రెండు యుద్ధ విమానాలు.. ఆకాశంలో ఢీకొని కుప్పకూలాయి

వీడియో క్యాప్షన్, రెండు యుద్ధ విమానాలు.. ఆకాశంలో ఢీకొని కుప్పకూలాయి
రెండు యుద్ధ విమానాలు.. ఆకాశంలో ఢీకొని కుప్పకూలాయి

డాలస్ దగ్గర జరుగుతున్న ఎయిర్‌షోలో శనివారం నాడు రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన రెండు పాతకాలపు యుద్ధ విమానాలు.. ఆకాశంలో ఢీకొని కుప్పకూలాయి.

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోల్లో.. ఆ రెండు విమానాలు తక్కువ ఎత్తులోనే ఢీకొనటం, ఒక విమానం సగానికి విరిగిపోవటం కనిపిస్తోంది. అవి కూలిపోయిన తర్వాత భారీ మంట చెలరేగింది.

ఈ రెండు విమానాల్లో ఎంత మంది ఉన్నారు, ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.

ఈ విమానాల్లో ఒకటి బోయింగ్ బి-17 ఫ్లయింగ్ ఫోర్ట్రెస్. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ మీద అమెరికా గెలవటానికి బీ-17 బాంబర్ ప్రధాన పాత్ర పోషించింది.

రెండో విమానం ‘పి-63 కింగ్‌కోబ్రా’ యుద్ధ విమానాన్ని కూడా అదే వార్‌లో ఉపయోగించారు.

అమెరికాలో మాజీ సైనికుల గౌరవార్థం ‘వింగ్స్ ఓవర్ డాలస్ ఎయిర్‌షో’ పేరుతో రెండో ప్రపంచ యుద్ధం సంస్మరణగా మూడు రోజుల పాటు వైమానిక విన్యాసాలను నిర్వహిస్తున్నారు.

విమానాలు ఢీకొని కుప్పకూలటం ‘ఘోర విషాద’మంటూ డాలస్ మేయర్ ఎరిక్ జాన్సన్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్యా ఇంకా నిర్ధరణ కాలేదని, అయితే నేల మీద ఎవరూ గాయపడలేదని ఆయన ఒక ట్వీట్‌లో చెప్పారు.

యుద్ధ విమానాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)