ఐపీఎల్ ఫైనల్ 2025: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఫైనల్ వరకు ఎలా వచ్చాయి? ఇంతకీ అహ్మదాబాద్‌లో వాతావరణం ఎలా ఉంది?

ఐపీఎల్ ఫైనల్

ఫొటో సోర్స్, Getty Images

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి వేలాదిమంది క్రికెట్ అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ రెండు జట్లలో ఏది గెలిచినా ఐపీఎల్ చరిత్రలో కొత్త ఛాంపియన్ అవతరించడం ఖాయం.

దీంతో ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా ఈ రెండు జట్లు 18 ఏళ్లుగా తమ తొలి ఐపీఎల్ ట్రోఫీ కోసం పోరాడుతున్నాయి. వాటిలో ఒక జట్టు కల నేడు నెరవేరబోతోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఐపీఎల్

ఫొటో సోర్స్, ANI

ఇప్పటికే మూడు సార్లు..

2025 ఐపీఎల్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ 9 గెలిచి, 4 ఓడి, ఒక మ్యాచ్ రద్దవడంతో 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత జరిగిన క్వాలిఫయర్ 1‌లో ఆర్‌సీబీ చేతిలో ఓడింది. అనంతరం ముంబయితో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ చేరింది.

ఇక ఆర్‌సీబీ విషయానికొస్తే.. ఈ సీజన్‌ లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడి 9 గెలిచి, 4 ఓడి, ఒక మ్యాచ్ రద్దవడంతో 19 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత జరిగిన క్వాలిఫయర్ 1లో పంజాబ్‌పై గెలిచి, ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది.

ఈ సీజన్‌లో ఆర్‌సీబీ, పంజాబ్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. ఇది నాలుగోసారి. లీగ్ దశ మొదటి మ్యాచ్‌లో పంజాబ్ గెలవగా, రెండో మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య క్వాలిఫైయర్ 1 జరగగా, ఆర్‌సీబీ గెలిచింది.

ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్

ఫైనల్ అనుభవం?

పంజాబ్ కింగ్స్ 11 ఏళ్ల తర్వాత మరోసారి ఐపీఎల్ ఫైనల్ ఆడుతోంది. చివరిసారిగా 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో ఫైనల్ ఆడింది.

పంజాబ్ జట్టు రెండోసారి ఐపీఎల్ ఫైనల్ ఆడుతోంది.

మరోవైపు బెంగళూరు జట్టుకు ఇది నాలుగో ఐపీఎల్ ఫైనల్.

గతంలో ఆడిన మూడూ (2009,11,16) ఓడింది. ఆర్‌సీబీ 9 ఏళ్ల క్రితం 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తన చివరి ఐపీఎల్ ఫైనల్ ఆడింది.

వాతావరణం ఎలా ఉంది?

కాగా, అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయ కలిగించే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అహ్మదాబాద్‌లో ఆకాశం రోజంతా మేఘావృతంగా ఉండొచ్చని, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ అరుణ్‌కుమార్ దాసానే ఇండియా టుడే వార్తాసంస్థతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)