ఏంజెలినా జోలి, బ్రాడ్ పిట్ విడాకులు

ఏంజెలినా జోలి, బ్రాడ్‌పిట్, హాలీవుడ్ దంపతులు, మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఏంజెలినా జోలి, బ్రాడ్‌పిట్
    • రచయిత, జాక్ బర్గెస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలి, బ్రాడ్ పిట్ విడాకుల విషయంలో ఒక అంగీకారానికి వచ్చినట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు.

అయితే ఈ అంశం గురించి బ్రాడ్ పిట్ న్యాయవాది నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

బ్రాడ్‌పిట్ తరఫు న్యాయవాదులను తాము సంప్రదించగా ఎలాంటి స్పందన రాలేదని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.

ఏంజెలినా జోలి, బ్రాడ్‌పిట్ 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరుగురు పిల్లలున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘దాంపత్యంలో వివాదాల వల్ల’ తాము విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు ఏంజెలినా జోలి 2016లో చెప్పారు.

ఏంజెలినా విడాకుల ప్రకటన చేసిన తర్వాత ఈ జంట పిల్లల కోసం కొన్ని నెలల పాటు న్యాయపోరాటం చేసింది.

పిల్లలు తల్లిదండ్రులిద్దరి సంరక్షణలో ఉండాలని 2021లో న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

2005లో మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ సినిమా విడుదలైన తర్వాత ఫ్యాన్స్ ఈ జంటను బ్రాంజెలినా అని పిలవడం మొదలు పెట్టారు.

ఏంజెలినాను పెళ్లి చేసుకోవడానికి ముందే బ్రాడ్ పిట్‌కు జెన్నిఫర్ ఎనిస్టన్‌తో వివాహం అయింది.

బ్రాడ్ పిట్‌తో పెళ్లి కావడానికి ముందు ఏంజెలినా బిల్లీ బాబ్, జానీ లీ మిల్లర్‌లను పెళ్లి చేసుకుని విడిపోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)