కజకిస్తాన్‌లో కూలిన ప్రయాణికుల విమానం, 38 మంది మృతి

కూలిన విమానం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రెండు ముక్కలైన విమానం

కజకిస్తాన్‌లో 67 మంది ప్రయాణీకులతో వెళుతున్న విమానం బుధవారం కూలిపోయింది. ఘటనలో 38 మంది మృతి చెందినట్లు కజకిస్తాన్ అధికారులు తెలిపారు.

అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జీ2-8243 విమానం అక్టౌ సమీపంలో అత్యవసర ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మంటలు చెలరేగాయని, అయితే వాటిని ఆర్పివేశామని అధికారులు వెల్లడించారు.

విమానం అజర్‌బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్లాల్సి ఉంది. పొగమంచు కారణంగా విమానాన్ని దారి మళ్లించారని రిపోర్టులు చెబుతున్నాయి.

అక్టౌ నుంచి 3 కి.మీ. దూరంలో విమానం "అత్యవసర ల్యాండింగ్ చేసింది" అని ఎయిర్‌లైన్ తెలిపింది.

విమానంలో ఎక్కువగా అజర్‌బైజాన్ జాతీయులు ఉన్నారు. అయితే రష్యా, కజకిస్తాన్ , కిర్గిస్తాన్‌కు చెందిన కొందరు ప్రయాణికులు కూడా ఉన్నారు.

ఘటనపై పూర్తి వివరాలకు అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్, ఎంబ్రేర్‌లను బీబీసీ సంప్రదించింది కానీ, వారు స్పందించలేదు.

ప్రమాదానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)