మిస్ యు రివ్యూ: లవ్ ఫార్ములా మిస్ ఫైర్ అయిందా?

ఫొటో సోర్స్, 7 MILES PER SECOND PRODUCTIONS/FaceBook
- రచయిత, శృంగవరపు రచన
- హోదా, బీబీసీ కోసం
'బాయ్స్' సినిమాతో పరిచయమైన సిద్ధార్థ్ తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
'బొమ్మరిల్లు', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', 'ఓయ్' లాంటి సినిమాలతో 'లవర్ బాయ్' ఇమేజ్‌తో తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాడు.
ప్రయోగాత్మక సినిమాల్లో చేస్తూ, ఈ సంవత్సరం 'ఇండియన్ -2'లో కూడా మెరిసిన సిద్ధార్థ్ చాలా కాలం తర్వాత చేసిన లవ్ డ్రామా సినిమానే 'మిస్ యూ.' ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.


ఫొటో సోర్స్, 7 MILES PER SECOND PRODUCTIONS/FaceBook
కథ ఏంటి?
వాసుదేవన్ (సిద్ధార్థ్), సుబ్బలక్ష్మి (ఆషికా రంగనాథ్) పెళ్ళి చేసుకుంటారు. వాళ్ళు ఎందుకు విడిపోయారు? మళ్ళీ సుబ్బలక్ష్మి కావాలని వాసు ఎందుకు వెంటపడ్డాడు? వాళ్లిద్దరూ కలిసారా? లేదా?అన్నదే కథ.
ఎలా నటించారంటే
వాసుగా సిద్ధార్థ్, సుబ్బలక్ష్మిగా ఆషికా రంగనాథ్‌ల నటన విడిగా పర్లేదు. పెయిర్‌గా మాత్రం ఈ ఇద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ నప్పలేదు. సుబ్బలక్ష్మి పాత్రని ఇంకా బలంగా డెవలప్ చేసి ఉంటే బావుండేది. జయప్రకాష్, శరత్ లోహితస్వా, కరుణాకరన్‌ల నటన పర్లేదు.

ఫొటో సోర్స్, 7 MILES PER SECOND PRODUCTIONS/FaceBook
'మిస్ యూ' పూర్తిగా లవ్ స్టోరీని బిల్డ్ చేసే సినిమా. ఇప్పటివరకు సిద్ధార్థ్ ప్రేమ కథలతో చేసిన సినిమాలన్నీ కూడా దాదాపు హిట్ అయినవే. కానీ, కథను గజిబిజి చేయడం వల్ల ఈ లవ్ ట్రాక్ ఈ సినిమాలో మిస్ ఫైర్ అయ్యింది.
'లవ్ స్టోరీ'లో ఉండే ఎమోషనల్ క్యారెక్టర్స్ ఈ సినిమాలో ప్రేక్షకులకి కనిపించవు. అటు వాసు, ఇటు సుబ్బలక్ష్మి పాత్రలు రెండూ కూడా స్ట్రాంగ్‌గా అనిపించవు. ఈ రెండు పాత్రల మధ్య ఎమోషనల్ బాండింగ్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు.
'ఇంటర్మీడియట్ మెమరీ లాస్' అన్నది ఎంతో స్ట్రాంగ్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్‌తో సస్పెన్స్ లేదా కామెడీ ట్రాక్‌ను ఎస్టాబ్లిష్ చేస్తే స్టోరీ ఇంకా ఎంగేజింగ్‌గా ఉండేది. మొత్తం మీద లవ్ ఫార్ములా మిస్ ఫైర్ అయిన సినిమా ఇది.

ఫొటో సోర్స్, 7 MILES PER SECOND PRODUCTIONS/FaceBook
డైరెక్షన్
సినిమాలో బాగా నటించే నటులు ఉన్నా, వారిని కథకు తగ్గ పాత్రలుగా మలచడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు.
కథ ఏంటో, ప్రేక్షకులకు ఇంటర్వెల్ వచ్చేవరకు అర్థం కాకపోవడం, అర్థం అయ్యేసరికి స్టోరీ మొత్తం అర్థమైపోవడం రెండూ సినిమాకు మైనస్ పాయింట్స్ అయ్యాయి.
ఈ సినిమా లవ్ స్టోరీ అయినా, స్టార్టింగ్‌లో ఒక మిస్టరీ ఎలిమెంట్‌తో ఓపెన్ అవుతుంది. దాన్ని ఇంటర్వెల్ తర్వాత కనెక్ట్ చేయడంలో మాత్రమే డైరెక్టర్ మార్క్ కనబడింది.
సినిమాకు ఆత్మ అయినా లవ్ ట్రాక్ పేలవంగా ఉండటంతో, ఈ కనెక్షన్ ఎలిమెంట్ చిన్న మ్యాజిక్‌గా మాత్రమే నిలిచిపోయింది. సినిమా మొత్తానికి కథ విషయంలో ఇదొక్కటే ప్లస్ పాయింట్.

ఫొటో సోర్స్, 7 MILES PER SECOND PRODUCTIONS/FaceBook
కథలో కొత్తదనమే లేదా
సాధారణంగా లవ్ స్టోరీ తర్వాత మ్యారేజ్ స్టోరీ ఉంటుంది. కానీ, ఈ సినిమాలో ముందు పెళ్లి తర్వాత ప్రేమ కథ ఉన్నాయి.
ఈ కొత్త ప్రయత్నంలో ఎక్కడా 'లవ్' లేదు. హీరో హీరోయిన్‌ల మధ్య ప్రేమ కన్నా కోపం, ఒకరికి ఒకరు నచ్చకపోవడం, కోపాలు ఉండటంతో కొత్తదనం తేలిపోయింది. పాటలు పర్లేదనిపించాయి. సంగీతం ప్లస్ పాయింట్.
కొత్త కథతోనే సిద్ధార్థ్ వచ్చినా, దానికి నప్పే స్క్రీన్ ప్లే, స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ లేకపోవడం వల్ల పూర్తిగా నిరాశపరిచిన సినిమా 'మిస్ యు'.
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకురాలి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














