తమిళనాడు వరదలు: ఊరేదో, చెరువేదో తెలియట్లేదు!

వీడియో క్యాప్షన్, తమిళనాడు: ఊరేదో, చెరువేదో తెలియట్లేదు
తమిళనాడు వరదలు: ఊరేదో, చెరువేదో తెలియట్లేదు!

తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో వరద బీభత్సం తీవ్రంగా ఉంది.

భారీ వర్షాలతో పలు ఊర్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఊరేదో, చెరువేదో అర్థం కానంతగా వరద నీరు ఊళ్లను ముంచెత్తింది.

తమిళనాడులోని పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

తమిళనాడు వరదలు

టుటికోరిన్, తిరునెల్వేలి జిల్లాల్లో 352 మిల్లీమీటర్లు, కన్యాకుమారిలో 118 మిల్లీమీటర్లు, తెంకాసిలో 206 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు.

పలు డ్యామ్‌లు నిండు కుండల్లా మారడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. పలు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.

తమిళనాడు వరదలు

ఫొటో సోర్స్, ANI

వరద ప్రభావిత ప్రాంతాలకు విమానాల ద్వారా ఆహార పదార్థాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)