కర్నూలు జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం... టెంపో, లారీ ఢీకొన్న ఘటనలో 14 మంది మృతి Newsreel

కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండలం, మాదాపురం సమీపంలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి-44పై లారీ, టెంపో ఢీకొన్న ఘటనలో 14 మంది చనిపోయారు.
వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేందుకు అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని జీజీహెచ్ డాక్టర్లను, డీఎంహెచ్ఓలను కలెక్టర్ ఆదేశించారు.
లారీ ఢీకొని నుజ్జునుజ్జయిన టెంపోలో 18 మంది ప్రయాణిస్తున్నారని తెలిసింది. మృతులలో ఎనిమది మంది మహిళలు, అయిదుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు. మరో నలుగురు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టం పట్ల ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నారులు సహా చాలా మంది చనిపోవడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన జగన్, బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని, పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఒక ట్వీట్‌లో మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అత్యంత విచారకరమైన ఘటన అని చెబుతూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని మోదీ అన్నారు.
2019లోనూ దాదాపు ఇదే ప్రాంతంలో భారీ ప్రమాదం
వెల్దుర్తి మండలంలో ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశానికి మరికొన్ని కిలోమీటర్ల దూరంలో 2019 మే నెలలో కూడా దారుణమైన యాక్సిడెంట్ చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామవరం గ్రామానికి చెందినవారు గుంతకల్లులో ఒక వివాహ నిశ్చితార్థ వేడుకకు వెళ్లి తూఫాన్ వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఇవి కూడా చదవండి:
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
- నేపాల్ వెళ్తే జేబు ఖాళీయే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









