మండుటెండల్లో ఉడుకుతున్న దిల్లీ, రాజస్థాన్.. ఫలోదీలో 50 డిగ్రీలు

ఫొటో సోర్స్, Getty Images
దేశంలోని ఉత్తరాధి రాష్ట్రాల్లో వడగాలులు, తీవ్రమైన ఎండలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.
పలు రాష్ట్రాల్లో గురువారం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. శనివారం రాజస్థాన్‌లోని ఫలోదీలో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఆదివారం బర్మర్ సిటీలో 49.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
దేశ రాజధాని దిల్లీలో ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 44 డిగ్రీ సెల్సియస్ నమోదు కాగా, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో ఐఎండీ సీనియర్ సైంటిస్ట్ నరేశ్ కుమార్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, Getty Images
రాబోయే మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, వచ్చే నాలుగైదు రోజుల్లో వర్షం పడే సూచనల్లేవని ఆయన చెప్పారు.
బుధవారం వరకు ఈ హీట్‌వేవ్ కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పింది.
ఎండల కారణంగా విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో పలు ప్రాంతాలు నీటి కొరత, విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock

ఫొటో సోర్స్, Getty Images
బుధవారం రోజున దిల్లీలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 8,000మెగావాట్లకు చేరింది. దిల్లీ చరిత్రలోనే ఇది అత్యధికం.
దిల్లీలో భయంకర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వారం అంతా ఎండల తీవ్రత 45-46 డిగ్రీలుగా నమోదైంది.
అధిక స్థాయిలోని తేమ కారణంగా హీట్ ఇండెక్స్ 50 డిగ్రీలను దాటిపోయిందని వాతావరణ నిపుణులు అంటున్నారు.
వడదెబ్బ సంబంధిత అనారోగ్యాలతో ఆసుపత్రిలో చేరిన రోగుల కోసం ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ తరహా రోగుల సంఖ్య పెరుగుతోంది.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలో భరించలేని స్థాయిలో వేడి ఉందని రోహిత్ నాయర్ అన్నారు. ఆయన దిల్లీలోని ఓ అడ్వర్టయిజింగ్ కంపెనీలో పని చేస్తున్నారు.
‘‘దిల్లీ ఎండతో కుతకుతలాడుతోంది. ఎండలతో తీవ్రంగా అలసిపోతున్నాం. మధ్యాహ్నం వేళల్లో అడగు బయటపెట్టట్లేదు. ఇంట్లో కూడా వేడి కారణంగా ఉండలేకపోతున్నాం. ఏసీ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేం’’ అని నాయర్ అన్నారు. ..

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
ఏసీలు కూడా పనిచేయట్లేదు
ఎండ కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నామని ఏఎన్‌ఐతో మరో దిల్లీ నివాసి చెప్పారు.
వేడి కారణంగా కార్లలో ఏసీలు కూడా పనిచేయట్లేదని వెల్లడించారు.
మునుపటి కంటే ఈసారి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇవి కూడా చదవండి:
- అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- తెల్ల గుడ్లు, ఎర్ర గుడ్లు: వేటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి?
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్: పింఛన్లు ఇంకా అందకపోవడానికి అసలు కారణమేంటి? ఈసీ ఏం చెప్పింది?
- కుప్పం నియోజకవర్గానికి నీళ్లొచ్చాయా? రాలేదా? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














