లాటరీలో 40 లక్షలు... ఒకే వ్యక్తికి వరసగా రెండుసార్లు బంపర్ ప్రైజ్

ఫొటో సోర్స్, Getty Images
మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌కు చెందిన అమెజాన్ ఉద్యోగి కేవలం 5 డాలర్ల స్క్రాచ్ కార్డుతో, 50 వేల డాలర్ల(దాదాపు రూ. 40 లక్షలు) లాటరీ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ఈ ఉద్యోగి ఇలా గెలుపొందడం వరుసగా ఇది రెండోసారి.
ఈ 56 ఏళ్ళ వ్యక్తి గత జనవరిలో కూడా ఇలాగే స్క్రాచ్ కార్డుతో కూడా 30 వేల డాలర్లను (రూ.24 లక్షలకు పైగా) గెలుచుకున్నట్లు మేరిల్యాండ్ లాటరీ తెలిపింది.
అమెజాన్ సంస్థలో పని చేస్తున్న ఈ వ్యక్తి ఒక మద్యం దుకాణం నుంచి ఈ స్క్రాచ్ కార్డును కొనుగోలు చేశారు. గత జనవరిలో లాటరీ గెల్చిన ఈ వ్యక్తికే మళ్లీ ఫిబ్రవరి నెల లాటరీ కూడా తగిలింది.
''టిక్కెట్ వైపు చూసి, అది నిజమైనది కాదని నేను అనుకున్నాను. నేను నా గర్ల్‌ఫ్రెండ్‌ను పిలిచి, దాన్ని చూడమని చెప్పాను. 'నాకేమీ పిచ్చెక్కలేదు కదా' అని అడిగాను. ఆమె నా వైపు ఒక చూపు చూసి, 'నమ్మలేకపోతున్నాను!' అని అరిచింది'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ లాటరీ విన్నర్ చెప్పారు.
ఈ డబ్బును ఎలా ఖర్చు చేయాలో ఇంకా నిర్ణయించలేదని లాటరీ అధికారులకు ఈ వ్యక్తి చెప్పారు. కానీ, తన గర్ల్‌ఫ్రెండ్ 60వ బర్త్‌డేకి తనని హాలిడేకి తీసుకెళ్లాలనిపిస్తుందన్నారు.
అలాగే కొత్త కారు కూడా కొనుగోలు చేయాలని ఉందని ఆయన తెలిపినట్లు లాటరీ అధికారులు చెప్పారు.
5 డాలర్ల(రూ.414)కు స్క్రాచ్‌కార్డును కొనుగోలు చేయడం ద్వారా 50 వేల డాలర్లను గెల్చుకోవడం మామూలు విషయం కాదు.
క్రేజీ 8ఎస్ గేమ్ ఇలాంటి వేలాది బహుమతులను అందిస్తుంది. ఈ బహుమతుల రేంజ్ 5 డాలర్ల నుంచి 1,000 డాలర్ల మధ్యలో ఉంటాయి.
మరో రెండు స్క్రాచ్ కార్డులను కూడా ఈ వ్యక్తి గెలుచుకున్నారు. 1 డాలర్ కార్డుపై 20 డాలర్లను సంపాదించగా, మరో 5 డాలర్ల కార్డుపై ఆయన ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి పొందారు.
ఈ వ్యక్తి స్క్రాచ్ కార్డులు కొనుగోలు చేసిన తూర్పు బాల్టిమోర్‌లోని రోజ్‌వుడ్‌లో మిట్ రోజ్‌డేల్ లిక్కర్స్ దుకాణానికి మేరిల్యాండ్ లాటరీ నుంచి 500 డాలర్ల బోనస్ వచ్చింది.
వరుసగా లాటరీలు గెలుపొందడమన్నది చాలా అరుదు. కానీ, అసలు జరగలేదని చెప్పలేం. గతంలో మసాచుసెట్స్‌కు చెందిన ఒక వ్యక్తి 'అంతరాత్మ ప్రబోధం' ప్రకారం లాటరీ టికెట్లు కొనుక్కుని గత డిసెంబర్‌లో ఆరుసార్లు లాటరీలు గెల్చుకున్నారు.

ఫొటో సోర్స్, MASSACHUSETTS STATE LOTTERY
'అంతరాత్మ ప్రబోధం' గెలిపిస్తుందా?
వియత్నాంకు చెందిన ఆ వ్యక్తి గత డిసెంబర్లో లాటరీ టికెట్ కొందామని మసాచుసెట్స్‌లోని ఓ లిక్కర్ షాపులోకి వెళ్ళారు. ఆయన దాదాపు 20 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు. ఈసారి కొనేటప్పుడు, 'ఒకటి కాదు, ఆరు టికెట్లు కొను' అని ఆయన అంతరాత్మ చెప్పిందట. అంతేకాదు, వేరే నంబర్లేమీ వాడొద్దు, టికెట్ల మీద ఉన్నవి మాత్రమే తీసుకో అంటూ తన మనసు చెప్పిన మాటను ఆయన ఫాలో అయిపోయారు.
ఇంకేముంది, ఆ ఆరు టికెట్లూ ఆయనకు తగిలాయి. ఆ లక్కీ ఫెలో పేరు రేమండ్ రాబర్ట్స్. మొత్తంగా, 3,90,000 డాలర్లు ఆయన ఆ టికెట్లతో గెల్చుకున్నారు. అంటే, దాదాపు 3.22 కోట్ల రూపాయలు ఆయన సొంతమయ్యాయి. అయిదు టికెట్లకు వచ్చే డబ్బునంతా ఆయన ఒకేసారి తీసుకున్నారు. ఆరో టికెట్ ప్రైజ్ విషయంలో మాత్రం యాన్యుటీ ఆప్షన్, అంటే ఏడాదికి రూ. 20 లక్షల చొప్పున తీసుకునే పద్ధతిని ఎంచుకున్నారు.
ముందుగా ఓ మాంచి మోటార్ బైక్ కొంటానని రాబర్ట్స్ చెప్పారు. ఆయన ఆడిన ఆట పేరు లక్కీ ఫర్ లైఫ్. ఇప్పుడదే ఆయన పేరు అయిపోయింది.
అమెరికాలో లాటరీ టికెట్ల మీద, స్క్రాచ్ కార్డుల మీద అత్యధికంగా ఖర్చు చేసేది మసాచుసెట్స్ ప్రజలే.

ఇవి కూడా చదవండి:
- రాజస్థాన్‌లో ముస్లిం యువకుల కిడ్నాప్, హరియాణాలో అన్నదమ్ములను కారుతో పాటు తగులబెట్టారు... అసలేం జరిగింది?
- చిరుత పులులు వచ్చేశాయ్.. దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్ చేరుకున్న మరో 12 చిరుతలు
- పాంగొలిన్: ప్రపంచంలో అత్యధికంగా వేటకు బలయ్యే జంతువు ఇది.. దీని పొలుసులకు ఎందుకంత డిమాండ్?
- బీబీసీ ఇండియా: ‘మమ్మల్ని నేరుగా అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్తాం’
- మహా శివరాత్రి: మానవాకారంలో శివుడు ఎక్కడ ఉన్నాడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









