'వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ అవార్డు' గెలుచుకున్న చిత్రాలను మీరు చూశారా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు-2023' లను కింద పేర్కొన్న ఈ ఫోటోలు గెలుచుకున్నాయి.
లండన్‌లోని నాచురల్ హిస్టరీ మ్యూజియం 59 ఏళ్లుగా ఈ ప్రతిష్ఠాత్మక పోటీని నిర్వహిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 వేల మంది పాల్గొన్న ఈ పోటీల్లో వాస్తవికత, సాంకేతిక నైపుణ్యం, కథనం, నైతికత ఆధారంగా ఆ చిత్రాలను ఎంపిక చేశారు.
19 కేటగిరీల్లో విజేతలను ప్రకటించారు. కానీ, గ్రాండ్‌ప్రైజ్ మాత్రం కింద చూపించిన త్రీ స్పిన్డ్ హార్స్‌షూ క్రాబ్ (ఒక రకమైన గుర్రపుడెక్క పీత)కి వచ్చింది.

ఫొటో సోర్స్, LAURENT BALLESTA
ఫోటోగ్రాఫర్ లారెంట్ బల్లెస్టా తీసిన గుర్రపు డెక్క ఫోటోకు 'గ్రాండ్ టైటిల్ అవార్డు' వచ్చింది.
ఫిలిప్పీన్స్‌లోని పంగటలాన్ ద్వీపంలోని సముద్ర జలాల్లో గుర్రపు డెక్క పీతల కోసం వెతుకుతున్నప్పుడు బల్లెస్టా ఈ 'త్రీ స్పైన్డ్ హార్స్‌షూ క్రాబ్' ఫోటోను తీశారు.

ఫొటో సోర్స్, AMIT ESHEL
‘యానిమల్స్ ఇన్ దేర్ ఎన్విరాన్‌మెంట్’ కేటగిరీలో అమిత్ ఇషెల్ తీసిన నుబియాన్ ఐబెక్స్ ఫోటోకు అవార్డు వచ్చింది.
జిన్ ఎడారిలో ఉన్న ఒక కొండ శిఖరంపైకి అమిత్ వెళ్లినప్పుడు ఈ రెండు నుబియాన్ ఐబెక్స్ వన్యప్రాణులు ఒకదానికొకటి ఇలా పోట్లాడుకుంటూ కనిపించాయి.

ఫొటో సోర్స్, BERTIE GREGORY
బ్రిటన్‌కు చెందిన బెర్టి గ్రెగోరి తీసిన ఈ ఫోటోకు ‘మామ్మల్ బిహేవియర్’ కేటగిరీలో అవార్డు లభించింది.
కిల్లర్ వేల్స్‌ను వెతుక్కొంటూ అంటార్కిటికా ప్రాంతంలో రెండు నెలల పాటు సముద్ర యాత్ర చేసి బెర్టి గ్రెగోరి ఈ ఫోటోను తీశారు.
మంచులో కూరుకుపోయిన సీలు అనే సముద్రపు జంతువును వేటాడేందుకు ప్రాణాంతక తిమింగలాలు (కిల్లర్ వేల్స్) సిద్ధమవుతున్నట్లు ఈ ఫోటో చూపిస్తోంది.

ఫొటో సోర్స్, SRIRAM MURALI
తమిళనాడుకు చెందిన శ్రీరామ్ మురళి తీసిన తుమ్మెదల ఫోటోకు ‘ఇన్వర్టబ్రేట్ బిహేవియర్’ కేటగిరీలో అవార్డు లభించింది.
అన్నామలై టైగర్ రిజర్వులో రాత్రిపూట నక్షత్రాల వెలుతురులో ఎగురుతున్న తుమ్మెద దృశ్యాలను తన కెమెరాలో బంధించారు శ్రీరామ్.
ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూపించేందుకు యాభై 19-సెకండ్ ఎక్స్‌పోజర్లను కలిపారు.

ఫొటో సోర్స్, HADRIEN LALAGÜE
ఫ్రాన్స్‌కు చెందిన హడ్రియెన్ లాలాగ్యూ తీసిన ట్రంప్ పెటర్ పక్షుల ఫోటోకు ‘బర్డ్ బిహేవియర్’ కేటగిరీలొ అవార్డు దక్కింది.
గయానా అంతరిక్ష కేంద్రానికి చుట్టుపక్కలున్న ఒక అడవిలో పామును చూస్తున్న బూడిద రెక్కల ట్రంప్‌పెటర్ పక్షులు ఒక లైన్లో నిల్చోడం ఆయన కెమెరాకు చిక్కాయి.

ఫొటో సోర్స్, MIKE KOROSTELEV
రష్యాకు చెందిన మైక్ కోరోస్టెలెవ్ తీసిన హిప్పోల ఫోటోకు 'అండర్ వాటర్' కేటగిరీలో అవార్డు లభించింది.
దక్షిణాఫ్రికాలోని కోసి బేలోని షాల్లో సరస్సులో ఒక హిప్పో, దాని రెండు పిల్లలు సేద తీరుతున్న దృశ్యమది.

ఫొటో సోర్స్, EKATERINA BEE
ఇటలీకి చెందిన 'ఎకటెరినా బీ' తీసిన డాల్ఫిన్ ఫోటోకు అవార్డు దక్కింది.
11-14 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి పొందే కేటగిరీలో ఎకటెరినా ఈ అవార్డును గెలుచుకున్నారు
స్కాట్లాండ్ పశ్చిమ తీరంలో ఐస్లే ఆఫ్ స్కై పర్యటనకు వెళ్లినప్పుడు బాటిల్‌నోస్ డాల్ఫిన్ల ఫోటోను ఎకటెరినా తీశారు.

ఫొటో సోర్స్, JOAN DE LA MALLA
స్పెయిన్‌కు చెందిన 'జాన్ దె లా మల్లా' తీసిన ఫోటోకు ది బిగ్ పిక్చర్ కేటగిరిలో అవార్డు దక్కింది.
ఇండోనేయాలోని జకార్తా నుంచి వెళ్తున్న అత్యంత కాలుష్య భరితమైన సిలివుంగ్ నది ఏరియల్ వ్యూను జాన్ దె లా మల్లా తన కెమెరాలో బంధించారు.
ఇవి కూడా చదవండి
- పొన్నాల లక్ష్మయ్య, డీఎస్, కేకే - తెలంగాణ: ఈ పీసీసీ మాజీ అధ్యక్షులంతా కాంగ్రెస్‌ను ఎందుకు వీడారు?
- రుషికొండ మీద రూ. 270 కోట్లతో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంప్ కార్యాలయం కోసమేనా... వీటిపై ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోంది?
- టవర్ ఆఫ్ సైలెన్స్: పార్సీలు తమ బంధువుల మృతదేహాలను రాబందులకు ఎందుకు వదిలేస్తారు?
- ప్రవళిక ఆత్మహత్యపై నాయకులు, విద్యార్ధి సంఘాల వాదనేంటి, పోలీసులు ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














