బాత్రూమ్‌లో రూ. 27 వేల కోట్ల విలువైన బిట్‌కాయిన్లు.. డార్క్‌నెట్ వెబ్‌సైట్ నుంచి దొంగిలించి దాచేశారు..

ఫొటో సోర్స్, US DOJ
ఒక పేరుమోసిన డార్క్‌నెట్ వెబ్‌సైట్ నుంచి దొంగిలించిన 336 కోట్ల డాలర్ల (సుమారు రూ. 27 వేల కోట్లు) విలువైన బిట్‌కాయిన్లను స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా న్యాయశాఖ వెల్లడించింది.
చోరీకి గురైన 50,676 బిట్‌కాయిన్లను హ్యాకర్ ఇంట్లో నేల కింద దాచిన డివైస్‌లు, పాప్‌కార్న్ డబ్బాలో దాచిన డివైస్‌లలో కనుగొన్నారు.
డార్క్‌వెబ్‌లోని అక్రమ మార్కెట్ ‘సిల్క్ రోడ్’ నుంచి 2012లో ఈ బిట్‌కాయిన్లను కొల్లగొట్టినట్లు హ్యాకర్ జేమ్స్ జాంగ్ అంగీకరించారు.
ఇంత పెద్దమొత్తంలో బిట్‌కాయిన్లను స్వాధీనం చేసుకోవడం చరిత్రలో ఇది రెండోసారని అధికారులు తెలిపారు.
జార్జియాలోని జాంగ్ ఇంటిపై పోలీసులు ఏడాది కిందట దాడి చేసినప్పటికీ ఆ వివరాలు ఇప్పుడు వెల్లడించారు.

ఫొటో సోర్స్, US DOJ
బిట్‌కాయిన్ విలువ గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు వీటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీటి విలువ 110 కోట్ల డాలర్లు (సుమారు రూ. 8,980 కోట్లు) ఉంటుంది.
నేల కింద రహస్యంగా ఉన్న బీరువాలో ఉంచి హార్డ్ డ్రైవ్‌లు, ఇతర స్టోరేజ్ డివైస్‌లు, బాత్రూమ్‌లోని కప్‌బోర్డ్‌లో ఉంచిన పాప్‌కార్న్ డబ్బాలో దాచిన చిన్న కంప్యూటర్‌లో ఈ బిట్‌కాయిన్లు దాచినట్లు అధికారులు గుర్తించారు.
డార్క్‌వెబ్‌లోని సిల్క్ రోడ్ మార్కెట్ ప్లేస్‌లోని వెబ్‌సైట్‌లో లోపాలు ఉండడంతో దాన్ని వాడుకుని జాంగ్ ఈ బిట్‌కాయిన్లు కొల్లగొట్టినట్లు పోలీసులు చెప్పారు.
2012 సెప్టెంబర్‌లో డార్క్‌నెట్ మార్కెట్ ప్లేస్‌లోజాంగ్ అనేక ఖాతాలు తెరిచి తన డిజిటల్ వ్యాలెట్‌లో కొద్దిమొత్తంలో బిట్‌కాయిన్‌ను డిపాజిట్ చేశారు.
ఎలాంటి అనుమానం రాకుండా పెద్ద మొత్తాలను త్వరత్వరగా విత్ డ్రా చేసుకునే మార్గాన్ని జాంగ్ గుర్తించాడు.

ఫొటో సోర్స్, Getty Images
డార్క్‌నెట్‌లో మొట్టమొదటి మార్కెట్ ప్లేస్ సిల్క్ రోడ్. ఇది 2011 నుంచి 2013 మధ్య లావాదేవీలు జరిగాయి.
డ్రగ్ డీలర్లు, ఇతర అక్రమ వ్యాపారులకు ఇది అడ్డా. సిల్క్ రోడ్ కేంద్రంగా పెద్దమొత్తంలో డ్రగ్స్, ఇతర అక్రమ వస్తువుల వ్యాపారం సాగేది.
డార్క్‌నెట్ అనేది ప్రత్యేక సాఫ్ట్‌వేర్ల సహాయంతో యాక్సెస్ చేయగల ఇంటర్నెట్ ఏరియా.
సిల్క్‌రోడ్ మార్కెట్ ప్లేస్‌ను ఏర్పాటుచేసిన రాస్ ఉల్‌బ్రిచ్‌ను అరెస్ట్ చేశాక 2015లో ఆయనకు యావజ్జీవ శిక్ష పడింది.
కాగా వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు జాంగ్ నవంబర్ 4న అంగీకరించారు. దొంగిలించిన బిట్‌కాయిన్లు, వాటిని దాచిన స్టోరేజ్ డివైస్‌లను పోలీసులకు అప్పగించారు.
ఈ కేసులో ఆయన 20 ఏళ్ల వరకు శిక్ష పడొచ్చు.
జాంగ్ దాచిపెట్టిన బిట్‌కాయిన్లను పోలీసులు క్రిప్టోకరెన్సీ ట్రేసింగ్ టెక్నిక్‌లను ఉపయోగించి గుర్తించారని లాయర్ డామియన్ విలియమ్స్ తెలిపారు.
ఎక్కడ దాచిపెట్టినా పట్టుకోగలం... పాప్ కార్న్ డబ్బా అడుగున రహస్యంగా అమర్చిన సర్క్యూట్ బోర్డులో దాచినా పట్టుకోగలిగాం... ఇదే మా సామర్థ్యానికి నిదర్శనం అంటున్నారు పోలీసులు.
కాగా 2016లో బిట్‌ఫినెక్స్ హ్యాకింగ్ కేసులో 400 కోట్ల డాలర్ల విలువైన బిట్‌కాయిన్ పట్టుకున్నారు. బిట్ కాయిన్ల స్వాధీనం చరిత్రలో ఇప్పటివరకు ఇదే అతి పెద్దది.
ఇవి కూడా చదవండి:
- బిట్‌కాయిన్: ఏడేళ్ల క్రితం వెయ్యి రూపాయలు పెడితే నేడు కోటి అయ్యాయి.. ఎలా?
- అభివృద్ధి చెందిన దేశాలు రూ.106 లక్షల కోట్ల పరిహారం చెల్లించాలని పేద దేశాల డిమాండ్.. ఎందుకు
- ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ నుంచి ఇంటర్నేషనల్ క్రిమినల్‌గా మారిన హష్పప్పీకి 11 ఏళ్ల జైలు శిక్ష
- ఆంధ్రప్రదేశ్: రెడ్లు, కాపుల మధ్య ఆధిపత్య పోరులో ఇప్పటం నలిగి పోతోందా
- ‘ఆడవాళ్లు రోజుకో గంట అదనంగా నిద్రపోతే 14 శాతం ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటారు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














