హైదరాబాద్‌లో కూరగాయల ధరలు పెరిగిపోవడానికి కారణం ఇదేనా
టమాటా.. మిర్చి.. బెండకాయ.. బీరకాయ.. ఇలా ఏ కూరగాయ ధర చూసినా మండిపోతోంది.
సీజన్ మార్పులను పక్కన పెడితే స్థానికంగా లభ్యత తగ్గిపోతుండటం ధరలపై ప్రభావం చూపుతోంది.
అధికారిక లెక్కల ప్రకారం హైదరాబాద్ నగరానికి రోజూ 250 టన్నుల కూరగాయలు అవసరం. కానీ సరఫరా అంతగా లేదు. చుట్టుపక్కల జిల్లాల రైతులు కూరగాయల సాగును వదిలేస్తుండటంతో సరఫరాపై ప్రభావం పడి ధరలు పెరగడానికి కారణమవుతోంది.

హైదరాబాద్ చుట్టూ ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పదేళ్ల కిందట దాదాపు లక్ష పది వేల ఎకరాల్లో కూరగాయలు సాగయ్యేవి.
గతేడాది కూరగాయల సాగు 62800 ఎకరాలకే పరిమితమైంది. తెలంగాణవ్యాప్తంగా పరిశీలిస్తే కోటి 30 లక్షల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారు.
ఇందులో 3 లక్షల 11వేల ఎకరాలలోనే కూరగాయలు పండుతున్నాయి.
సాగునీటి వసతి పెరగడంతో హైదరాబాద్ శివారుల్లోనూ వరి సాగు గతంతో పోల్చితే మూడింతలు పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
పూర్తి వివరాల కోసం పై వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి:
- కస్టమర్ కేర్ ఉద్యోగాల పేరుతో వ్యభిచారం, సైబర్ క్రైమ్లోకి
- పార్ట్ టైమ్ జాబ్ స్కామ్స్: ఫేక్ ఉద్యోగ సైట్లను ఎలా గుర్తించాలి, మోసపోకుండా ఏం చేయాలి
- హైటెక్ బెగ్గింగ్: ఆన్లైన్లో సాయం అడుక్కునేవారి నుంచి 70 శాతం కమీషన్ తీసుకుంటున్న టెక్ సంస్థ
- 'స్పామ్ కాల్స్ గోలేంట్రా బాబూ' అని మీకెప్పుడైనా అనిపించిందా... దీనికి విరుడుగు ఏంటి?
- BBC Investigation: మహిళల నగ్న చిత్రాలతో వ్యాపారం చేస్తున్న రహస్య ప్రపంచం గుట్టురట్టు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















