పాకిస్తాన్ బౌలర్ హారిస్ రవూఫ్: కోహ్లీ కాకుండా హార్దిక్, దినేశ్ కార్తీక్ కొడితే బాధపడేవాడిని

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

‘విరాట్ కోహ్లీ కాకుండా హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ కొట్టి ఉంటే చాలా బాధపడే వాడిని’

ఈ మాటలు అన్నది పాకిస్తాన్ బౌలర్ హారిస్ రవూఫ్.

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చేసిన పోరాటం అందరికీ తెలిసిందే. చివరి బంతి వరకు సాగిన ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.

హారిస్ రవూఫ్ వేసిన 19వ ఓవర్‌లో చివరి రెండు బంతులకు విరాట్ కోహ్లీ కొట్టిన రెండు సిక్సులు క్రికెట్ చరిత్రలోనే ‘క్లాసిక్ షాట్స్’గా చాలా మంది ప్రశంసించారు.

‘అది అతని(విరాట్ కోహ్లీ) క్లాస్. అలాంటి షాట్స్ అతను ఆడతాడు. ఆ రెండు సిక్సులను అతను(కోహ్లీ) తప్ప మరొక ప్లేయర్ కొట్టలేడు.

దినేశ్ కార్తీక్ లేదా హార్దిక్ పాండ్య కొట్టి ఉంటే కచ్చితంగా నేను బాధపడేవాడిని’ అని క్రిక్‌విక్ అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

‘విరాట్ కోహ్లీ, నీ జీవితంలోనే ఇది అత్యుత్తమమైన ఇన్నింగ్స్.

నీ ఆట చూడటం కనులకు ఒక పండగ. రవుఫ్ వేసిన 19వ ఓవర్లో బ్యాక్ ఫుట్ మీద కొట్టిన సిక్స్ అత్యంత అద్భుతమైనది’ అంటూ గతంలో సచిన్ తెందూల్కర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

పాకిస్తాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 52 బంతుల్లో 83 పరుగులు చేశాడు. చివరి 8 బంతుల్లో 28 పరుగులు తీయాల్సి ఉండగా 19వ ఓవర్ చివరి రెండు బంతుల్లో విరాట్ కోహ్లీ రెండు అద్భుతమైన సిక్సులు కొట్టాడు.

‘షేన్ వార్న్ వేసిన ఒక బంతి బాల్ ఆఫ్ ది సెంచరీ అయితే 5వ బాల్‌కు విరాట్ కోహ్లీ కొట్టిన సిక్స్ కచ్చితంగా షాట్ ఆఫ్ ది సెంచరీ అవుతుంది.

షార్జాలో సచిన్ తెందూల్కర్, వాంఖడేలో ధోనీ, మెల్‌బోర్న్‌లో విరాట్ కోహ్లీ... క్రికెట్ చరిత్రలో మరుపురాని మరణంలేని మధుర క్షణాలు’ అంటూ రాజ్‌దీప్ సర్దేశాయ్ అప్పట్లో ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

‘అసాధ్యం అనేది లేదు’

పాకిస్తాన్, భారత్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు బీబీసీ స్పోర్ట్స్ ప్రతినిధి మాథ్యూ హెన్రీ అప్పుడు స్టేడియంలోనే ఉన్నారు.

విరాట్ కోహ్లీ ఆడిన తీరు గురించి ఆయన గతంలో ఇలా రాశారు...

ఎనిమిది బంతులకు 28 పరుగులు చేస్తేనే భారత్ విజయం సాధిస్తుంది. అప్పుడు కుడిచేతి వాటం బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీ.. హరీస్ రవూఫ్ వేసిన బంతిని బ్యాక్‌ఫుట్‌పై డ్రైవ్ చేస్తూ బౌలర్ తలమీదుగా బౌండరీ లైన్ దాటించాడు.

ఇదే షాట్ మనుషులు కొట్టి ఉంటే.. అది కచ్చితంగా వాళ్లు ఔటై, అవమానభారంతో కుప్పకూలిపోయేలా చేసేది. కానీ, ఈ షాట్ కొట్టింది విరాట్ కోహ్లీ.

ఈ షాట్ ఫలితంగా మొదలైన హోరు బహుశా బెంగళూరులో ఉన్నవాళ్లకు కూడా వినిపించి ఉంటుంది.

ఆట ముగిసేలోపు మరో రెండుసార్లు విరాట్ కోహ్లీ బంతిని బౌండరీ దాటించాడు. కోహ్లీ శక్తి అంతకంతకూ పెరుగుతుంటే పాకిస్తాన్ వాడిపోయింది.

ఆట ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏ భావోద్వేగాన్ని దాచిపెట్టుకోవడానికి కష్టపడ్డాడో.. అదే భావోద్వేగాన్ని కోహ్లీ బహిర్గతం చేశాడు.

మ్యాచ్ గెలిచిన వెంటనే అతడు గ్రౌండ్‌పై కూలబడి తన పిడికిలితో నేలను గుద్దుతూ కనిపించాడు.

''హ్యాట్సాఫ్ టు విరాట్. భారతదేశం కోసం అతను ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇది'' అని రోహిత్ శర్మ చెప్పాడు. ''మేం ఉన్న పరిస్థితిని బట్టి, చివరికి విజయం సాధించడాన్ని బట్టి ఇది భారతదేశం గొప్ప ప్రదర్శనల్లో ఒకటి''.

2016 టీ20 ప్రపంచకప్‌లో మొహాలీలో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ఈ ప్రదర్శన ముందు అది కూడా తగ్గిపోతుందని, ఇదే తన అత్యుత్తమ ఇన్నింగ్స్ అని విరాట్ స్వయంగా అంగీకరించాడు. అప్పుడు విరాట్ 51 బంతుల్లో 82 పరుగులు చేయగా, ఈరోజు 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు. రెండు సార్లూ నాటౌట్‌గా నిలిచాడు.

''మాటల్లేవ్. ఎలా జరిగిందో తెలియట్లేదు. నేను నమ్మకాన్ని వదులుకోలేదు. చివరివరకూ ఆడాలనుకున్నా. నిజంగా నాకు మాటలు దొరకట్లేదు'' అని కోహ్లీ అన్నాడు. ''ఇది అసాధ్యం అనిపించింది''. కోహ్లీ లాంటి సూపర్‌స్టార్లకు అసాధ్యం అనేది ఏదీ లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)