39 ఏళ్ల తర్వాత మళ్లీ పెను వరదల్లో చిక్కుకున్న నగరం, వర్ష బీభత్సం 9 ఫోటోల్లో...

కోల్‌కతా వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నగరంలోని చాలా చోట్ల మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. పసిబిడ్డతో వరద నీటిలో నడుచుకుంటూ వెళుతున్న మహిళ.
    • రచయిత, అనహిత సచ్‌దేవ్
    • హోదా, బీబీసీ న్యూస్

కోల్‌కతాలో గత 39 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు 10 మందికి పైగా చనిపోయారు.

వీరిలో తొమ్మిది మంది నిలిచిన వాన నీళ్లలో కరెంట్ ప్రవహించడం వల్ల విద్యుత్ షాక్‌తో మృతి చెందారు.

సోమవారం రాత్రి నుంచి కోల్‌కతా నగరం, దాని శివారు ప్రాంతాల్లోని నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు వాననీటితో జలమయం అయ్యాయి.

అనేక కీలక రోడ్లు నీళ్లలో మునిగిపోగా, రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు మోకాళ్ల లోతు నీటిలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కోల్‌కతాలో దుర్గా పూజకు ప్రజలు సన్నద్ధం అవుతున్న వేళ ఈ వరదలు నగరంలో పోటెత్తాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
కోల్‌కతాలోని చాలా కీలక రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, కోల్‌కతాలోని చాలా కీలక రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. బస్సుల్లోకి నీళ్లు వచ్చేంతగా రోడ్ల మీద నీరు చేరుకుంది.

నగరంలో 24 గంటల వ్యవధిలో 251.4మి.మీ వర్షపాతం కురిసినట్లు రికార్డులు చెబుతున్నాయి. 1986 తర్వాత కోల్‌కతాలో ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే మొదటిసారి.

అలాగే గత 137 ఏళ్లలో ఈ రీజియన్‌లో ఒకేరోజు కురిసిన ఆరో అత్యధిక వర్షపాతం కూడా ఇదే.

కోల్‌కతా వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిలిచిన నీళ్లలోంచి ఒక రిక్షా పుల్లర్ ఇలా రిక్షా నడుపుకుంటూ వెళ్లడం కనిపించింది.

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ భారీ వర్షాలు కురిసినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది.

నగరంలో రానున్న కొన్ని రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

నివాస ప్రాంతాల్లోకి వరద నీరు రావడంతో చాలా ఆస్తి నష్టం జరిగింది

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, నివాస ప్రాంతాల్లోకి వరద నీరు రావడంతో చాలా ఆస్తి నష్టం జరిగింది. నట్టింట్లో నీళ్లు నిండగా, ఓ వ్యక్తి ఇలా ఫోన్ చూసుకుంటూ గడిపారు.

ఇంతటి వర్షాన్ని తానెప్పుడూ చూడలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. వానల వల్ల జరిగిన ప్రాణనష్టానికి చింతిస్తున్నట్లు, బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

9 మంది కరెంట్ షాక్‌తో చనిపోవడంతో, ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి అధికారులు చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

కోల్‌కతా వర్షాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరదల కారణంగా నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఓ కాలనీలో కూరగాయలు అమ్ముకునే వ్యక్తి ఇలా తన బండిని నిలిపి కూరగాయలు అమ్ముకోవడం కనిపించింది.

నగరంలో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా లోకల్ ట్రైన్లు రద్దు కావడంతో నగరంలోని సీల్డా రైల్వే స్టేషన్‌లో వందల మంది ప్రయాణికులు వేచి చూస్తున్నారు

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, భారీ వర్షాల కారణంగా లోకల్ ట్రైన్లు రద్దు కావడంతో నగరంలోని సీల్దా రైల్వే స్టేషన్‌లో వందల మంది ప్రయాణికులు వేచి చూశారు.
వరద నిండిన వీధిలోకి టెంపో ఎక్కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ప్రజలు

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, వరద నిండిన వీధిలోకి టెంపో ఎక్కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ప్రజలు.
వరద బీభత్సం

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, అనేక దుర్గా పూజ మండపాల్లోకి వరద నీరు చేరింది
దుర్గా పూజ సమయంలో వేల మంది భక్తులు మండపాల దగ్గరికి వస్తుంటారు

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, దుర్గా పూజ సమయంలో వేలమంది భక్తులు మండపాల దగ్గరికి వస్తుంటారు. కానీ ఆ మండపాల దగ్గర కూడా పెద్ద ఎత్తున నీరు చేరి ఇలా కనిపించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)