ప్లాస్టిక్ ఏరుతూ, చెత్త శుభ్రం చేస్తూ నల్లమల అడవిలో అరుదైన మొక్కలను కాపాడుతున్న పర్యావరణ కార్యకర్త

వీడియో క్యాప్షన్, ప్లాస్టిక్ ఏరుతూ నల్లమల అడవిలో మొక్కలను కాపాడుతున్న పర్యావరణ కార్యకర్త
ప్లాస్టిక్ ఏరుతూ, చెత్త శుభ్రం చేస్తూ నల్లమల అడవిలో అరుదైన మొక్కలను కాపాడుతున్న పర్యావరణ కార్యకర్త

పల్నాడు జిల్లా కారెంపూడి గ్రామానికి చెందిన కొమెర అంకా రావు ముద్దుపేరు జాజి.

ఈయన అడవిని కాపాడటమే పనిగా పెట్టుకుని ఇప్పటికి వేల కిలోల చెత్తను నల్లమల నుంచి బయటకు తీసుకువచ్చారు.

40 ఏళ్ల జాజి దాదాపు పాతికేళ్లుగా ఈ పని చేస్తున్నట్టు చెప్పారు.

తనకున్న ఎకరం పొలంలో జొన్న, సజ్జ కలపి వేశారు జాజి. సేంద్రీయ పద్ధతిలో ఆ పొలంలో పండిస్తున్నారు. అయితే పంట పండాక పొలం కోయకుండా అలా వదిలేస్తారు. వాటిని పక్షులు తింటాయి.

స్కూళ్లకు వెళ్లి అక్కడి పిల్లలకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తుంటారు. అందరూ ప్రకృతిని కాపాడాలంటూ హితబోధ చేస్తుంటారు.

కొమెర జాజి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)