈ ఏడాది(2024)లోనూ ఆ చాంపియన్‌షిప్ గెలుచుకున్నారు.

2019లో ఆమె వరల్డ్ చాంపియన్ అయినప్పుడు తన కుమార్తెకు రెండేళ్లు.

అనంతరం 2020లో ఆమె చెస్ ఒలింపియాడ్‌లో బంగారు పతకం సాధించారు.

చెస్, కోనేరు హంపి

ఫొటో సోర్స్, Getty Images

హంపి కోసం ఉద్యోగం మానేసిన తండ్రి

ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి పెరిగిన కోనేరు హంపి తనకు ఆరేళ్లున్నప్పుడే చెస్ ఆడడం ప్రారంభించారు. హంపి తండ్రి కూడా చెస్ ఆటగాడు. హంపిలో ప్రతిభను గుర్తించిన ఆయన తన కూతురికి శిక్షణ ఇవ్వడం కోసం లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

తనను చాంపియన్ చేయడమే తన తండ్రి లక్ష్యమని ఆమె గతంలో 'బీబీసీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

'చెస్ ఆటలో రష్యన్లదే ఆధిపత్యంగా ఉండేది.. రష్యన్ల పేర్లలో యూ, వీ, వై అక్షరాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే నా పేరులోనూ వై అక్షరాన్ని చేర్చారు మా నాన్న' అని ఆమె గుర్తు చేసుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ర్యాపిడ్ చెస్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన హంపికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

ఆమె విజయం భారత్‌కు గర్వకారణమని.. ఈ ఏడాది భారత్ చెస్‌కు చాలా మంచి సంవత్సరమని ఆయన అన్నారు.

హంపిని చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అభినందించారు. చివరి రౌండ్‌లో ఆమె అద్భుతంగా ఆడారంటూ ఆనంద్ ప్రశంసించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)