‘సూపర్ స్టార్’ కృష్ణ: తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో రేపు అంత్యక్రియలు

మహేశ్ బాబును పరామర్శిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్
ఫొటో క్యాప్షన్, మహేశ్ బాబును పరామర్శిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్

సినీ నటుడు కృష్ణ భౌతిక కాయానికి భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఇతర రాజకీయ నేతలు నివాళులర్పించారు.

తెలుగు సినీ హీరోలు చిరంజీవి, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, కల్యాణ్ రామ్, నాగ చైతన్య, దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించి మహేశ్ బాబు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న పవన్

ఫొటో సోర్స్, twitter/vamsikaka

కృష్ణ మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

కృష్ణ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను, ఆయన వ్యక్తిత్వాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.

నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి 5 దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలను తెలంగాణ సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.

350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం అన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడు గా కృష్ణ జనాదరణ పొందారని అన్నారు.

కృష్ణతో జగన్

ఫొటో సోర్స్, YSRCP

బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ పార్ధివదేహాన్ని నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసం వద్ద బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంచనున్నారు.

బుధవారం ప్రభుత్వ అధికార లాంఛనాలతో మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

తొలుత గచ్చిబౌలి స్టేడియంకు తీసుకెళ్లాలని భావించినప్పటికీ, కృష్ణ కుటుంబ సభ్యులు ఈ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

హీరో కృష్ణ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. టాలీవుడ్‌లో సుదీర్ఘకాలం నటించి ఆంధ్ర జేమ్స్‌బాండ్‌గా పేరు తెచ్చుకున్న ‘సూపర్ స్టార్’ ఘట్టమనేని కృష్ణ మృతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారంటూ ఆయన కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి చిరస్థాయిగా నిలిచారని, ఎన్నో హిట్ సినిమాలతో అభిమానులను సంపాదించుకున్నారని కీర్తించారు.

కృష్ణ మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

‘తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో మహేశ్ బాబుకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని మోదీ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సినీ హీరో కృష్ణ మృతికి సంతాపం తెలిపారు.

ఆయన వృత్తిపరమైన క్రమశిక్షణ, పని విలువలు ఎనలేనివని రాహుల్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

సినిమా రంగంలో సూపర్‌స్టార్ కృష్ణ ట్రెండ్ సృష్టించారని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

నటుడిగా, దర్శకుడిగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహసనిర్మాతగా కృష్ణగారిని చెప్పుకుంటారని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

తెలుగు సినిమాపై చెరగని ముద్రవేసిన కృష్ణ మృతిపట్ల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం వ్యక్తం చేశారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కృష్ణ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు.

యువతను ఆకట్టుకునే పాత్రలతో సినీ రంగంపై కృష్ణ ప్రత్యేక ముద్రవేశారని వెంకయ్యనాయడు అన్నారు.

సీనియర్ నటుడు కృష్ణ మరణించాడన్న విషయం జీర్ణించుకోలేనిదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

అనేక తెలుగు చిత్రాలలో సమాజాన్ని తట్టి లేపే విధంగా, ప్రజలను చైతన్యం చేసే ఎన్నో చిత్రాలలో హీరో కృష్ణ నటించి జీవించారని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు.

ఆయన తన సినిమాలతో సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎదిరించే మనస్తత్వాన్ని ప్రజలలో రేకెత్తించారని బండి సంజయ్ కుమార్ అన్నారు.

సినీ పరిశ్రమలో కృష్ణది అరుదైన వ్యక్తిత్వమని హీరో చిరంజీవి అన్నారు.

సాహసానికి పర్యాయపదం లాంటి వ్యక్తి సినీ పరిశ్రమకు దూరం కావడం దురదృష్టకరమని చిరంజీవి ట్విటర్‌లో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 6

స్వయంకృషితో ఎదిగిన సూపర్ స్టార్: బాలకృష్ణ నివాళి

కృష్ణ మృతి పట్ల నందమూరి బాలకృష్ణ సంతాపం ప్రకటించారు. కృష్ణ కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులకు తన సంతాపం తెలిపారు. సాహసానికి మారుపేరు, సాంకేతికతలో అసాధ్యుడు, స్వయంకృషితో ఎదిగిన సూపర్ స్టార్, అపర దానకర్ణుడు అంటూ బాలకృష్ణ నివాళులర్పించారు.

వర్ధమాన నటులు, కళాకారులకు ఆయన ఆదర్శప్రాయుడని చెప్పారు.

ఇటీవలే తన సోదరుడిని, తల్లిని కోల్పోయిన మహేశ్ బాబు ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోవడం బాధాకరమని బాలకృష్ణ అన్నారు.

బాలకృష్ణ ఫేస్ బుక్ పోస్ట్

ఫొటో సోర్స్, facebook/nandamuribalakrishna

ఆయనతో నటించిన మూడు సినిమాలూ మర్చిపోలేనివి : రజినీకాంత్

సినీహీరో కృష్ణ మృతి తెలుగు సినీరంగానికి తీరని లోటని రజినీకాంత్ అన్నారు. ఆయనతో మూడు సినిమాల్లో నటించానని, ఆ మూడు సినిమాలూ తనకు ఎన్నటికీ గుర్తుండిపోతాయని రజినీ కాంత్ అన్నారు.

కృష్ణ కుటుంబానికి ఆయన తన సానుభూతి తెలిపారు.

కాగా కృష్ణ, రజినీకాంత్‌లు రామ్ రాబర్ట్ రహీమ్, ఇద్దరూ అసాధ్యులే, అన్నదమ్ముల సవాల్ అనే మూడు సినిమాల్లో నటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 7

కృష్ణతో పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, twitter

చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.

కృష్ణ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించానని, ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు.

స్నేహశీలి, మృదుస్వభావి అయిన కృష్ణ ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారని, మద్రాస్ లో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో చక్కటి అనుబంధం ఉందని, కృష్ణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

ఘట్టమనేని కుటుంబానికి భగవంతుడు గుండె నిబ్బరం ఇవ్వాలని నటి, ఏపీ మంత్రి రోజా అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 8

ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, సాహసోపేతమైన నిర్ణయాలతో సూపర్ స్టార్ కృష్ణది తెలుగు పరిశ్రమైన విలక్షణ వ్యక్తిత్వమని జూనియర్ ఎన్టీయార్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 9
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 9

కృష్ణ మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని నటి రాధిక అన్నారు. మహేశ్ బాబు కుటుంబానికి సంతాపం తెలియజేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 10
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 10

గొప్ప నటుడిగా కృష్ణ తెలుగు వారి గుండెల్లో నిలిచిపోతారని హీరో సాయి ధరమ్ తేజ్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 11
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 11

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)