రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లిన దిల్లీ పోలీసులు.. యాత్రలో ఆయన చెప్పిన ‘లైంగిక దాడుల బాధితుల’ సమాచారం ఇవ్వాలంటూ నోటీసులు

ఫొటో సోర్స్, ANI
‘లైంగిక దాడులకు గురైన బాధితుల’ విషయంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సమాచారం ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
దీనికి బదులుగా రాహుల్ తన ప్రాథమిక సమాధానాన్ని అందించారు.
దిల్లీ పోలీసులకు సమర్పించిన ప్రాథమిక జవాబులో వచ్చే 8-10 రోజుల్లో వివరణాత్మకంగా తాను సమాధానం చెబుతానంటూ రాహుల్ గాంధీ తెలిపినట్లు ఏఎన్ఐ రిపోర్టు చేసింది.
నాలుగు పేజీలతో తన సమాధానాన్ని రాహుల్ గాంధీ పోలీసులకు పంపారు.
భారత్ జోడో యాత్ర లాంటి కార్యక్రమాలను నిర్వహించిన ఏ అధికార పార్టీ నేతలనైనా, ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్నలు వేశారా? అని రాహుల్ గాంధీ తను పంపిన సమాధానంలో ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
అదానీ కేసు వంటి పలు విషయాలపై పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట తాను తీసుకున్న వైఖరిని పోలీసు చర్యలు ఏం చేయలేవని ఆశిస్తున్నట్లు దిల్లీ పోలీసులకు రాసిన ప్రాథమిక సమాధానంలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
‘‘మార్చి 16న మీరు నన్ను సంప్రదించారు. నాకొక ఏడు నుంచి ఎనిమిది రోజులు సమయం ఇవ్వాలని కోరాను. కానీ, రెండు రోజుల్లోనే మీరు మళ్లీ వచ్చారు. ఇది 4,000 కి.మీల పాదయాత్ర. 140 రోజుల పాటు జరిగింది. ఈ పాదయాత్రలో లక్షలాది మందిని కలిశాను. పూర్తి వివరాలు అందించేందుకు నాకు కాస్త కావాల్సి ఉంటుంది’’ అని రాహుల్ గాంధీ తన సమాధానంలో చెప్పారు.
అయితే, కాంగ్రెస్ నేత ఇచ్చిన ప్రాథమిక సమాధానంలో ఎలాంటి సమాచారాన్ని తమతో పంచుకోలేదని దిల్లీ పోలీసులు తెలిపారు.
‘‘నేను, మా బృందంతో కలిసి ఈ రోజు రాహుల్ గాంధీ నివాసంలో ఆయనతో సమావేశమయ్యాం. ఆయన భారత్ జోడో యాత్ర సందర్భంగా ప్రసంగిస్తూ ప్రస్తావించిన ‘లైంగిక వేధింపుల’ బాధితుల గురించి సమాచారం ఇవ్వాలని కోరాం’’ అని దిల్లీ శాంతి భద్రతల స్పెషల్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా అంతకుముందు మీడియాతో చెప్పారు.
‘‘ఆయన కొంత సమయం కావాలని చెప్పారు. మేం అడిగిన సమాచారం ఇస్తామన్నారు. మేం ఈ రోజు నోటీసు ఇచ్చాం. ఆయన కార్యాలయం ఆ నోటీసును స్వీకరించింది. ఒక వేళ ప్రశ్నించాల్సిన అవసరం ఉంటే మేం ఆ పని చేస్తాం’’ అని పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘రాహుల్ గాంధీ జనవరి 30వ తేదీన శ్రీనగర్‌లో మాట్లాడుతూ.. చాలా మంది మహిళలను తాను తన యాత్ర సందర్భంగా కలిశానని, వారు అత్యాచారాలకు గురయ్యారని చెప్పారు. దీనికి సంబంధించి సమాచారం సేకరించటానికి సమయం పట్టవచ్చునని, కానీ తాము సమాచారం ఇస్తామని పేర్కొన్నారు. బాధితుల వివరాలు తెలుసుకునేందుకే మేము ఇక్కడ వచ్చాం. తద్వారా బాధితులకు న్యాయం చేయొచ్చు’’ అని సాగర్ ప్రీత్ హూడా అన్నారు.
దిల్లీకి చెందిన మహిళలెవరైనా ఉన్నారో తమకు తెలియడం ముఖ్యమని, ఇది చాలా సీరియస్ విషయమని, వీరిలో మైనర్ బాధితులు కూడా ఉండొచ్చని సాగర్ హుడా అన్నారు.
కాగా, పోలీసులు రాహుల్ గాంధీ నివాసానికి రావడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
దిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ నివాసిని వెళ్లిన తర్వాత కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ వారం పది రోజుల్లో నోటీసులకు జవాబు ఇస్తానని చెప్పినపుడు పోలీసులు ఆయన నివాసానికి వెళ్లాల్సిన అవసరం ఏముందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ప్రశ్నించారు.
ఆయన ఆదివారం నాడు కాంగ్రెస్ నేతలతో కలిసి దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం నుంచి నిర్దేశాలు లేకుండా పోలీసులు ఇటువంటి చర్యలు చేపట్టారంటే నమ్మశక్యం కాదని గెహ్లాత్ విమర్శించారు.
‘‘ఇక్కడికి రావటానికి వాళ్లకి ఎంత ధైర్యం. వారి చర్యలను దేశం మొత్తం గమనిస్తోంది. దేశం వారిని క్షమించదు. ఈ రోజు చేసిన పని చాలా తీవ్రమైనది. దర్యాప్తు చేయటాన్ని ఎవరూ వ్యతిరేకించటం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా మాట్లాడుతూ.. ‘‘ఈ పరిణామాలకు నిబంధనల ప్రకారం స్పందిస్తాం. కానీ ఇలా రావటం ఎంత వరకూ సమంజసం? భారత్ జోడో యాత్ర ముగిసి 45 రోజులైంది. వాళ్లు ఇప్పుడు అడుగుతున్నారు. ప్రభుత్వం భయపడుతోందని ఈ చర్య చెప్తోంది’’ అని వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అదానీ వివాదం నుంచి దృష్టి మళ్లించటానికి వాళ్లు (బీజేపీ) పోలీసులను పంపించి ఈ ప్రశ్నలు అడుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు.
‘‘రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలు భయపడవు. అదానీని కాపాడటానికి వాళ్లు ఎంతగా ప్రయత్నించినా సరే వారిని ప్రశ్నించటం మేం కొనసాగిస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ నివాసానికి పోలీసుల రాకను కాంగ్రెస్ మీడియా వ్యవహారాల ఇన్‌చార్జ్ జైరాం రమేష్ కూడా తప్పుపట్టారు.
‘‘భారత్ జోడో యాత్ర ముగిసి 45 రోజులైంది. ఇప్పుడు వాళ్లు ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్లకు అంత పట్టింపు ఉన్నట్లయితే వాళ్లు ఫిబ్రవరిలోనే రాహుల్ గాంధీని ఎందుకు కలవలేదు? దీనిపై రాహుల్ గాంధీ లీగల్ టీం నిబంధనల ప్రకారం స్పందిస్తుంది’’ అని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఇదిలావుంటే రాహుల్ గాంధీ నివాసానికి పోలీసుల రాకను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.








