నేపాల్ విమాన ప్రమాదం, 18 మంది మృతి

ఫొటో సోర్స్, BBC Nepali
నేపాల్‌లో శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బుధవారం కూలిపోయింది.
కఠ్మాండూలోని త్రిభువన్ ఎయిర్‌పోర్ట్ నుంచి పోఖ్రా వెళ్లాల్సిన ఈ విమానం టేకాఫ్ సమయంలోనే కూలిపోయింది.
ఈ ఘటనలో 18 మంది చనిపోయారని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. ఒక పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు.
శౌర్య ఎయిర్‌లైన్స్ చెప్తున్న ప్రకారం ప్రమాదం జరిగేటప్పటికి విమానంలో 19 మంది ఉన్నారు.
వారంతా విమాన సిబ్బంది, విమానయాన సంస్థ ఉద్యోగులని.. ప్రయాణికులు లేరని శౌర్య ఎయిర్‌లైన్స్ అధికారి ఒకరు ‘బీబీసీ నేపాలీ’తో చెప్పారు.
సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫొటోలలో మంటల్లో కాలుతున్న విమానం, పొగ కనిపిస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది


ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేపాలీ ఆర్మీ తమ బృందాన్ని పంపించింది.
ప్రమాద స్థలంలో కొన్ని మృతదేహాల్ని గుర్తించినట్లు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న ఒక పోలీస్ అధికారి బీబీసీతో చెప్పారు.
ప్రమాద స్థలం నుంచి మృతదేహాల్ని వెలికి తీసినట్లు కఠ్మాండూ పోస్ట్ వెల్లడించింది.
కొన్నేళ్ల క్రితం త్రిభువన్ ఎయిర్‌పోర్ట్ వద్ద బంగ్లాదేశ్ ప్రయాణికుల విమానం కూలిపోవడంతో అందులోని పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోయారు.

ప్రాణాలతో బయటపడ్డ పైలట్
విమాన ప్రమాదం జరిగినట్లు తమకు 11:15 గంటలకు సమాచారం అందిందని కఠ్మాండూ వ్యాలీ పోలీస్ కార్యాలయ అధికార ప్రతినిధి దినేశ్‌రాజ్ మైనాలీ వెల్లడించారు.
కాలిపోతున్న విమానం నుంచి ఒక పైలట్‌ను రక్షించామని, వెంటనే ఆయనను కఠ్మాండూ మెడికల్ కాలేజీ టీచింగ్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















