ఆంధ్రప్రదేశ్: ఎల్‌ఈడీ వెలుగుల్లో చామంతి పూల సాగు

వీడియో క్యాప్షన్, ఎల్‌ఈడీ వెలుగుల్లో చామంతిపూల సాగు
ఆంధ్రప్రదేశ్: ఎల్‌ఈడీ వెలుగుల్లో చామంతి పూల సాగు

గోదావరి తీరంలో కొన్ని ప్రాంతాల్లో చామంతి పూల సాగు చేస్తున్నారు.

పగటి పూట చామంతులతో అందంగా ఉండే పొలాలు.. ఇప్పుడు రాత్రిళ్లు ఎల్‌ఈడీ వెలుగులతో కొత్తగా కనిపిస్తున్నాయి.

చామంతి మొక్కలకు ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటు వెనుక ఒక కారణం ఉంది.

చామంతుల సాగులో నారు ముఖ్యమైంది. నారు తయారు కావాలంటే త్వరగా మొగ్గలు రాకూడదు. అప్పుడే కాండం బలపడి ఎక్కువ నారు తయారవుతుంది. అందుకే మొక్కలు వేగంగా పూలు పూయకుండా ఇలాంటి లైటింగ్ ఏర్పాటు చేశామని రైతులు చెబుతున్నారు.

తమ అవసరాల మేరకు చామంతి నారు సిద్ధంగా లేకపోవడంతో రైతులు ఇలా ప్రత్యామ్నాయ పద్ధతులు పాటిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాలతో పాటు కృష్ణా, గోదావరి తీరంలో చామంతుల సాగు ఎక్కువ.

చామంతుల సాగులో పగటి సమయం ఎక్కువ ఉండడం ఉపయోగకరమని, లైటింగ్ ద్వారా దానిని కృత్రిమంగా ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రీయ అనుభవమేనని చెబుతున్నారు.

చామంతులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)